భవద్గీత లో లేనిది ఎందులోనూ లేదనే దానిని నేను గాడంగా నమ్ముతాను. కాకపొతే దానిని మనం అర్థం చేసుకొనే దానిని బట్టి ఉంటుంది. మొదటిసారిగా నేను గీతను 1979 గోదావరి పుష్కరాలలో టి.టి.డి. షాపులో ఒక్కొక్కటి రూపాయి చొప్పున రెండు కొన్నాను. దాని వ్యాఖ్యాత శ్రీ. శిష్ట్లా సుబ్బారావు గారు. అవి రెండూ మా ఇద్దరక్కలకి ఇచ్చాను. తరువాత నేను సింగరేణి ఉద్యోగంలో చేరాకా మా పెద్దక్క దగ్గర ఉన్నదానిని తెచ్చుకున్నాను.
ఎందుకంటే నాకు మళ్ళీ శిష్ట్లా వారిది 2007 దాకా దొరకలేదు. నేను ఎప్పుడు తిరుపతి వెళ్ళినా అడిగేవాడిని. ఎప్పుడూ ఆయన రాసిన గీత దొరకలేదు. 2007 లో పని మీద విజయనగరం వెళ్ళినప్పుడు అక్కడ టి.టి.డి. కళ్యాణమండపంలో బుక్ ఫెయిర్ జరుగుతుంటే అక్కడ దొరుకుతుందేమోనని లోపలకు వెళితే, అదృష్టం కొద్దీ వీరు వ్రాసిన గీత ఉంది. వెంటనే 10 పుస్తకాలు కొన్నాను. అక్కడ మొత్తం 15 ఉన్నాయి. అన్నీ నేను తీసుకుంటే తరవాత వాళ్లకు దొరకవని పదీ తీసుకునివచ్చేసాను. తరువాత వైజాగ్ లో చూస్తే అక్కడా ఉన్నాయి, మళ్ళీ ఇంకో పది తీసుకున్నాను. ఇవి అన్నీ నేను కుర్రవాళ్ళకి ఇచ్చి, దానిని ఒక నవల అనుకుని చదవమంటాను. అంతే తప్ప అది ఒక ఆద్యాత్మిక గ్రంధం అనుకోవద్దంటాను. అది చదివితే ఇంకే సెల్ఫ్ డెవలప్మెంట్ బుక్సూ చదవక్కరలేదు. క్రితం వారమే నా దగ్గర ఉన్నవి అన్నీ అయిపోతే, లిబర్టీ దగ్గర ఉన్న టి.టి.డి. కళ్యాణమండపానికి వెళ్లి అడిగితే, అసలు ఇక్కడ పుస్తకాలే అమ్మడం లేదన్నాడు. వెంటనే దాని చరిత్ర పేపర్లో చదివినది గుర్తుకు వచ్చి మందూ, అమ్మాయిలూ దొరుకుతారా అందామనుకున్నాను. మన టి.టి.డి. వారి శ్రద్ద అలాగుంది.
అసలు ఎండోమెంట్స్ డిపార్ట్ మెంటే అలాఉంది. మీరు ఏ గుడికి వెళ్ళినా మీకు స్థల పురాణం దొరకదు. దొరికినా అది గ్రాంధికం లో ఉంటుంది కానీ వ్యవహారిక బాషలో ఉండదు. అది రాసిన వాడి పాండిత్యం మనకవసరమా? నేను శ్రీశైలం వెళ్ళినప్పుడు కొంటే అది గ్రాంధికంలో ఉంది. అక్కడ ఒక లెటర్ పెట్టి వచ్చేసా. కదిరి నరసింహ స్వామి గుళ్ళో అయితే, నేను రెండు సార్లు వెళ్ళినప్పుడూ దొరకలేదు, అక్కడా లెటర్ పెట్టి వచ్చేసా. ఈ సారి వెళ్లినప్పుడన్నా దొరుకుతుందేమో చూడాలి. అసలు మనకు ఏ గుళ్లోను స్థలపురాణం దొరకదు.
మీరు ఈ సారి ఎప్పుడైనా ఏదైనా ప్రసిద్ధి చెందిన గుడికి వెళ్ళినప్పుడు అక్కడ చూడండి, అక్కడ పూజారి జీతం కంటే కూడా అక్కడ ఎండోమెంట్స్ తరుపున పనిచేసే వాచ్ మన్ జీతం ఎక్కువ ఉంటుంది. గుడి కయ్యే ఖర్చు కంటే వీళ్ళ జీతాల ఖర్చే ఎక్కువుంటుంది. మనం హుండీలో వేసేది వీళ్ళని పోషించడానికే. అసలు పూజారి నిత్య దరిద్రం లోనే ఉంటాడు. మనువు చెప్తాడు. బ్రాహ్మనుడుకి ఆస్తి, వైశ్యుడుకి దరిద్రం ఉండకూడదు అని. ఎందుకంటే విద్య నేర్పే వాడికి ఆస్తి ఉంటే విద్యని వ్యాపారం చేస్తాడని. అతని అవసరాలన్నీ గ్రామస్తులే చూసుకోవాలి. అతనికి డబ్బు అవసరం కలగకుండా చూసుకొనే బాద్యత గ్రామానిదే. అప్పుడు అతను డబ్బు మీద ఏవ లేకుండా విద్యని ఉచితంగా నేర్పిస్తాడు. అలాగే వైశ్యుడుకి దరిద్రం ఉంటే గ్రామానికి కావలసిన వస్తువులు ప్రక్కవూరి నుండి తీసుకురాలేడు. దేవాలయంలో పూజారికి దరిద్రం ఉంటే ఆయన ఇంక దేముడికి ఏమి సేవ చేయగలడు? కానీ ఇప్పుడు మీరు చూడండి, ఏవో కొన్ని గుళ్ళల్లో తప్పితే చాలా చోట్ల వాళ్ళ జీతాలు మూడు అంకెలు దాటడం లేదు.
