ఈ రోజు మా నాన్నగారి పుట్టినరోజు. సహజంగా కొడుకుని చూసి ఎవరైనా గర్వపడతారు, కానీ నేను మాత్రం మా నాన్నగారిని చూసి గర్వపడతాను. ఈ సృష్టిలో కన్నతండ్రిని ప్రేమించని వాళ్ళు ఉండరు. (ఎక్కడో నాలాంటి దరిద్రులను తప్ప). కానీ ఇక్కడ నేను నా తండ్రిని, నా తండ్రిగా కంటే కూడా ఒక మనిషిగా ఎక్కువగా ఇష్టపడతాను. చాలా మంది కొడుకులలాగే నేను కూడా, ఆయనతో గొడవపడిన సందర్భాలు ఉన్నాయి, మాట్లాడడం మానివేసిన సందర్భాలూ ఉన్నాయి. ఎన్ని ఎలా ఉన్నా ఆయనలో ఉన్న మనిషిని నేను ఎక్కువ గౌరవిస్తాను. భగవద్గీతలో శ్రీ కృష్ణుడు చెప్పినట్టు పుట్టుకతో ప్రతీవాడూ శూద్రుడే, ఆ తరువాత మనం పాటించే ఖర్మలను బట్టి మన వర్ణం ఆధారపడి ఉంటుందనేది నేను మా నాన్న గారిని చూసి తెలుసుకున్నాను. ఆయన క్షత్రియ కుటుంబంలో జన్మించినా, ఒక్క వైశ్య లక్షణాలు తప్ప మిగిలిన లక్షణాలు అన్నీ నేను ఆయనలో చూసాను. ఒక గురువుకు ఉండవలసిన లక్షణాలు నేను ఆయనలో చూసాను. విద్యనేర్పే గురువు విధ్యార్థుల భాధ్యత ఎలా తీసుకోవాలో ఆయన అలా తీసుకునేవారు. ఒక గురువుగా ఎంతమందికి ఆయన సాయం చేసారో నాకు వేరే వాళ్ళు చెప్పినప్పుడు తెలిసింది. సహజంగా నా స్నేహితులు నాతో మా ఇంటికి వస్తారు కాబట్టి వాళ్ళు ఎన్నైనా చెప్పవచ్చు, కానీ నేను ఎవరినో తెలియకుండా మా నాన్నగారి గురించి కొంతమంది నాకు చెపుతున్నప్పుడు, నాకు నా మీదే అసహ్యం వేసేది. (ఎందుకనో తెలియదు కానీ, నేనెప్పుడూ మా నాన్నగారి గురించి ఎవరికీ చెప్పేను). ఆ తరువాత వాళ్ళకు నేనెవరో తెలిసినప్పుడు వాళ్ళు నాకు దణ్ణం పెట్టేవారు, మీ నాన్నగారి దయవలన నేను ఇంతవాడిని అయ్యాను అని. విద్య చెప్పినప్పుడు ఆయనలో నేను బ్రాహ్మణ లక్షణాలను చూసాను, అలాగే దానం చేసినప్పుడు ఆయనలో క్షత్రియ లక్షణాలను చూసాను, తను చేస్తున్న ఉద్యోగంలో ఆయన పడే కష్టం చూసినప్పుడు నాకు ఆయనలో ఒక శూద్రుడిని చూసాను. నా ఈ 50 సంవత్సరాల జీవితంలో నేను ఆయనలో ఎక్కడా వైశ్య లక్షణాలు చూడలేదు. ఆయనలో ఎక్కడా వ్యాపారం మీద మక్కువ నేను గమనించలేదు. ఆయన ఎన్నో ఫాక్టరీలకు చార్టర్డ్ ఇంజనీర్, కానీ ఆయన ఎన్నడూ దానిని వ్యాపారంగా చెయ్యలేదు. అలా చేసి ఉంటే ఈ రోజు నాకు కోట్లు ఇచ్చివుండేవారేమో, దానిని నేను ఆనందంగా ఖర్చుపెట్టుకుంటూ తిరిగేవాడినేమో, కానీ ఇంత గర్వంగా ఈయన మా నాన్నగారు చెప్పుకొనేవాడిని కాదు. నేను అప్పులపాలయినప్పుడు, ఆయన ఆస్తి మొత్తం అమ్మివేసి అప్పులు తీర్చివేసారు. అందులో మా అమ్మకు, అక్కలకు ఇవ్వవలసినది ప్రక్కన పెట్టి, ఆయనది మొత్తం అమ్మివేసి, నన్ను మళ్ళీ ఉద్యోగం చేసుకొని బ్రతకమని సలహా ఇచ్చారు. అది కొంతమందికి