ఆర్.కె. లక్ష్మణ్ గారికి క్షమాపణలతో.............

Monday, June 14, 2021

 

దక్షిణ భారతం అంతా ఇదే పరిస్థితి.

మొన్న తోటలో ఫాంపాండ్ తవ్వించుకున్నాను. మట్టి తోలే ట్రాక్టర్ డ్రైవర్ ఇంకొకతనికి బండి నేర్పిస్తున్నాడు. చెరువు దగ్గర అతనిని నడపవద్దని చెప్పాను, ఎక్కడ తిరగేసేస్తాడో అని. కొద్ది దూరం వెళ్ళాకా కుర్రాడికి ఇచ్చేవాడు. ఆ కుర్రాడు మట్టి దింపేచోట తిరగేసేసాడు. ఓనర్‌ ఏమీ మాట్లాడకుండా దాన్ని లేపించాడు. అదేమిటి తిట్టడం లేదు అని అడిగాను. ఇప్పుడు వీడిని తిడితే, ఆ డ్రైవర్‌కు కోపం వస్తుంది అని చెప్పాడు. వాడికి కోపం వస్తే ఏమి జరుగుతుందో తెలిసిందే కదా.


నేను, 1997లో చెరువులు చేస్తున్నప్పుడు, తాడేపల్లిగూడెం ప్రక్కనున్న చేబ్రోలులో ఒక మాజీ ఎంఎల్‌ఏ గారింటిలో అద్దెకుండేవాడిని. ఒకసారి ఇందిరాగాంధీ హైదరాబాద్ వచ్చినప్పుడు, మీటింగులో ఈయనలాంటి పంచెకట్టు వాళ్ళను చూసి, మీరు పొలాలు అమ్మేసుకొని ఏమైనా పరిశ్రమలు పెట్టుకోండి, ఏ ప్రభుత్వం వచ్చినా కమ్మీవాడు చెప్పిన దానిని అమలుపరచవలసిందే, ముందు ముందు మీరు వ్యవసాయం చెయ్యలేరు, ఎవడూ మీ మాట వినడు, వాళ్ళను కూర్చోబెట్టి డబ్బులు పంచవలసిందే అని చెప్పిందంట. ఆ మాట చెపుతూ ఆయన సాయిబాబూ నువ్వు ఈ చేపల చెరువులు అవీ చెయ్యలేవు, నీకు లౌక్యం తెలియదు, నువ్వు ఉద్యోగం చేసుకోవడమే మంచిది అని అన్నారు.

ఇదే మాటను బాబుగారూ కూడా అన్నారు. అది వాస్తవం. వైఎస్సార్ పుణ్యమా అని చదువుకున్న ఇంజనీర్, మా పాలేర్లకంటే తక్కువ జీతానికి ఉద్యోగానికి దొరుకుతున్నాడు కానీ పని చేసేవాడు దొరకడం లేదు. వ్యవసాయానికే అని కాదు, మెకానిక్‌‌కు, ఎలక్ట్రానిక్స్ రిపేర్ చేసే అతనికి, ఎలక్ట్రీషియన్‌కు, ఆఖరుకు తాపీ మేస్త్రీకు కూడా పని వచ్చిన మనుషులు దొరకడం లేదు.

బీహార్, బెంగాల్, ఒడిస్సా, యూపి, ఝార్ఖండ్, చత్తీస్‌ఘడ్ లాంటి రాష్ట్రాలు అభివృద్ధి చెందితే, దక్షిణాది రాష్ట్రాలలో ఒక్క పని నడవదు.

సమాజంలో అందరూ ఉండాలి, వాళ్ళకు డబ్బు అవసరం కలగాలి, అప్పుడే సమాజం నడుస్తుంది.

సమసమాజం అనేది ఉండదు, మాటల్లో చెప్పుకోవడానికే.