మణుగూరు లో మా కాలనీ లో ఉన్న రామాలయంలో అయితే ఒక టైంలో పూజారి ఇంటి ప్రక్కనే వాచ్ మన్ కి ఇల్లు ఇచ్చారు. అదేమిటి అని నేను అడిగితే ఏమైంది అన్నారు. అదే మా దగ్గర A,B క్వార్టర్స్ కి కొంచం దూరంలో C టైపు, వీటికి మూడు కిలోమీటర్ల దూరంలో D టైపు కట్టారు. అంటే నువ్వు కేడర్ మెయిన్ టెన్ చేస్తావు, కానీ గుళ్ళో పూజారికి మాత్రం వాచ్ మన్ పక్కనే ఇల్లు ఇస్తావు. అదీ మన పూజారుల పరిస్థితి. గుడి విషయాలలో పూజారి ప్రమేయం ఉండకూడదంట. ఇంక మన దేవాలయాలు ఏమి బాగుపడతాయి.
గుళ్ళోకి వెళ్ళాలంటే టిక్కెట్. ధర్మ దర్శనం అన్ని వేళలా ఉండదు. ఒకసారి, ఒక వెధవ అమెరికాలో గ్రీన్ కార్డ్ కి అప్ప్లై చెయ్యడానికి బర్త్ సర్టిఫికేట్ మీద తల్లి పేరు ఉండాలి అంటే అది తీసుకోవడానికి భద్రాచలం అవతలకి వెళ్లాను. వెళుతూ కూడా ప్రక్కనే ఉంటాడు అని మా వల మనిషిని తీసుకువెల్లాను. దారిలో పర్ణశాల చూద్దామంటే అక్కడకు తీసుకువెల్లాను. సరిగ్గా అప్పుడే శ్రీకాకుళం నుండి బస్సు వచ్చి ఆగింది. అందులోనుండి పాపం లేబర్ దిగారు. వాళ్ళు, ఏదో ఒక్కో రూపాయీ దాసుకొని దేముడు దగ్గర కొస్తే వాళ్ళని టిక్కెట్ తీసుకోమన్నాడు. నేను, నా దగ్గర కొస్తే డబ్బులు ఇస్తాను అని ఆ దేముడంటుంటే, నా దగ్గరకొస్తే డబ్బులివ్వాలి అని ఈ దేముదంటున్నాడు అని గొడవపెట్టుకొంటే, అతను సార్ మీరు డబ్బులివ్వక్కరలేదు వెళ్లి దర్శనం చేసుకోండి అన్నాడు, నేను కోపంతో ఉచిత దర్శనం ఎప్పుడో చెప్పు అప్పుడే వెళతాను, లేకపోతే అసలు వెళ్ళనే వెళ్ళను అని, నేను వెళ్ళకుండా మా మనిషి ని పంపాను. తరువాత ఏలూరు వచ్చి విశ్వ హిందూ పరిషద్ ఆఫీస్ కి వెళ్లి ఈ విషయం చెప్పి మనం ఏమీ చెయ్యలేమా అని అడిగాను. వాళ్ళు మీరు రేపు రండి, ఎదురుగుండానే ఎండోమెంట్స్ ఆఫీస్, రేపు మినిస్టర్ వస్తున్నారు, మాట్లాడుదాము అన్నారు. నేను వరసగా రెండు రోజులు వెళ్లాను. అసలు మినిస్టర్ రానేలేదు.
స్పెషల్ దర్శనం వద్దని ఎవరూ అనరు. కానీ ఉచిత దర్శనం అన్ని వేళల్లోనూ ఉండాలి. అవసరం ఉన్నవాడు స్పెషల్ దర్శనానికి వెళతాడు, లేని వాడు ఉచిత దర్శనానికి వెళతాడు.
ఆర్.కె. లక్ష్మణ్ గారికి క్షమాపణలతో.............
Wednesday, January 19, 2011
Friday, January 14, 2011
తప్పు చేసేది మనమైతే, దానిని కృష్ణుడు మీదకి నేట్టడమేమిటి?
భవద్గీత లో లేనిది ఎందులోనూ లేదనే దానిని నేను గాడంగా నమ్ముతాను. కాకపొతే, దానిని మనం అర్థం చేసుకొనే దానిని బట్టి ఉంటుంది. చాలామంది కృష్ణుడు చెప్పిన చాతుర్వర్ణ వ్యవస్థ గురించి రక రకాలుగా విమర్శిస్తుంటారు. బ్రాహ్మనుడ్ని తలలో నుండి, క్షత్రియుడ్ని హృదయంలోనుండి, వైశ్యుడ్ని ఉదరము నుండి, శూద్రుడ్ని అరికాలిలోనుండి సృష్టించాడంట, మేము అంత నీచమా అంటుంటారు. అసలు కృష్ణుడు చెప్పిన వ్యవస్థ మానవ శరీరానికి అన్వయించి చెప్పాడు. మన శరీరంలో ఏ భాగం విలువలేనిది? అలాగే ఒక వ్యవస్థ సక్రమంగా పనిచేయాలంటే సలహాలు ఇచ్చేవాడు, కాపుకాసేవాడు, కావలసిన వస్తువులు సమకూర్చేవాడు, ఆహారాన్ని పండించేవాడు కావాలి. ఇందులో ఎవరు లేకపోయినా ఆ వ్యవస్థ నాశనమే కదా. ఎవరి పని వాళ్ళు చెయ్యవలసినదే.