నచ్చకపోవచ్చు. ఆయనది కాని ఆస్తి మీద ఆయన హక్కుని తీసుకోలేదు. నేను అందరినీ కోల్పోయి, ఏ ఉద్యోగమూ చెయ్యకుండా పిచ్చిలో పడి, ఖాళీగా తిరుగుతున్నప్పుడు, నాలుగు సంవత్సరాల పాటు నెలకు పాతికవేలు చొప్పున పంపిచారు తప్పితే ఎప్పుడూ నన్ను తిట్టలేదు. ఈ రోజు దాకా నువ్వు నీ జీవితం చూసుకో అని చెప్పలేదు, తప్పు చేసావు కాబట్టి వేచి ఉండు అన్నారు తప్పితే, ఎప్పుడూ నాకు వేరే జీవితం గురించి సలహా ఇవ్వలేదు. నాలుగు నెలల క్రితం నాకు నడుం నొప్పి మళ్ళీ వస్తోంది అని చెప్పినప్పుడు, కొత్త కారు కొనుక్కో డబ్బులు పంపిస్తాను అని రోజూ తిట్టేవారు, ఒద్దని నేను సెకండ్ హ్యాండ్ కారు కొనుక్కుంటానని చెప్పినప్పుడు రెండు లక్షలు పంపించారు. ఇప్పటికీ మా అమ్మ రోజూ ఫోన్ చేసి సెకండ్ హ్యాండ్ కారు వద్దు, అమ్మేయి, భాజీ పంపిస్తారు, కొత్తది కొనుక్కో అని తిడుతోంది. వాళ్ళకు నామీద ఉన్న ప్రేమ అటువంటిది. ఆయన రిటైర్ అయ్యాకా పుట్టపర్తి వెళ్ళిపోయి అక్కడ స్కూలులో టీచర్‌గా సర్వీస్ చేసుకుంటున్నారు. మా నాన్నగారు ఒక్కరే కాదు, అక్కడ ఉన్న టీచర్స్‌లో ముప్పాతిక వంతు మంది ఫ్రీగా టీచ్ చేస్తున్నారు. వాళ్ళల్లో ఎవరికీ కూడా బయట ఉద్యోగం చేస్తే, ఏ కార్పొరేట్ కాలేజీ వాళ్ళైనా, నెలకు రెండు లక్షలకు తక్కువ కాకుండా జీతం ఇస్తారు. అటువంటి చోట మా నాన్న గారు హాయిగా సేవ చేసుకుంటున్నారు. నా ఈ అహంకారానికి కారణం మా నాన్నగారు. కానీ నేను వేసిన ఒక తప్పటడుగు ఈ రోజు వాళ్ళను రోడ్డు మీద నిలబెట్టింది. అందుకు నేను చాలా భాధపడుతున్నాను. కానీ ఈ రోజుకూ ఆయన నేను వేసింది తప్పడడుగు అని అనరు. నేను నాకు సంబంధించిన ఏ విషయమూ ఆయనకూ చెప్పను. నా ప్రోబ్లం ఏదో నేనే చూసుకుంటున్నాను. నన్ను చాలా మంది అడిగారు, కాదు తిట్టారు, ఉన్నవాడివి ఒక్కడివి, వాళ్ళను నీ దగ్గరకు తీసుకువచ్చేసుకోవచ్చు కదా అని. వాళ్ళు అక్కడ చాలా ప్రశాంతంగా బ్రతుకుతున్నారు, ఇక్కడకు వచ్చినదగ్గరనుండీ, నా స్థితి చూసి వాళ్ళు భాధపడాలి అనేది నాకు తెలుసు. అందుకని నేను వాళ్ళను ఇక్కడకు రమ్మని అడగను. ఒకవేళ వాళ్ళు ఇక్కడకు వచ్చినా నా రూముకు తీసుకురాను, మా మేనకోడలి ఇంటి దగ్గర ఉండమంటాను. నన్ను ఒక్కడిని చూస్తే వాళ్ళకు భాధకలుగుతుందని నా భాధ. మా నాన్న గారికి స్టూడెంట్స్ కాళ్ళకు దణ్ణం పెట్టడం చూసాను, అందులో కొంతమంది, దరిదాపులదాకా ఆయన వయసువాళ్ళు కూడా ఉన్నారు. ప్రైవేటుగా డిప్లొమా చేసేవాళ్ళు కొంతమంది ఆయన వయసువాళ్ళు ఆయన దగ్గరకొచ్చి నేర్చుకొనేవారు. వాళ్ళ డిప్లొమా చేతికొచ్చాకా వాళ్ళు వచ్చి ఈయన కాళ్ళకు దణ్ణం పెట్టబోయేవారు. కానీ, ఆయనతో పాటు