నేను ఇటువంటి పోస్టులు ఫేస్‌బుక్‌లో పెట్టినప్పుడు నన్ను చాలా మంది విమర్శిస్తారు, కానీ వాళ్ళే రోడ్డు మీద ఎవడైనా దుక్కలా ఉండి, అడుక్కోవడానికి వస్తే, దున్నపోతులా ఉన్నావు, ఏదైనా పనిచేసుకోవచ్చు కదా అని బూతులు తిడతారు. కానీ అదే పని ప్రభుత్వం ఉచితాలు అని చేస్తుంటే, డబ్బులు అలా ఇవ్వడం వలన అవి మార్కెట్టులోకి వస్తాయి, రొటేషన్ పెరుగుతుంది అని ఇక్కడ మనకు ఎకనామిక్స్ చెపుతారు. కానీ వాళ్ళు మాత్రం, వెనుక ఆస్తులు ఉన్నా తిని కూర్చోకుండా ఉద్యోగాలో, వ్యాపారాలో చేసుకుంటూ ఉంటారు.

చైనాలో లాగా పని చెయ్యని వాడిని కొట్టి పనిచేయించే పరిస్థితి వస్తే కానీ, దేశం బాగుపడదు

Sunday, December 25, 2016

హిందూ మతాధికారులు - కొత్త పైత్యాలు.

ప్రపంచం అంతా, ఆదిమ మానవుడి కాలం నుండీ ఉన్నది, విగ్రహారాధన మాత్రమే. దీనికి ఋజువులు ప్రపంచ వ్యాప్తంగా తవ్వకాలలో బయటపడుతున్న దేవీ, దేవతల విగ్రహాలే. ఆ తరువాతి కాలంలో అప్పటి కాలానికి, ప్రాంతానికి తగ్గట్టు రకరకాల మతాలు మొదలయ్యాయి. 

అలా భారతదేశంలో మొదలయినవే జైన, బౌద్ధమతాలు. అవి హిందుత్వం నుండి విడివడినా, జైనం మన దేశంలో, భౌద్ధం మన దగ్గర కొద్దిగా, బయట దేశాలలో ఎక్కువగా మనగలుగుతున్నాయి.

అలాగే ఇస్లాం, క్రిస్టియానిటీ, జొరాస్ట్రియనిజం, కొద్దిగా జుడాయిజం మన దేశంలో ఆచరించబడుతున్నాయి. అంతరించిపోవడానికి దగ్గరగా ఉన్న జొరాస్ట్రియనిజం మన దేశంలోనే ఎక్కువగా ఉంది.

కానీ ఇప్పుడు హిందుత్వం అంటూనే కొంతమంది తమ సొంత సిద్ధాంతాలను (పైత్యాలను) వ్యాప్తి చేస్తున్నారు. దానికి వారు హిందుత్వాన్ని వాడుకుంటున్నారు.

వీటికి మొదట ఆజ్యం పోసిన వ్యక్తి రజనీశ్. దానికి కొనసాగింపా అన్నట్టు, ఈ మధ్యన పశ్చిమ దేశాలలో మొదలయిన న్యూడ్ యోగా, పవర్ యోగా లాంటివి. ప్రతీ ఒక్కడూ యోగాని శారీరక వ్యాయామంలా చూస్తున్నాడు తప్ప, ఏకాగ్రత కోసం చేసే ప్రయత్నాలలో మొదటిది యోగా అనే విషయాన్ని గ్రహించడం లేదు. ఎనభై ఐదు కేజీల బరువుకు శరీరాన్ని పెంచడం మీద ఉన్న శ్రద్ధను, మనసును అదుపు చేసుకోవడానికి నేను చూపించలేదు కాబట్టే, నాలాంటి వారితో ముందుగా యోగాని సాధన చేయిస్తారు తప్ప, అది శరీరబరువును తగ్గించే వ్యాయమం మాత్రమే కాదు.