ఇదివరకు రిసెప్షనిస్ట్ అంటే, ఇప్పుడు ఫ్రంట్ ఆఫీసు ఎక్జిక్యూటివ్ అంటున్నాము, పని అదే, పేరు మాత్రమే తేడా. పేరు మారినంత మాత్రాన్న పని మారడం లేదు కదా, తల పని తలదే, చేతి పని చేతిదే. ప్రతి మనషి ప్రక్కవాడి మీద పెత్తనం చెయ్యాలి అనుకోవడం తోనే ఈ వైషమ్యాలు అన్నీ వచ్చాయి. ఈ రోజు చెప్పుల కొట్టులు అన్ని కులాల వారు పెడుతున్నారు, మనం వెళ్లి వాళ్ళతో ముచ్చట్లు పెడుతున్నాము, అదే ఒక చెట్టు కింద చెప్పులుకుట్టుకొనే వాడిని వీడితో సమానంగా చూస్తున్నామా? ఇద్దరూ చేసేది ఒకటే, తేడా ఎక్కడుంది మన ఆలోచనలో. మనం నీచంగా ఆలోచిస్తూ దాన్ని కృష్ణుడి మీదకేందుకు తొయ్యడం. ఇక్కడ మనిషి లోనే తేడా ఉంది. ఈ మద్యన చాలా మంది మమ్మల్ని నీచంగా చూస్తున్నారు అని స్టేజ్ లెక్కి ఉపన్యాసాలిస్తున్నారు. అసలు ఒకడు మిమ్మల్ని ఎలా చూసున్నాడు అనేది పక్కన పెట్టి, మిమ్మల్ని మీరు ఎలా చూసుకుంటున్నారో మొదటిగా ఆలోచించండి.
ఒక చిన్న ఉదాహరణ. నా క్లోజ్ ఫ్రెండ్ ఒకడున్నాడు. వాడు, నేను వాదించుకుంటుంటే మా పక్కన ఉన్నవాళ్ళు భయపడేవాళ్ళు. వాడు ఎప్పుడూ, మీరు మమ్మల్ని అనగదోక్కేసారు అనే వాడు. మాట్లాడితే మీ కృష్ణుడు ఇలా అన్నాడు, మనువు అలా అన్నాడు అనేవాడు. వాడి పెళ్లికెల్లేంత దాకా మాకెవరికి వాడు క్రీస్టియన్ అని తెలియదు. అప్పటిదాకా నాస్తికుడు అనులోన్నాము. అంటే మేము ఎలా ఉండేవాల్లమో ఆలోచించండి. నా పిల్లలు వాడిని చిన్నాన్న అనేవారు. ఒకసారి మా వాదనలో, నాకు కోపం వచ్చి నువ్వే కులం రా అని అడిగాను. వాడు క్రీస్టియన్ అని చెప్పాడు, అబే మతం పుచ్చుకోక ముందురా అంటే, షెడ్యూల్ కాస్ట్ అన్నాడు, అందులో ఎవడివిరా అంటే మాల అన్నాడు. వెంటనే నేను, నీ యబ్బా నీ కులం తెలుసుకోవడానికి నిన్ను మూడు ప్రశ్నలు వేస్తె కానీ సమాధానం రాలేదు, అదే నన్ను అడుగు, నేను రాజు ని అని వెంటనే చెబుతాను, నేను నిన్ను కించపరిచేనంటావేమిటిరా, నీ కులాన్ని నువ్వే కించపరుచుకుంటున్నావు, కానీ నా కులం మీద నాకు గౌరవం ఉంది, ముందు నిన్ను నువ్వు గౌరవించుకోవడం నేర్చుకో, అపుడు నేను ఆటోమేటిక్ గా నిన్ను గౌరవిస్తాను అని బూతులు తిట్టాను. నిజమే పూర్వం అలాగే ఉండేది. ఇప్పుడు ఎక్కడోకానీ ఆ పరిస్థతి లేదు కదా.
నేను ఒక సారి పొలం రిజిస్ట్రేషన్ కి అని రిజిస్త్రార్ ఆఫీస్ కి వెళ్లాను. నా ముందు ఒక పెద్దతను లోపలికి వెళుతూ, చెప్పులు బయట విప్పి వెళుతున్నాడు. నేను అతన్ని ఆపి చెప్పులు విప్పి వెళ్ళడానికి ఇదేమి గుడి, హాస్పిటల్ కాదు, చెప్పులు వేసుకొని వెళ్ళు అన్నాను, అతను అయ్యా లోపల పెద్దాయన కదండీ అన్నాడు, బయటకోచ్చాకా మాట్లాడదాము ముందు చెప్పులు వేసుకొని వెళ్ళు అని చెప్పులు వేయిచి పంపాను. అతను వెళ్ళాకా పక్కనే ఉన్న కుర్రవాడిని నువ్వు ఎవరివి, అని అడిగితే ఆ పెద్దాయన కొడుకుని అన్నాడు. ఏమి చేస్తుంటావు అని అడిగితే, సి.ఆర్.రెడ్డి కాలేజ్ లో అటెండర్ ని అన్నాడు. అదేమిటయ్యా, కాలేజ్ లో ఉద్యోగం చేస్తున్నావు, మీ నాన్న కి చెప్పలేవా అంటే అతను వెంటనే మేము షెడ్యూల్ కాస్ట్ అండీ అన్నాడు. అయితే ఏమిటి, ఇంకెప్పుడు ఆఫీస్ లోకి వెళ్ళేటప్పుడు చెప్పులు విప్పి వెళ్ళవద్దని చెప్పు మీ నాన్నకి అని తిట్టాను.
ఇంకోసారి ఒక ట్రాక్టర్ డీలర్ దగ్గరకి మా పినమావ గారు వెళదామంటే ఆయన తో కలసి వెళ్లాను. ఆయన లోపలకు వెళుతూ చెప్పులు విప్పారు. నేను బయట చూసాను. ఈయనవి ఒక్కటే ఉన్నాయి. లోపల ఉన్న వాళ్ళు చెప్పులుతోనే వున్నట్టు అర్థం అయ్యింది. ఒక్కొక్కళ్ళు వాళ్ళ ఆఫీస్ లోకి వాళ్ళు కూడా చెప్పులు వేసుకొని వెళ్ళరు. అటువంటప్పుడు మనం కూడా బయట వదలి వెళ్ళడం మర్యాద. కానీ ఇక్కడ అలా లేదు. నేను మాములుగానే వెళ్లాను. లోపల కూర్చున్నాకా, ఇద్దరూ రేట్ గురించీ, డెలివరీ గురించీ మాట్లాడుకున్నారు. ఈ లోపు ఆ ఓనర్ ఏదో పని మీద బయటకు వెళ్ళారు. నేను టేబుల్ మీద ఏవో కాగితాలు కనిపిస్తే అవి తీసి చూసా. ఆయన లోక్ సత్తా లో ఏదో మంచి పదవిలోనే ఉన్నారు. ఆ కాగితాలన్నీ వీళ్ళు పార్టీ తరపున లేబర్ ని ఎలా ఎడ్యుకేట్ చేసిందీ వివరిస్తూ, హైదరాబాద్ పంపేవి. అవి అన్నీ చదువుతుంటే ఆయన లోపలకోచ్చారు. నేను ఆయనతో మీరు ఇవన్నీ చెయ్యక్కరలేదు, ముందు వాళ్ళల్లో ఉన్న ఇన్ఫీరియారిటీ ని తగ్గించండి అన్నాను. నేను ఈ చెప్పుల విషయమే చెప్పాను. మీరు ప్రతీ ఆఫీస్ ముందు రోజు ఒక గంట నిలబడి లేబర్ వచ్చినప్పుడు వాళ్ళు చెప్పులు విప్పకుండా లోపాలకి వెళ్లేటట్టు ఎడ్యుకేట్ చెయ్యండి చాలు. మనిషిలో బానిస మనస్తత్వం పొతే వాడికి వాడే ఎదుగుతాడు, మనం చెప్పక్కర్లేదు అన్నాను.