పనిచేసిన లెక్చరర్స్ కూడా ఆయన కాళ్ళకు దణ్ణం పెట్టడం నేను కొన్ని సంవత్సరాల క్రితం తిరుపతిలో చూసాను. మా నాన్నగారు అప్పటికి రిటైర్ అయ్యిపోయారు. మా మేనల్లుడికి ఇంజనీరింగ్ కౌన్సెలింగ్ అంటే తిరుపతి వెళ్ళాము. అప్పుడు మా నాన్నగారు తన దగ్గర లెక్చరర్‌గా చేసిన ఒకాయనకు ఫోన్ చేసి వీలుంటే రమ్మని చెప్పారు. ఆయన సాయంత్రం భార్యతో కలిసి వచ్చి, వెళ్ళిపోతూ కాళ్ళకు నమస్కారం చేసివెళ్ళారు. నాకు చాలా ఆశ్చ్రర్యం వేసింది. నా తండ్రి ఇంత ఉన్నతుడా అని అనిపించింది. ఇప్పటికీ హిందూపూర్ పాలిటెక్నిక్‌లో మా నాన్నగారు ప్రిన్సిపాల్‌గా చేసినప్పటి బ్యాచెస్ అమ్మాయిలు పుట్టపర్తి వచ్చి మా నాన్నగారిని కలిసివెళుతుంటారంట. వాళ్ళు కూడా మా నాన్నగారిని మేము పిలిచినట్టే భాజీ అంటారంట.
ఆర్.కె. లక్ష్మణ్ గారికి క్షమాపణలతో.............
Sunday, March 10, 2013
నన్ను మనిషిగా ఉంచుతున్నది

Saturday, June 16, 2012
ప్రైవేట్ పెత్తనం.
వైజాగ్ స్టీల్ ప్లాంట్‌లో జరిగిన ప్రమాదానికి కారణం ఎవరూ అని అడిగితే, అది ఖచ్చితంగా ఈ బూర్జువా ప్రభుత్వమే అని ప్రతి ఒక్కరూ చెప్పగలరు. అసలు మన దేశం ఎటు పోతోందో సామాన్యులెవరికీ అర్థం కావడం లేదు. అర్థమైన వాళ్ళు హాయిగా సొమ్ము చేసుకుంటున్నారు. ఇంకా ఇలాంటి వాటిని మనం ఎన్ని చూడవలసి వస్తుందో.
మన్ మోసం సింగులు, అహ్లూవాలియాలు ఈ దేశానికి పట్టిన శనులు. వాళ్ళ పీడ ఎప్పుడు వదులుతుందో ఎవరికీ అర్థం కావడం లేదు. చేతిలో కొద్దిగా పైసలు, సవరించగల మెలకువలు తెలిస్తే చాలు, ఈ దేశంలో ఏదైనా చేసుకోవచ్చు అనే స్థితికి ఈ దేశాన్ని దిగజార్చేసారు. ఈ కొడుకులు వాళ్ళ పెళ్ళాలతో కాపురాలు తప్ప, మిగిలినవన్నీ ఔట్ సోర్సింగే అనే మంత్రం జపిస్తున్నారు. ఒక ప్రభుత్వ శాఖకు కావలసిన భవనాలు ఎవడో బయటి వాడు, వాడి ఇష్టమొచ్చిన రేటుకు, ఇష్టమొచ్చిన డిజైన్‌తో, ఇష్టమొచ్చిన రీతిలో, ఇష్టమొచ్చిన క్వాలిటీతో కట్టుకుంటూ పోతున్నాడు. ఇప్పుడు ఏ శాఖలోనూ డిజైన్ వింగ్ అనేది లేదు. దేశ వ్యాప్తంగా వేల కోట్లతో ఇ.ఎస్.ఐ. హాస్పిటల్స్ కడుతున్నారు, దానిని పర్యవేక్షించడానికి దానికంటూ ఒక యంత్రాంగం లేదు. పూర్వం అలాంటి పనులన్నీ సి.పి.డబ్ల్యూ.డి. వాళ్ళు చూసేవారు. ఇప్పుడు డిజైన్ చేసేవాడు ఒకడు, ఆర్కిటెక్ట్ ఒకడు, కట్టేవాడు ఒకడు, పర్యవేక్షించే వాడు ఒకడు. అసలు వీళ్ళల్లో ఒక్కడు కూడా ప్రభుత్వం తరపున ఉండడు. ఈ జాడ్యం దానికొక్కదానికే పరిమితం కాలేదు. దేశ రక్షణ వ్యవస్థకు మూల స్థంభం అయిన డి.ఆర్.డి.వో లో కూడా ఇదే జాడ్యం. ప్రతీది ఔట్ సోర్సింగ్. ప్రైవేట్ వాడికి భాధ్యత ఎంత వరకు ఉంటుంది.