ఇక ఈ మధ్యన కొంతమంది మఠాధిపతులు ఇంటికి వస్తే ఇంత, కారు ఎక్కితే ఇంత, పాదాలకు నమస్కారం చేయించుకోవడానికి ఇంత అనీ వసూలు చేస్తున్నారు. సాధుసంతులు పాద నమస్కారానికి అంతగా ఇష్టపడరు, వారు ఎంతో సాధన చేసి, ఆ స్థాయికి వచ్చారు. సాధన మానివేస్తే వారు తిరిగి నాలాంటి వారి స్థాయికి జారిపోతారు.


 ఇప్పుడు ఓం శాంతి వాళ్ళు స్త్రీలతో బొట్టు తీయించి, తెల్లచీరలు కట్టించి మెడిటేషన్ గురించి చెపుతున్నారు. ఇటువంటి వాటిని మనం మొదట్లోనే తుంచవలసిన అవసరం ఉంది.

ఈ క్రింద ఫోటోని చూడండి. ఎవరు ఎవరినైనా పూజించుకోవచ్చు, అందులో ఎవరికీ ఎటువంటి అభ్యంతరం ఉండదు. కానీ శాస్త్రాల మీద ఆధారపడి, క్రతువులు జరిపే హిందుత్వంలో, కొన్ని పద్ధతులు ఉన్నాయి. హిందుత్వాన్ని వాడుకునే ఎవరైనా, వాటికి లోబడే ఉండాలి కానీ, తమకు పేరు, ప్రఖ్యాతులు వచ్చాయి కాబట్టి, తాము ఏది చేసినా చెల్లుబాటు అవుతుంది అనుకుంటే కుదరదు. ఆయనకు జీసస్ అంటే ఇష్టం ఉన్నప్పుడు, ఆయన జీసస్ ఫొటోని/ విగ్రహాన్ని వేరే మందిరంలో ఉంచుకోవచ్చు. అలా కాదు, అందరూ సమానమే అని చెప్పాలంటే, ముందుగా వారు పీఠాలను వదిలి సామాన్యుడిలా అందరిలో కలిసిపోవాలి తప్ప, సామాన్యుడు మమ్మల్ని తాకడానికి అర్హత లేనివాడు అని ప్రవర్తించడం కుదరదు. 

ఎవరైనా, హిందుత్వానికి లోబడి మాత్రమే వారి సిద్ధాంతాలను వ్యాప్తిచేసుకోవాలి తప్ప, సొంత పైత్యాలను హిందుత్వం పేరు చెప్పి వ్యాప్తి చెయ్యడం మానుకోవాలి. అప్పుడే వారికి గౌరవం, వారు చెప్పే సిద్ధాంతానికి గౌరవం. 

ఒక సామాన్య హిందువుగా, వారికంటే మనకే ఎక్కువ హక్కు ఉంది, ఈ ధర్మం మీద.





Wednesday, November 4, 2015

అసహనం



గత నెల రోజులుగా భారతదేశంలో "హిందువుల్లో అసహనం" పెరిగింది అనే మాట చాలా ఎక్కువగా వినిపిస్తోంది. ఇది చాలా విచిత్రమైన వాదన. దీనిని చూసి గర్వపడాలో, లేక కొన్ని వేల సంవత్సరాల అవహేళన తరువాత, ఒకటి రెండు సంఘటనలకే ఇంత అల్లరి జరుగుతున్నందుకు, తమ చేతకాని తనానికి సిగ్గుపడాలో అర్ధం కావడం లేదు. అన్నిటికంటే హాస్యాస్పదం ఏమిటంటే, ఈ నెల రోజుల్లోనే, గోవధను వద్దన్నందుకు ఒక హిందువుని, మసీద్ ముందు హారన్ కొట్టాడని ఇంకొక హిందువును చంపారు. కానీ, ఈ సిక్యులరిస్టులకు ఈ రెండు సంఘటనల మీద కూడా స్పందించాలి అని అనిపించలేదు.