నా పాలేరు మొదట్లో చెరువులో మేతలు కట్టి అలా మురికిగానే కూర్చునేవాడు. నేను రెండు రోజులు చూసి, ఒరేయ్, పని అయ్యిపోయింది కదా, శుభ్రంగా స్నానం చేసి కూర్చోవచ్చుకదా అంటే మీ ఎదురుగా శుభ్రంగా ఎలా కూర్చుంటామండీ అన్నాడు. అంటే మనం వాళ్ళని ఏ స్టేజ్ కి తీసుకొనివెళ్ళామో ఆలోచించండి. అప్పుడు వాడిని మేతలు కట్టగానే పని ఏమీ లేకపోతే శుభ్రం గా ఉండేటట్టు తిట్టి మార్చవలసి వచ్చింది.
కృష్ణుడు పెట్టింది నాలుగు వర్ణాలే, మనమే దానిని మూడు వేల వర్ణాలుగా పెంచేసాము. తప్పు చేసేది మనమైతే, దానిని కృష్ణుడు మీదకి నేట్టడమేమిటి?

Wednesday, January 12, 2011
ఎంతైనా రాజు రాజే.......
108 సర్వీస్ పరిస్థితి చూస్తుంటే చాలా బాధ కలుగుతోంది. రామలింగ రాజు, ఎవరి గురించి ఎవరిని మోసం చేసారో తెలియదు, కానీ ఆయన జైలు కెల్లడం వలన ఆయన మొదలుపెట్టిన చాలా సేవా కార్యక్రమాలు నెమ్మదించాయి. బైర్రాజు ఫౌండేషన్ కార్యక్రమాలు మాత్రం నడుస్తున్నాయి. అందరికీ దాన గుణం ఉండదు. అది కొందరికే ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు 108 సర్వీస్ లు నడుపుతున్నవాళ్ళు రామలింగరాజు కంటే ధనవంతులు. అది వాళ్ళ చేతుల్లోకి వెల్లినదగ్గర నుండి దాని మీద ఎన్ని గొడవలు నడుస్తున్నాయో మనం చూస్తూనే ఉన్నాము.
ఒక చిన్న ఉదాహరణ చెపుతాను. నేను ఒక సారి నా చెరువులు మీద లోన్ తీసుకుందామని బేంక్ కి వెళ్లాను. మేనేజర్ ఏమేమి కావాలో అన్నీ చెప్పి, ష్యూరిటి సంతకం ఒకళ్ళు పెట్టాలి అన్నారు. అదేమిటి నా భూమి గవర్నమెంట్ లెక్కల ప్రకారమే లక్ష, మార్కెట్ రేటు మూడు లక్షలు, మీరు నాకు ఇచ్చేది 38,000/- అసలు నేను, నా డాక్యుమెంట్స్ మీ దగ్గర పెడతానికి నేను మిమ్మల్ని ష్యూరిటి అడగాలి, అటువంటిది నన్ను మీరు అడుగుతున్నారేమిటి అన్నాను. అప్పుడు ఆయన, రాజు గారు మీరు అన్నది నిజమే కానీ డబ్బులు పుచ్చుకున్నవాల్లల్లో కొందరికి తిరిగి ఇచ్చే అలవాటు ఉండదు. వాళ్ళు కట్టకపోతే మేము కోర్ట్ నోటీస్ ఇచ్చి, కోర్ట్ చుట్టూ తిరగడం కంటే, ఇలా చేసేమనుకోండి, మేము ఒక ఫోన్ చేస్తే ష్యూరిటి ఉన్నవాళ్ళే మీ వెనక పడతారు అని, మీరు కావాలంటే చూడండి, మాకు డబ్బులు ఎగ్గొట్టే వాళ్ళల్లో ఎక్కువమంది కోటీశ్వరులే ఉంటారు అన్నారు.
అది నిజమే. రామలింగ రాజు చేతిలో ఉన్నప్పుడు బ్రహ్మాండంగా నడిచిన 108, తరువాత గవర్నమెంట్ ఫండింగ్ ఇంకా ఎక్కువ చేసినా, ఇప్పుడు సరిగ్గా నడవడం లేదు. అందరూ అనవచ్చు అవినీతి సొమ్ముతో నడిపేడు అని, అవినీతి సొమ్ముని ఎంతమంది ప్రజలకు ఖర్చుపెడుతున్నారు? నిజంగా అలా చేస్తే మనం చాలా సంతోషించవచ్చు. 108 చేతులు మారగానే, మొదటగా వాళ్ళు చేసిన పని దాని మీద ఉన్న సత్యం సింబల్ తీసేసి వీళ్ళది వేసుకోవడం. చాలా బాధ అనిపించింది. అది రామలింగ రాజు మానస పుత్రిక, సరిగ్గా చెప్పాలంటే ఆయన ......, వద్దు లెండి. అసలు అది తీసేసి వీళ్ళది వేసుకోవడానికి సిగ్గు అనిపించలేదా? ఇప్పుడు వీళ్ళు నడుపుతున్నారు కనుక వీళ్ళది వేసుకోవచ్చు, కానీ పాత దానిని తీసివెయ్యడం గురించి నేను మాట్లాడేది. సరే వేసుకున్నారు, తరువాత అంతే బాగా నడపవచ్చు కదా, డబ్బుకి లోటు లేదు, పైగా ప్రభుత్వం దగ్గర నుండి మునపటి కంటే ఎక్కువే వస్తోంది. అందుకే అంటారు పెద్దలు నువ్వు ఎంత డబ్బున్నవాడివి అయినా అవ్వు నీలో దాన గుణం లేకపోతే నువ్వు భిక్షగాడితో సమానం అని. అందరికీ ఇచ్చే గుణం ఉండదు, అది పుట్టుకతోనే వస్తుంది.