ఇప్పుడు వైజాగ్ స్టీల్ ప్లాంట్‌లో 10mm మందం ఉండవలసిన పైపుల స్థానంలో 5mm మందానివి వాడారంటున్నారు. వాడు కడతాడు, వీడు వాడతాడు. పెళ్ళి చేసుకొనేవాడు ఒకడైతే, శోభనం చేసుకునే వాడు ఇంకొకడు అన్నట్టు తయారయ్యింది ఈ దేశం. తాహతుని మించి ఒక కంపెనీకే వర్కులు ఇవ్వడం, వాడు దానిని ఇంకో నలుగురికి సబ్ ఇవ్వడం. ప్రతీ ఒక్కడూ కనీసం 10 శాతం లాభం వేసుకున్నా, అది నాలుగు చేతులు మారేసరికి క్వాలిటీ సగం పడిపోతుంది. అడిగే వాడు ఎవడు? పూర్వం ఒక డ్రాఫ్ట్‌మెన్ డిజైన్ చేస్తే దానిని పైన నలుగురు చెక్ చేసి కానీ ఓకె అనేవారు కాదు. ఇప్పుడు వాడి దగ్గర ఎటువంటి క్వాలిఫికేషన్ ఉన్నవాడు ఉన్నాడో మనకు తెలియదు, వాడీకి పార్లమెంటులోనో, లేక అసెంబ్లీలోనే పలుకుబడి ఉంటే చాలు వాడు ఒక కన్స్ల్టెంట్, వాడికి దేశ వ్యాప్తంగా వర్కులు. దీనమ్మా ఈ ఔట్సోర్సింగ్ అనే ప్రక్రియనుe, ఏ ఉద్దేశ్యంతో మొదలుపెట్టారో కానీ వ్యవస్థ సర్వనాశనం అయిపోతోంది. ఒక చిన్న అనుమానం తీర్చడానికి కూడా కన్స్ల్టెంట్ రావలసిందే. నేను సంవత్సరం క్రితం చేసిన కంపెనీ వర్కులో అయితే కన్స్ల్టెంట్ ఒక మోనార్క్. వాడిని కాదనే ధైర్యం ఈ రాష్ట్రానికే హెడ్ అయిన వ్యక్తి కూడా లేదు. నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది.
ఈ ఔట్ సోర్సింగ్ అనే దాని పీడ పోతే కానీ ఎక్కడా క్వాలిటీ రాదు. వాళ్ళ మీద అజమాయిషీ చేసే ధైర్యం ఎవడికీ లేదు. మన జలయజ్ఞం దానికొక పెద్ద ఉదాహరణ. ఇంకా మనం ఎన్ని చూడాలో.
సామాజికన్యాయం అంటే ఏమిటో నాకు అర్ధం కావడం లేదు.