ఈ దేశ దౌర్భాగ్యం, రాష్ట్రపతి స్థానంలో కూర్చున్న వ్యక్తులు కాంగ్రెస్ కొమ్ముకాయడం. రాష్ట్రపతి ఎన్నికలలో పోటీకి నిలబడినప్పుడు, మన ప్రణబ్ ముఖర్జీ గారు, జైలులో ఉన్న ఆర్ధిక నేరగాడు (?) జగన్‌ని కలసి ఓటు వేయించవలసిందిగా ప్రాధేయపడి రావడం. ఆ స్థానానికి పోటీ పడే వ్యక్తి, పాటించవలసిన కనీస పద్ధతిని కూడా పాటించని వ్యక్తి, అధికారంలోకి వచ్చాకా ఇలా కాక, ఇంకెలా ఉంటాడు?

మొత్తానికి హిందువు, అతి కొద్ది అసహనం ఇన్ని ప్రకంపనలను సృష్టించింది అంటే, నిజంగానే హిందువు ఆ అసహనంతో తిరుగుబాటు చేస్తే, ఈ అవార్డుల డబ్బా రాయుళ్ళందరూ ఎక్కడకు పరిగెడతారు? షారూక్‌ఖాన్ లాంటి ముసల్మానులకు పరవాలేదు, ముష్టోడిలా భావించి, పాకిస్థానో, సౌదీ అరేబియానో రానిస్తారు. కానీ ఈ హిందూ కుహనా లౌకిక వాదులను ఏ దేశం రానిస్తుంది? చైనానా లేక ఇటలీనా? ఇటలీ గురించి నాకు అంతగా తెలియదు, చైనా వెళితే మాత్రం, ఇలాంటి పిచ్చి కూతలు కూస్తే, రెండో నిముషం యమధర్మరాజు దర్శన భాగ్యాన్ని పొందుతారు.

Saturday, October 31, 2015

అజ్ఞాని ఘోష.



నాకు బాగా గుర్తునేను ఏడో తరగతిలో ఉండగాసరిగ్గా చదవడం లేదనిఅల్లరి బాగా చేస్తున్నానని 

మా నాన్నగారు నన్నుకుట్టు మిషన్ బెల్ట్‌తో కొట్టారు. మోకాలి మీద ఆ మచ్చనాకు 

గుర్తున్నంతవరకు డిప్లొమా చదివేటప్పుడు కూడా ఉండేది. ఆ తరువాతపదో తరగతిలో కాకినాడ 

నుండి విజయవాడలో ఉన్న బుచ్చయ్య మాష్టార్ దగ్గరకు పంపారు. అక్కడ నుండి ఇరవై రోజుల్లో 

బెంగపెట్టుకొని ఇంటికి వెళ్ళిపోయాను. మా నాన్నగారికి కొట్టీకొట్టీ విసుగొచ్చివీడికి ఇక చదువు 

రాదు అని వదిలేసారు. ఏదో అత్తెసరు మార్కులతో డిప్లొమా పూర్తి అయ్యిందనిపించాను.



నాకు చదువు సరిగ్గా రాకపోవడంఒక అజ్ఞానిలా మిగిలిపోవడం వలన చచ్చినవాడూచంపబడ్డ 

వాడు హిందువాముసల్మానాక్రిస్టియన్నా అనే భేధాన్ని గుర్తించే శక్తి నాకు రాలేదు. ఎవడు

చచ్చినా వాడి మీద జాలితోచచ్చిన వాడి బంధువులు తిరగబడి చంపితే బాగుండును అనుకునే 

రాక్షస/ జంతు ప్రవృత్తి అలా ఉండిపోయిందిచదువు లేదు కదా.


అలాగే హలాల్ చేసిన మాంసం తినడం మానివేసినప్పుడుముస్లిం సోదరులను భోజనానికి 

పిలిస్తేరొయ్యలు కాకినాడ నుండి తెప్పించి వండించే హ్రస్వ దృష్టితో ఉండిపోయాను.