Sunday, January 9, 2011
మీరు అమ్ముకునేవాళ్ళ గురించే మాట్లాడుతున్నారు
ఒక్కొక్కసారి మన ఆలోచనా విధానం ఎంత తప్పుగా ఉంటుందో, మనం చాలా సామాన్యులు (ఇంకా కరెక్ట్ గా చెప్పాలంటే లేబర్) అనుకునే వాళ్ళ దగ్గర నుండే తెలుస్తుంది.
1985 లో అనుకుంటా, ఒకసారి నేను లీవ్ మీద కాకినాడ వెళ్ళినప్పుడు, మా ఫ్రెండ్ పెళ్లి ఉంటే ఫ్రెండ్స్ అందరం కలసి బైక్స్ మీద అమలాపురం వెళ్ళాము. అప్పుడు ఎదురులంక బ్రిడ్జి లేదు. రావులపాలెం మీదుగా వెళ్ళవలసిందే. నాలుగు బళ్ల మీద వెళ్ళాము. దారిలో పల్లెటూర్లల్లో రైతులు భుజం మీద తువ్వాళ్ళు వేసుకుని వెళ్తుంటారు కదా, అవి వాళ్ళ పక్కనుండి బండి నడుపుతూ లాగేసేవాల్లము. వాళ్ళు వెనకనుండి ఓ, అబ్బాయ్యో నా కండువా అని అరుస్తుండేవాళ్ళు, మేము నవ్వుకుంటూ వెళ్ళిపోయాము. పెళ్లి దగ్గరకు వెళ్లేసరికి అవి మొత్తం 20 పైనే అయ్యాయి. పెళ్లి తెల్లవారుజామున. భోజనాలు చేసి, పెళ్లి చూసి తిరుగు ప్రయాణం కోటిపల్లి మీదుగా వెళ్దామని, ముక్తేశ్వరం రేవు దగ్గరకి చేరాము. అప్పుడు తెల్లవారుజాము 4 అయ్యింది. పడవ వెలుగు వస్తే కానీ వెయ్యడు. మొత్తం 10 మంది ఫ్రెండ్స్ ఉన్నాము, ఆ వయసులో 10 మంది ఒకచోట చేరితే ఎలా వుంటుందో ఊహించండి. గోల గోల గా ఉన్నాము. వెలుతురు వచ్చింది, బళ్ళు పడవలో పెట్టి అందరం ఎక్కి కూర్చున్నాము. మాటల్లో నేను ఒరేయ్, ఇవ్వాల్టినుండి మన బాబాయ్ పిన్ని కాళ్ళు వత్తడమే పని కింద పెట్టుకుంటాడేమో అన్నాను. అప్పుడు, పడవలోనే కూర్చున్న ఒక పల్లె అతను అయ్యా రాజుగారు, చిన్నోడ్ని నేను చెపుతున్నానని ఏమీ అనుకోకపోతే ఒక మాట చెప్పనా అన్నాడు. నేను నాకంటే వయసులో పెద్దవాళ్ళు, వాళ్ళు ఎవరైనా సరే, వాళ్ళని వాళ్ళు చిన్నవాళ్ళు అనుకొంటే సిగ్గు అనిపిస్తుంది. వాళ్ళ వయసు యొక్క అనుభవం, ఎదుటివాళ్ళ ఆర్ధిక పరిస్థితి ని చూసి చిన్న బుచ్చుకుంటుంటే బాధ అనిపిస్తుంది. మా ఆఫీస్ లో, బూరా సాయిలు అని ఒక మజ్దూర్ ఉండేవాడు. అతను మాట్లాడితే నీ బాంచన్ దొరా, కాల్మొక్తా చాయ్ కి డబ్బులియ్యవే అనేవాడు. అది వింటే నాకు చాలా సిగ్గేసేది. ఎందుకంటే అతను నా తండ్రి కంటే కూడా పెద్దవాడు. నేను చాలా సార్లు తిట్టాను, నువ్వు నాకంటే పెద్దవాడివి, డబ్బులు మాములుగా అడుగు, అలా అడగకు అని. అయినా వినేవాడు కాదు. నేను వెంటనే పల్లె అతనితో పెద్ద వాడివి, నువ్వు చెపితే మాకే మంచిది కదా చెప్పు అన్నాను. అప్పుడు అతను, అయ్యా, ఏ మొగోడైనా సరే, వాడి ఇంటి గుట్టు పెళ్ళాం దగ్గర విప్పితే ఇక ఆ రోజు నుండి వాడు పెళ్ళాం కాళ్ళు ఒత్తవలసిందే, నా పెళ్ళామే కదా అని అనుకున్నాడా వాడి పని అయ్యిపోయినట్టే, మనల్ని లోకువ పట్టేస్తుంది, అదే మనమైతే పెళ్ళాం తరపు వాళ్ళ గురించి ఏమి తెలిసినా మాట్లాడము, ఆడదానికి, మొగోడికి తేడా అదే అన్నాడు. నిజంగా జీవిత సత్యం ఎంత సిపులుగా చెప్పాడు.