సరిగా చదువుకోకపోతే ఎంత నష్టమో నాకు ఇప్పుడు అర్ధం అవుతోంది. మా ఫాదర్ చెప్పినట్టు నేను చిన్నప్పుడు మంచిగా చదువుకుని వుంటే నాకు ఈ అనుమానం వచ్చేది కాదేమో? లేకపోతే లోకమంతా సామాజిక న్యాయం గురించి మాట్లాడుతుంటే నాకు దాని గురించి తెలియక నేను బిక్క మొగం వేయడమేమిటి? లేదూ నేను పెరిగిన వాతావరణం, నన్ను అటువంటి వాటి గురించి, ఆలోచించే అవకాశం ఇవ్వలేదు అనడానికి లేకుండా నా తండ్రి ఎంతో మంది బీద విద్యార్ధులకి ఫీజ్ కట్టి చదివించిన మనిషి, మేము ఎప్పుడైనా, మా అసమర్ధతని కప్పిపుచ్చుకోవడానికి, ఆ వాడు రిజర్వేషన్ మీద సీట్ కొట్టేసాడు అంటే, ఒరేయ్ వెధవల్లారా, మిమ్మల్ని పందుల్ని మేమినట్టు మేపి, మీరు ఏది కావాలంటే అది కొనిచ్చి, ట్యూషన్ల ట్యూషన్లు పెట్టించి, ఎంత కావాలంటే అంత డబ్బిచ్చి చదువుకోండిరా అంటే 35 మార్కులు తెచ్చుకోవడానికి చచ్చిపోతూ, వాళ్ళ మీద పడి ఏడుస్తారెందుకురా అని తిట్టే మనిషి కాబట్టి నేను అటువంటి వాతావరణంలో పెరిగినవాడిని కాదు. మరి అందరికీ అర్ధమైన ఈ సామాజిక న్యాయమనేది నాకు ఎందుకు అర్ధం కావడం లేదు?
పోనీ ఉద్యోగమా అంటే నేను చదివింది సివిల్ డిప్లొమా. ప్రొద్దుట లేచింది మొదలు లేబర్‌తోనే పని. వాడు ఒక్కరోజు పని మానేసాడంటే ఆరోజు మా పని అయ్యిపోయినట్టే, కాబట్టి వాడి విలువ నాకు తెలుసు. చేసింది తెలంగాణాలో వున్న సింగరేణిలో, దరిదాపులదాకా అప్పట్లో 1,00,000 పైనే నిరక్షరాశ్యులు ఉన్న కంపెనీ, కాబట్టి నాకు ఊహవఛ్ఛాకా ఈ 30 (నేను నా 17 వయేట ప్రభుత్వోద్యోగంలో చేరాను, ఇప్పుడు నాకు 47) సంవత్సరాలలో, ఎవడూ నాకంటే ఎక్కవా కాదు, నాకంటే తక్కువా కాదు అనే పరిస్థితుల్లోనే పెరిగాను. మరి ఇన్ని సంవత్సరాలు ఎప్పుడూ విననిది ఇప్పుడు ఎందుకు వింటున్నాను?

Tuesday, December 13, 2011
లోకం
మనుషులు ఎన్ని రకాలు అని ఎవరైనా అడిగితే, మనం, చెప్పే సమాధానం రెండు రకాలు అని. అది ఆడ, మగ అని ఒకరు, డబ్బున్నవాడు, డబ్బులేని వాడు అని ఒకరు, దోచుకునేవాడు, దోచుకోబడేవాడు అని ఒకరు అలా ఎవరికి తోచిన సమాధానం వాళ్ళు చెపుతారు. కానీ, నిజంగా మనుషులు ఎన్ని రకాలంటే, ఈ భూమి మీద, నరజాతి ఎంత ఉందో, అన్ని రకాలు అని చెప్పడం సరి అయినది అని అనిపిస్తోంది.
ఏ ఇద్దరి మనుషులు ఒకలాగ ఆలోచించరు, అలాగే, ఏ ఇద్దరి కష్టం ఒకలాగా ఉండదు. ఎవరి కష్టాలు వారికి పెద్దవి, అవతలి వారికి పెదవి విరిచేటంత చిన్నవి. ఈ రోజు నేను విన్న రెండు సంగతులు నన్ను చాలా భాధించాయి. అందులో, ఒకటి మా ఆఫీసులో పని చేసే ఒక వృద్దురాలిది, రెండోది నా కజిన్ ది.