ఇతర మతాల దేవుళ్ళను దిగజార్చి మాట్లాడే శక్తి నాకు రాలేదు. ఇతర మతాల వారి అలవాట్లను 

కించపరచే ఆలోచనలు రాలేదు. ప్రక్కవాడు అసహ్యించుకునే గన్నవరం సీమ పంది మాంసాన్ని

అతను బాధపడేటట్టు బహిరంగంగా తినడం రాలేదు. ఆస్తికుడు మూర్ఖుడు అంటూవాడిని 

మారుస్తానని చెప్పిద్వేషాన్ని చిమ్మడం రాలేదు. కన్నతల్లితండ్రులుచదువు చెప్పిన గురువుల 

తరువాత స్థానాన్ని పొందేనేను నమ్మే నా దేవుళ్ళ విగ్రహాల మీదమూత్రం పోస్తాను అన్నవాడిని 

హేతువాదిమేధావి అని గుర్తించే జ్ఞానం రాలేదు.


వీటన్నిటి వలన నాకు ఏ అవార్డూ రాలేదూఇప్పుడు వాటిని తిరిగిచ్చి

మేధావిని అని పేరు పొందే అవకాశమూ రాలేదు. ప్చ్.  :( 



Friday, February 27, 2015

గత రెండు రోజులుగా, ఆంధ్రా ప్రాంత ఆర్థిక స్థితి మీద ఎగతాళిగా మాట్లాడుతున్న తెలంగాణా నాయకుల మాటలు ఏమన్నా ఆంధ్రా ప్రాంత నాయకులకు, ముఖ్యంగా చంద్రబాబు నాయుడుకు వినిపిస్తున్నాయా? లేక వినిపించకుండా, చెవుల్లో గుడ్డలు కుక్కేసుకున్నారా? 1956లోనే మాది మిగులు బడ్జెట్ అని వాళ్ళు చెపుతున్న మాటలు తెలంగాణా సోదరుల్లాగే ఆంధ్రా నాయకులు కూడా నమ్ముతున్నారా? రాష్ట్ర సంపదనంతా తీసుకొని వచ్చి ఒకే ప్రాంతంలో గుమ్మరించి, ఈ రోజు ఆంధ్రా ప్రాంతానికి అన్యాయం చేసింది ఖచ్చితంగా చంద్రబాబు నాయుడే. హైదరాబాద్ ఆదాయం లేకపోతే తెలంగాణా పరిస్థితి ఏమిటో అందరికీ తెలిసిందే. హైదరాబాద్‌ని మాత్రమే అభివృద్ధి చేసి, ఆంధ్రులు ఇన్ని అవమానాలు పడే పరిస్థితి తీసుకువచ్చింది ఆంధ్రా ప్రాంత నాయకులే. ఇప్పుడు కూడా వీళ్ళు ఇలాగే ప్రవర్తిస్తున్నారు. రాజధాని అంటూ, దాని కోసం లక్ష కోట్లు ఖర్చు పెట్టడానికి సిద్ధపడుతున్నారు తప్ప, మిగిలిన జిల్లాల గురించి మాట్లాడడం లేదు. ఇప్పుడు కూడా అదే తప్పు చెయ్యడానికి ఆయన కంకణం కట్టుకున్నాడు.
లోటు బడ్జెట్ అంటూ ఒక ప్రక్క బీద అరుపులు అరుస్తూ, ఎవడి సొమ్మని పిఆర్‌సి అనౌన్స్ చేసారో తెలియడం లేదు. ఇష్టం వచ్చినట్టు చంద్రన్న కానుకలు అంటూ కోట్లు విసురుతూ, ఖజానాను ఖాళీ చేస్తూ ఇప్పుడు కేంద్రం మీద పడుతున్నారు. అప్పు చేసి సోకులు చెయ్యడం ఏమీటో, తీర్చేది తనూ, తన పార్టీ కాదనా ఆయన ధైర్యం. కేంద్రం మీద తిరగబడడానికి ఎందుకు వెనుకాడుతున్నారో ఆయన చెప్పవలసిన అవసరం ఉంది. స్పెషల్ స్టాటస్ అనేది రాదని అందరికీ తెలుసు, వేరే విధంగా అయినా సొమ్ములు రాబట్టాలి కదా. ఎందుకు వెనుకాడుతున్నారు? లక్ష కోట్ల రాజధాని అని అందరూ విమర్శిస్తారని అనుమానమా? మనకంటే ముందు ఏర్పాటయిన మూడు కొత్త రాష్ట్రాలు నెమ్మదిగా రాజధానిని కట్టుకుంటున్నాయి కానీ, రాత్రికి రాత్రే రాజధాని కట్టాలి అని ఉరకలేదు. వాళ్ళు ముందు రాష్ట్ర అభివృద్ధి మీద దృష్టి పెట్టారు. మన నాయకులు మాత్రం రాజధాని పేరు చెప్పి, రియల్ వ్యాపారాలు చేసుకుంటున్నారు. చివరికి ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం రియల్ ఎస్టేట్ బ్రోకర్‌లా మిగిలిపోయేటట్టుంది.
ఐదారు సంవత్సరాల సమయం పట్టే ఎంఎన్‌సి ల గురించే ఆలోచిస్తున్నారు తప్ప, ఆరేడు నెలలలో తయారయ్యి, ఎక్కువ మందికి ఉపాధి కల్పించే చిన్న పరిశ్రమల గురించి ఆలోచన కూడా చెయ్యడం లేదు. ఎంత సేపూ కేంద్రం స్పెషల్ స్టాటస్ ఇవ్వలేదనే సాకు చూపిస్తున్నారు కానీ, రాష్ట్రం తరపున ఒక్క ప్యాకేజీ ప్రకటించడం లేదు. ప్రక్క రాష్ట్రంలో మూత పడిన పరిశ్రమలను ఆకర్షించే ప్రయత్నం ఒక్కటీ చెయ్యడం లేదు. అంటే హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ తగ్గడం చంద్రబాబు నాయుడికి ఇష్టం లేదా? ఎవడన్నా వ్యాపారం చెయ్యడానికి అప్పు గురించి వెళితే, అప్పిచ్చేవాడు, వీడు నిజంగా వ్యాపారానికే వాడతాడా, లేక షోకుల కోసం వాడతాడా అని చూస్తాడు. ఇప్పుడు మన రాష్ట్రం మీద కూడా అదే అభిప్రాయం కలుగుతుంది ఎవరికైనా.
ఇదే పోస్టుని నేను జగన్ ముఖ్యమంత్రి అయితే పెట్టేవాడిని కాదు, కారణం అతని మీద నాకు నమ్మకం లేకే, నేను చంద్రబాబుకు ఓటు వేసాను.