2004 లో నేను షాద్ నగర్ లో పెస్టిసైడ్ డిస్ట్రిబ్యూషన్ షాప్ పెట్టినప్పుడు ఒక రోజు ఒక చిన్న రైతు నా షాప్ కి వచ్చాడు. అతనికి కావలసిన పురుగు మందులు ఇచ్చేసాకా మాటల్లో అతను మీ ఆంధ్రా వాళ్ళు అన్నాడు. నేను అదేమిటయ్యా ఆంధ్రా వాళ్ళు వచ్చాకే కదా మీ పొలాల రేట్లు పెరిగాయి, ఇంతకు ముందు మీరు 5, 10 వేలకి అమ్ముకునే పొలాలు ఇప్పుడు లక్ష కి అమ్ముతున్నారు కదా అన్నాను. వెంటనే అతను మీరు కూడా అలా అంటారేమిటండీ మీరు అమ్ముకునేవాళ్ళ గురించే మాట్లాడుతున్నారు, నాకులా రూపాయి, రూపాయి పోగేసుకొని కొద్ది కొద్దిగా కొనుక్కునే వాళ్ళ గురించి ఆలోచించరా అన్నాడు. ఎందుకంటే నేను వాళ్లకి చాలా తక్కువ, ఒకోసారి వాళ్ళ పరిస్థితి బాగాలేకపోతే అసలు లాభం వేసుకోకుండా అమ్మేవాడిని. అప్పటికే నన్ను చాలా మంది ముంచేశారు. కాబట్టి వీళ్ళకి లాభం లేకుండా ఇవ్వడం నాకు పెద్ద బాధ అనిపించేది కాదు. నన్ను డబ్బున్నవాల్లె ముంచేశారు. వీళ్ళకి ఇవ్వడం వలన ఒక డబ్బులేనివాడికి సాయం చేసునట్టు వుంటుంది, ఇంతకాలం డబ్బున్నవాల్లకి పెట్టి కదా ఈ స్థితి కి వచ్చాను, వీళ్ళ దగ్గర నాకు పోయేదేమిటిలే అనుకునేవాడిని. దాని వలన షాద్ నగర్ లో సర్వస్వం కోల్పయాను అది వేరే విషయం అనుకోండి. అందుకనే ఇంత తీరిగ్గా బ్లాగ్స్ రాస్తున్నాను.
అందుకనే అతను "మీరు కూడా" అన్నాడు. నిజంగా అతను చెప్పింది నూటికినూరు పాళ్ళూ కరెక్ట్. ఎందుకంటే మనమందరమూ నాణేనికి ఒక వైపే చూస్తున్నాము. రెండో వైపు నిజం చాలా భయంకరం గా వుంటుంది. మన వలన భూమి రేటు పెరిగింది అనుకుంటున్నాము కానీ, అది నిజంగా వ్యవసాయం చేసేవాడికి దక్కకుండా పోతోంది అనేది ఆలోచించడం లేదు. మనం రేటు రాగానే దానిని రియల్ ఎస్టేట్ వ్యాపారంగా మార్చేస్తున్నాము. ఈ రోజు చూడండి హైదరాబాద్ చుట్టుపక్కల ఎక్కడైనా మనకి పొలాలు కనిపిస్తున్నాయా. ఇప్పుడు ఆ బక్క రైతు ఎలా ఉన్నాడో, అతని పొలం ఉంచుకున్నాడో, ఈ రేట్స్ కి ఆశపడి అతను కూడా అమ్మేసుకున్నాడో? ఎందుకంటే అతను డబ్బులు జాగ్రత్త చేసుకొని కొద్ది కొద్ది గా పొలం కొనుక్కుంటూ, అప్పటికి దానిని 4 ఎకరాలు చేసుకున్నాడు.
పండించే రైతు కి అందుబాటు ధరల్లో పొలం దొరకడం లేదు. మనం భూమి ని విలువని బట్టి చూస్తున్నాము, కానీ రైతు పంటని బట్టి చూస్తాడు. అదే రైతు కి మనకి తేడా. మహారాష్ట్ర, యూ.పి. లలో లాగ మనదగ్గర కూడా పొలం అనేది రైతు కి మాత్రమే రిజిస్టర్ చేసే విధానం వస్తే మన లాంటి రాబందులు పొలాల జోలికి వెళ్ళకుండా వుంటాయి.
పూర్వం మన పెద్దవాళ్ళు భూమిని ఎవరికైనా చూపించేటప్పుడు "మనది" అనేవారు, నాది అని ఎప్పుడూ అనేవారు కాదు. భూమిని ఎప్పుడూ, నాది అనకూడదంట, మనదీ అనాలంట.

మొన్న జై రాం రమేష్ గారు, నేడు సౌగత రాయ్ గారు
మొన్న జై రాం రమేష్ గారు, నేడు సౌగత రాయ్ గారు మార్కెట్ శక్తులు భారత దేశాన్ని ఎలా నాశనం చేస్తున్నాయో వెల్లడించారు. ఇవేమైనా మనం అర్థం చేసుకుంటున్నామా? వీటివలన మధ్యతరగతి, దిగువమద్యతరగతి ప్రజలు ఎలా నాశనం అవుతున్నారో అర్ధం చేసుకోండి.
ఈ రోజు ఎవరి చేతిలో చూసినా సెల్ ఫోన్ కనిపిస్తోంది. ఒక పల్లెటూరిలో కూలిపని చేసుకొని, రోజుకు వంద రూపాయలు (అది కూడా పని దొరికిన రోజు మాత్రమే) సంపాదించుకొనే వ్యక్తి ఈ ఫోన్ వలన ఎలా నష్టపోతున్నాడో చూడండి. వాడు కూలి పని చేసి ఇంటికి వచ్చేసరికి వాడి దగ్గర వున్న ఫోన్ మోగుతుంది. పక్క నున్న చిన్న పట్టణం నుండి కాయిన్ బాక్స్ నుండి, వాడి స్నేహితుడు ఒరేయ్ కొత్త సినిమా వచ్చింది వెంటనే రమ్మంటాడు. వీడు తయారయ్యి షేర్ ఆటో ఎక్కి అక్కడకి వెళతాడు. ఇద్దరు కలసి చెరో క్వార్టర్ వేసి, సినిమా చూసి బిర్యాని తిని ఇళ్ళకు వెళ్ళిపోతారు. అంటే ఆ రోజు వాళ్ళ సంపాదన లో ఆటో కి 10, మందుకు 40, సినిమాకి 25, బిర్యానీకి 40 మొత్తం 115 రూపాయలు, మళ్ళీ వాళ్ళు ఇంటికెళ్ళి తాగిన మత్తులో పెళ్ళాం ని తన్నిన తాపులు. ఈ సెల్ ఫోన్ నిజంగా అవసరానికి ఉపయోగపడే దానికంటే కూడా వాడి జీవన విధానాన్ని నాశనం చెయ్యడానికే ఎక్కువ ఉపయోగపడుతోంది. అదే వీడికి ఈ ఫోన్ లేకపోతే ఉన్న ఊరిలో దొరికే పది రూపాయల కల్లు తాగి పడుకుంటాడు.