ఈ రోజు మధ్యాహ్నం, నేను ఆఫీసులో టిఫిన్ చేస్తూ, ఆవిడను మీది ఏ ఊరు అని అడిగాను. మిర్యాలగూడ దగ్గర పల్లె సారూ, మా నాన్న, మేము పుట్టకముందే హైదరాబాదు వచ్చేసాడు, మాకు అక్కడ చాలా పొలం ఉండేదంట, అప్పుడు అక్కడ నీళ్ళు లేక మా అయ్య ఇక్కడకు వచ్చేసాడు. తరువాత అక్కడ సాగర్ కాలువ వచ్చింది. మా తాతా వాళ్ళు అక్కడకు వెళ్ళేసరికి, అక్కడ పాలెగాడు దానిని సాగుచేసుకుంటున్నాడంట, మా అయ్యా వాళ్ళని బెదిరించాడంట, వీళ్ళు భయపడి వచ్చేసారు. అప్పటినుండీ ఇక్కడే బట్టలు నేసుకుంటూ బ్రతికాడంది. ఈ లోపు, మా అకౌంటంట్, మీ ఆయనది ఏ ఊరు అని అడిగాడు. నల్గొండ అని, నా పెళ్ళి ఎప్పుడు అయ్యిందో నాకు యాదికే లేదు, కానీ గుర్రం మీద ఊరేగించారు, అది ఒక్కటి గుర్తుంది. పెళ్ళి అయ్యాకా ఎప్పటికో, మా ఆడబిడ్డతో విజయవాడ కేసి వెళ్ళినప్పుడు అక్కడే, రజస్వలని అయ్యాను అని చెప్పింది. ఇప్పుడు మీ ఆయన ఎక్కడుంటున్నాడు అని అడిగితే, రెండో పెళ్ళి చేసుకొని దానితో నల్గొండలోనే ఉన్నాడు అని చెప్పింది. నిన్ను ఎందుకు వదిలేసాడు, ఆవిడ బాగుంటుందా అని అడిగాడు. దానికి ఆమె, నేను దానినెక్కడ చూసాను, నాకు ఆరోగ్యం బాగాలేదని నన్నొగ్గేసి దానిని చేసుకున్నాడు అంది. ఎప్పుడైనా నిన్ను కలిసాడా అని అడిగితే, మొన్న మా మరిది పోయినప్పుడు అక్కడకు వెళితే ఫుల్ గా కల్లు తాగేసి వచ్చి నన్ను ఒకటే తన్నులు, అప్పుడు అక్కడే ఉన్న మా ఆడబిడ్డలు నవ్వుతుంటే, మా మరిది కూతురు వచ్చి వాడిని తిట్టి, నన్ను పక్కకు లాకెళ్ళిపోయింది అని ఎటువంటి భాధ లేకుండా నవ్వుతూ చెప్పింది. ఇక్కడకు వస్తాడా అని అడిగితే అప్పుడప్పుడూ వచ్చి కొడుకుని నెలకు మూడువేలు ఇవ్వు అని గొడవచేసి పోతాడండీ అంది. నా కొడుకు ఎలా ఇస్తాడండీ, వాడు పదో తరగతి పూర్తయిపోయాకా, నేను హాస్పిటల్ లో ఉంటే, ఇంటికి వచ్చి ఇల్లు అమ్మేసాను, వచ్చి సంతకం పెట్టు అని నా కొడుకుది స్కూలు టీ.సి. తీసుకుపోయి వాడూ, అక్కడ ఉన్న పెద్దమనిషి కలిసి బెదిరించారంట. వీడు పెట్టనంటే, నీ టీ.సి చింపేస్తాను అంటుంటే మా ఆడబిడ్డ కొడుకు వచ్చి ఒరేయ్, వెధవ ఇల్లు పోతేపోయింది, నువ్వు చదువుకుంటే పెద్ద ఉద్యోగం చేసుకోవచ్చు, సంతకం పెట్టేసి ఆ టీ.సి తీసుకో అని సంతకం పెట్టించాడంట. వీడు సంతకం పెట్టగానే ఆ టీ.సి ఇచ్చేసి, ఏరా డబ్బులేమన్నా కావాలా అని నవ్వుతూ అడిగాడంట. నువ్వూ వద్దు, నీ డబ్బూ వద్దు అని నా కొడుకు వచ్చేసాడు అని నవ్వుతూ చెప్పింది. ఆవిడ అది చెపుతున్నంత సేపూ ఆవిడలో ఎక్కడా భాధ అనేది కనిపించలేదు. నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. భర్త వదిలేసాడు అని భాధ లేకపోవచ్చు, కానీ, పడిన కష్టాల గురించి కూడా ఆవిడలో ఎక్కడా భాధ కనిపించలేదు. జీవితాన్ని ఎలా వస్తే అలా నడుపుకుంది ఆవిడ. ఆవిడను నేను గత నాలుగు సంవత్సరాల నుండీ చూస్తున్నాను. ఎప్పుడూ, నవ్వుతూనే తింగరి, తింగరిగా ఉంటుంది. ఆవిడ అదృష్టం, కొడుకు ఈ మధ్యనే కారు కొనుక్కున్నాడంట, కూతురి పరిస్థితి కూడా బాగానే ఉంది. ఆవిడ కొడుకు, కారు కొనుక్కున్న రోజు మాకు చెపితే, మా అకౌంటంట్, శుభ్రంగా ఇంటిలో కూర్చుని తినక ఈ పని నీకెందుకు అని అడిగితే, నాకు ఓపిక ఉండగా నేను వాళ్ళ సొమ్ము ఎందుకు తినాలి ఓపిక ఉన్నంతవరకు చేస్తూనే ఉంటాను అంది. రోజూ సిటీబస్ లో విద్యానగర్ దగ్గరనుండి అమీర్ పేట దగ్గర ఉన్న మా ఆఫీస్ కు వస్తుంది. ఇంతకూ ఆవిడకు ఇచ్చేది 1200 రూపాయలు.