Saturday, February 21, 2015

పాపం రంగరాయ మెడికల్ కాలేజీ



పూర్వ విధ్యార్ధులు ఎవరైనా తమకు చదువు నేర్పిన విద్యాలయాన్ని దేవాలయంలా చూసుకుంటారు. అందులో

పనిచేసే ఉపాధ్యాయులను వ్యతిరేకించే వారుంటారేమో కానీ, ఆ దేవాలయాన్ని వ్యతిరేకించరు. కొంత మంది పూర్వ

విధ్యార్థులైతే, వాటికి లక్షల లక్షల సొమ్ముని విరాళంగా ఇస్తారు.


కానీ మా కాకినాడలోని రంగరాయ మెడికల్ కాలేజీ దరిద్రం ఏమిటో, ఆ పూర్వ విధ్యార్థులే (శవాలకు వైద్యం చేసి


సంపాదించింది చాలలేదనుకుంటా) దానికున్న స్థలాన్ని కొట్టేయాలని చూస్తున్నారని తెలిసింది. ఇంకా పూర్తి


వివరాలు అందాలి. నిజాయితీపరుడు, మా కాకినాడ మెడికల్ కాలేజీ పూర్వ విధ్యార్థి అయిన మన హెల్త్ మినిష్టర్


గారు, అది నిజమైతే ఏమి చేస్తారో చూడాలి.