ఈ విషయం చదివిన మేధావులు ఒక ప్రశ్న అడగవచ్చు, వాడు ఫోన్ కొనుక్కోవడం తప్పా అని. కొనడం తప్పు అని ఎవరూ అనరు. కాకపొతే దానివలన జరిగే నష్టం గురించి మాత్రమే నేను మాట్లాడుతున్నాను. సెల్ ఫోన్ వచ్చిన కొత్తలో ఇండియా టుడే వాళ్ళు ఒక కధనం వ్రాసారు. అందులో ఒక చేపల రైతు నాకు సెల్ ఫోన్ వచ్చాకా మార్కెట్ రేటు ని బట్టి నేను చేపలు పడుతున్నాను అని చెప్పినట్టు వ్రాసారు. ఎంత మూర్ఖత్వమంటే, చేపలు పట్టాలంటే పట్టుబడికి ముందు 4 రోజులు వాటికి మేత వేయరు, ఇక్కడ చేపలు పట్టాకా ఇక్కడ నుండి కలకత్తా వెల్లడానికి 3 రోజులు పడుతుంది. అంటే తక్కువలో తక్కువ గా 7 రోజులు. అప్పటికి ఆ రేట్ ఉంటుందా? వీడు రాసింది ఎలా వుందంటే, నాకు ఒరేయ్ ఈ రోజు రేట్ బాగుంది అని ఫోన్ రాగానే, నేను వెంటనే చిటికెలో చేపలు పట్టేసి, అర చిటికెలో మార్కెట్కి పంపేసి, లారీ తో డబ్బులు తెచ్చేసుకున్నట్టు గా ఉంది.
అంటే డెవలెప్మెంట్ వద్దని ఎవరూ అనరు. కానీ అది ఎంతవరకు అవసరం అనేది కూడా చూడాలి కదా. అంటే ఎవరు చూడాలి? ఇదొక ప్రశ్న. ఇదేమి నిత్యావసర వస్తువు కాదు, ఇంత చవగ్గా దొరకవలసిన పని లేదు. దీని రేటు ఎక్కువైతే నిజంగా ఎవరికి అవసరమో వాళ్ళే కొనుక్కుంటారు. అందరిని చూడవలసిన భాద్యత ప్రభుత్వానిది కాదు అని మీరంటారు నాకు తెలుసు. నిజమే, మరి మనం కల్లుమూసుకుపోయి, షేర్ మార్కెట్ లో పెళ్ళాల తాళ్ళు కూడా తాకట్టుపెట్టి కనీస ఆలోచన లేకుండా 10 ని 500 పెట్టి కొని హర్షద్ మెహతా ల దెబ్బకి, ఖుదేలుమన్నప్పుడు మనం ప్రభుత్వాన్నే తిట్టాము. అంతో ఇంతో చదువుకున్న మనమే మనకి నష్టం వచ్చేసరికి ప్రభుత్వాన్ని తిడతాము కదా, మరి అదే భాద్యత ఒక సామాన్యుడి మీద కూడా ప్రభుత్వానికి వుండాలి కదా? ఈ సెజ్ ల పేరు చెప్పి ఎంతమంది రైతులు రైతు కూలీలుగా మారేరో మనం చదువుతూనే ఉన్నాము. చాలా మంది నా మిత్రులు నాతో వాదించుతారు. వాళ్లకి మార్కెట్ రేటు కంటే ఎక్కువే వచ్చింది అని, నిజమే కావచ్చు కానీ వాళ్ళు దానిని అమ్ముకోకుండా వుంటే పది మందీ తిడతారన్న భయంతోనన్నా పండిన పంటలో ఇంట్లో తినడానికి 20 బస్తాల బియ్యం వుంచి మిగిలింది తాగేస్తాడు. ఇంట్లో వాళ్లకి కనీసం తినడానికి బియ్యం అన్నా ఉండేవి. కానీ ఇప్పుడు, వచ్చిన డబ్బులు ఏదో వ్యాపారం లో పెట్టి మునిగిపోయి, లేకపోతే తాగేసి నాశనం అయ్యిపోయి రోడ్డు మీద పడుతున్నారు.
అందుకనే మన పెద్దలు ఎవరికి ఏది ఎంతవరకు అవసరమో అంతవరకే అందాలి అని అంటారు.

Wednesday, January 5, 2011
రాధాకృష్ణ గారు ఇకనుండి చాలా జాగ్రత్త గా వుండాలి, అసలే వాళ్ళు హోం మినిస్టర్ బంధువులు.
మొన్నటి నుండి రాష్ట్రం మొత్తం సూరి టాపిక్ నడుస్తోంది. అతను ఫ్యాక్షనిస్ట్, చావు కూడా అలాగే వచ్చింది. చిన్న వయసులో అతని కుటుంబానికి జరిగిన అన్యాయానికి అతను బలే ప్రతీకారం తీర్చుకోబోయాడే, పాపం జస్ట్ మిస్ అయ్యింది మగాడంటే వాడు అని మేము జూబిలీ హిల్స్ కారు బాంబు పేలుడప్పుడు అనుకున్నాము. అప్పుడు మాకు ఈ ఫ్యాక్షన్ గొడవల గురించి అంతగా తెలియదు.