Thursday, August 4, 2011
నేనేమిటి?
చాలా రోజుల తరువాత బ్లాగ్ వ్రాయాలనిపించింది. ఏమి వ్రాయాలి అని ఆలోచిస్తుంటే, అసలు ఎప్పుడూ దాని గురించో, దీని గురించో లేకపోతే ఎవరెవరి గురించో వ్రాస్తున్నాము కదా, ఈసారి నా గురించే వ్రాస్తే పోలేదా అనిపించింది. అది కూడా ఎందుకంటే నా బ్లాగ్ చదివే వాళ్ళకు నేనెవరో తెలియదు. నా రాతలు చూసి వాళ్ళు, నన్ను ఏదో గొప్ప సంస్కారం ఉన్నవాడిని అనుకుంటారేమోనని (అనుకోవాలనే కోరిక నాలో ఉందనుకోండి) నాకు అనుమానం వచ్చింది. కానీ, నేను ఇటువంటి వాడిని అని తెలిసాకా నా బ్లాగ్లు ఎంతమంది చదువుతారో తెలుసుకోవాలనిపించింది. మనిషి రాతకు, వాడి వ్యక్తిత్వానికి ఇంత తేడా ఉంటుందా అని, వాళ్ళు అనుకుంటారని నా నమ్మకం. అప్పుడు నా బ్లాగ్ ఎంతమంది చదువుతున్నారో కౌంటర్ చూసి తెలుసుకుంటే ఎలా ఉంటుందా అనే కుతూహలంతో నా గురించి 90% వాస్తవాలు రాస్తున్నాను. మిగిలిన 10% ఎందుకు దాస్తున్నానంటే దాని అవసరం నాకు వ్యక్తిగతంగా ఉంది. అది మీకు ఇప్పుడు చెప్పేది కాదు.
నేను శ్రీశ్రీ కంటే విశ్వనాధవారిని ఇష్టపడతాను. విశ్వనాధ్ సప్తపది కంటే బాపూ గారి రాధాకళ్యాణం ఇష్టపడతాను. దీనిని బట్టే మీరు ఒక నిర్ణయానికి వచ్చేయవచ్చు. నేను ఛాంధసవాదిని అని. యండమూరి వెన్నెల్లో ఆడపిల్ల కంటే అంతర్ముఖం ఇష్టపడతాను. చలం గారు చెప్పిన దైవమిచ్చిన భార్య అంటే నాకు ఇష్టం, కానీ నా భార్య నాతో తప్పితే వాళ్ళ అమ్మా, తమ్ముల్లతో ప్రేమగా ఉన్నా తట్టుకోలేను. గొప్ప స్వార్థపరుడను. నేను ఒంటరిగా ఉంటున్నాను, నన్ను చూడడానికి నా భార్యా, పిల్లలు ఇష్టపడడం లేదు. పిల్లలతో అసహ్యించుకోబడే తండ్రి ఖచ్చితంగా వెధవ అయ్యుంటాడు, కాబట్టి నేను వెధవనే. నా దగ్గర శ్రీశ్రీ, చలం, విశ్వనాధ, బుచ్చిబాబు, తిలక్ లాంటి వాళ్ళ సాహిత్యం ఉంటుంది కాబట్టి, నన్ను గొప్ప మానవతావాదినని నమ్మి నన్ను ఇష్టపడి పెళ్ళి చేసుకుని మోసపోయానని నా భార్య అనేది కాబట్టి నేను మోసగాడిని. తను నా దగ్గర నుండి నా తప్పుందని వెళ్ళిపోయినా, ఆ నెపం వాళ్ళ అమ్మా వాళ్ళ మీద వేస్తున్నాను కాబట్టి, నేను నెపం ఇతరుల మీద వేసేవాడిని. నా మాటకెదురు చెప్పే వాళ్ళని, నేను అసలు భరించలేను, కాబట్టి నేను అహంభావిని. అప్పుడప్పుడు నాకు ఇవ్వవలసిని డబ్బులు ఇవ్వకుండా, హాయిగా ఎంజాయ్ చేసే వాళ్ళని చూస్తుంటే కడుపు మండిపోతుంది. కాబట్టి ఈర్ష్యాపరుడను. సంవత్సరం క్రితం దాకా రోజుకు 6 పెట్టెలు సిగరెట్లు కాల్చేవాడిని. కాబట్టి నాతో పాటు పాసివ్ స్మోకింగ్‌తో మిగిలిన వాళ్ళని కూడా చంపడానికి ఇష్టపడేవాడిని. (ఇప్పుడు రెండు పెట్టెలే కాలుస్తున్నాను). కోపం వచ్చిందంటే (ఊరికే అంటున్నాను, అది ఎప్పుడూ నాతోనే ఉంటుంది), నా నోట్లోంచి వచ్చే మాటలు తాగిన వాడి నోట్లోంచి కూడా రావు. పక్కా యాబ్రాసిని.