ఈ రోజు సీతారామాంజనేయులు గురించి, కార్తీక్, ప్రదీప్ రెడ్డిల గురించి వార్తలు. ఈ దేశంలో గూండాయిజం, రాజకీయం, చట్టం ఎంతలా పెనవేసుకుపోయాయో వీళ్ళ గురించి చదివితే తెలుస్తుంది. ఇదే సి.పి ని బెజవాడ దందా గురించి వేమూరి రాధాకృష్ణ బయటపెట్టేదాకా పులి అనుకున్నాము, కానీ వీడు కూడా చెంచా గాడేనని అన్నపూర్ణ ఇండస్ట్రీ విషయం గురించి చదివాకా తెలిసింది. ఇక మన డి.జి.పి. అరవిందరావు గారు మంత్రి కుమారుడి ప్రమేయం లేదని అప్పుడే సెలవిచ్చేసారు. ఒక ఇండస్ట్రీ లో రాత్రి కి రాత్రే డైరెక్టర్స్ మారిపోయి, అందులో మినిస్టర్ బందువు ఒక డైరెక్టర్ గా వున్నా వీల్లెవరికి అందులో ఫాక్షనిజం కనిపించలేదు. వీళ్ళందరికీ ఫాక్షనిజం ఒక్క నక్షలైట్స్ లోనే కనిపిస్తుంది.
ఇప్పుడు వీళ్ళందరికీ వేమూరి రాధాకృష్ణ ఒక శత్రువు గా కనిపిస్తారు. రాధాకృష్ణ గారు ఇకనుండి చాలా జాగ్రత్త గా వుండాలి. బిస్కెట్ కింగ్ రాజన్ పిళ్ళై లాంటి వాడినే జైల్లో పెట్టి చంపిన ఘనత మన పోలీసులది. మారుతి సుజుకి మాజీ ఎం.డి. భాస్కరుడుని గుద్దినట్టే మిమ్మల్నీ నెంబర్ లేని లారీ గుద్దవచ్చు, లేకపోతే సింగరేణి మాజీ ఎం.డి. మహాపాత్రో ని తోసేసినట్టే పైనుండి తోసేసి ఆత్మహత్య అనవచ్చు.
రోజూ ఫేస్ బుక్ లో జగన్ మీద, చంద్రబాబునాయుడు మీద కామెంట్స్ చేసుకునే మేము వీళ్ళ ముగ్గురిమీద కామెంట్స్ చెయ్యడంలేదు. ఎందుకంటే మేము ఉండేది హైదరాబాద్ లోనే, వాళ్ళు మమ్మల్ని వెతికి పట్టుకోనీ మరీ నరుకుతారు. సూరి లాంటి వాడినే చంపిన వాళ్లకి మేమొక లెక్కా, అసలే వాళ్ళు హోం మినిస్టర్ బంధువులు.
Tuesday, January 4, 2011
అధికారాన్ని పూర్వం లాగే వారసత్వంగా ఇస్తూ పొతే.........
ఇప్పుడే నేను మద్దెల చెరువు సూరి భార్య శ్రీమతి. భానుమతి గారు రిపోర్టర్స్ తో మాట్లాడినవి టి.వి.లో చూసాను. ఆవిడ వున్న పరిస్థితిలో ఆవిడని రాజకీయజీవితం గురించి అడగడం తప్పు, అని నేను అనుకుంటున్నంతలోనే ఆవిడ తొందర్లోనే నిర్ణయం తీసుకుంటాను అని చెప్పడం నాకు చాలా ఆశ్చర్యం కలిగించింది. ఆవిడ చాలా దైర్యవంతురాలు అనే విషయం తెలుసు. జుబ్లీ హిల్స్ కారు బాంబు కేస్ అప్పుడు ఆవిడ కిటికీ లోనుండి దూకి పోలీసులకు దొరక్కుండా తప్పించుకున్నట్టు చదివిన గుర్తు. భర్త చనిపోయి 24 గంటలు గడవకముందే ఆవిడ ఇలా మాట్లాడడం ఊహించలేకపోతున్నాము.
రాజకీయాల్లో అందరూ జగన్ లే కనిపిస్తున్నారు. పదవి, అధికారం, డబ్బు మనుషుల్లో మనిషిని చంపెస్తున్నాయా? అంటే అయిన వాళ్ళు చచ్చిపోతే ఏడుస్తూ కూర్చోవాలని నేను అనడం లేదు, కానీ సమయం అది కాదు అని నాకనిపిస్తోంది. నేను మణుగూరు లో వర్క్ చేస్తున్నప్పుడు చిరంజీవి రాజు గారని ఒక కమ్యూనిస్ట్ లీడర్ చనిపోతే వెళ్ళాను. బౌతిక కాయాన్ని తీసుకువచ్చి పార్టీ ఆఫీస్ లో ఉంచారు. పాపం ఆయన భార్యాపిల్లలు ఏడవడానికి కూడా లేకుండా చుట్టూ జనమే. ఆయన్ని సరిగ్గా చూసుకోవడం కూడా వాళ్లకి కుదరలేదు. ఒక నాయకుడు పోయినప్పుడు వాళ్ళ భార్యాపిల్లలకి ఏడ్చే అవకాసం లేకుండా చేస్తున్నారు కదా అని నాకు అప్పుడు అనిపించింది. కానీ ఇప్పటి రాజకీయ కుటుంబాల పరిస్థితి చూస్తుంటే చుట్టూ జనం వుంటే ఏడ్చే అవసరం వుండదు కదా అని అనుకుంటున్నట్టు వుంది. అధికారాన్ని వారసత్వం గా పొందే రాజుల కాలంలో అధికారం కోసం తండ్రులను, సోదరులను చంపిన చరిత్రలు చదివాము, భర్త ఉద్యోగం కోసం భర్తల్ని చంపిన భార్యల్ని చూసాము. అధికారాన్ని పూర్వం లాగే వారసత్వంగా ఇస్తూ పొతే తొందర్లోనే మనం అధికారం కోసం భర్తల్ని, తండ్రులని చంపే రాజకీయ వ్యవస్తని చూస్తాము.

Subscribe to:
Posts (Atom)