నా తల్లి, నా కూతుర్లు, నా మేనకోడల్లు, నా అక్కలు, నన్ను మావయ్యా అని పిలిచే వాళ్ళల్లో తప్పితే మిగతా అందరిలో నాకు ఆడదే కనిపిస్తుంది. అలాగని అందరినీ నేను కోరుకుంటానని కాదు, నాకూ ఒక టేస్ట్ ఏడిచింది. ఇలియానాను ఇష్టపడతాను కానీ, అనుష్కని ఇష్టపడను. నేను సివిల్ ఫీల్డ్‌లో ఉన్నవాడిని కాబట్టి నా భాషలో చెప్పాలంటే నేను 6mm Plain bar ని ఇష్టపడతాను. రోడ్డు మీద రెచ్చగొట్టేటట్టు ప్రవర్తించే ఆడవాళ్ళని చూస్తే నాకు తెలియకుండానే నోట్లోంచి డైలాగ్‌లు వచ్చేస్తాయి (ఇప్పుడు నా వయసు 48), వ్యక్తి స్వేచ్చని ఇష్టపడను కాబట్టి కుసంస్కారిని. నన్నెవరైనా కించపరిచితే వెనుకా, ముందూ చూడకుండా నువ్వెంత, నీ బ్రతుకెంత అని కడిగి పారేస్తాను. ఒళ్ళు పొగరెక్కువ. నేను ఈ రోజు దాకా నా షర్ట్ పై బటన్ ముగ్గురు ముందే పెట్టాను, కాబట్టి బలుపెక్కువ. జాతకాలనీ, పూజలనీ, హోమాలనీ నా ప్రోబ్లం తీరడానికి లక్షలు ఖర్చుపెట్టాను కాబట్టి మూర్ఖుడిని.
ఇన్ని నెగటివ్ లక్షణాలు నాలో ఉన్నాయి. కాబట్టి, ఇక నాలో కొన్ని మంచి లక్షణాలు ఉన్నా అవి పట్టించుకోవక్కరలేదు.
ఇక్కడితో నేనేంటో తెలిసింది కాబట్టి, వీడి గురించి చదవడం శుద్ద దండుగ అనుకుని సిస్టం ఆపుచేసేసేవాళ్ళు ఆపుచేసేయండి.
***************************************************************************************************************************************************************
లేదులే రావణాసురుడిలో కూడా కొంత మంచి ఉంది కదా, ఈ వెధవలో కూడా ఏమైనా మంచి ఉందేమో చూద్దాము అనుకుని ఎవరైనా మిగిలి ఉంటే ఇక్కడ నుండీ నాలో ఉన్న ( అవి మంచివి అని నేననుకుంటున్నాను కాబట్టి, మీరూ అలాగే అనుకోవాలి, అన్నీ నేనే డిసైడ్ చేస్తాను, ఎంతైనా అహంభావిని కదా) కొన్ని పాజిటివ్ లక్షణాలు చూడండి.
అవి నా బ్లాగ్ కౌంటర్ చూసాకా వ్రాస్తాను. బై.
మీ? రామర్రాజు. (రామర్రాజు అని పొరపాటున వ్రాయలేదు, 3000 ఇచ్చి మరీ మార్పించుకున్న పేరది).నేను శ్రీశ్రీ కంటే విశ్వనాధవారిని ఇష్టపడతాను. విశ్వనాధ్ సప్తపది కంటే బాపూ గారి రాధాకళ్యాణం ఇష్టపడతాను. దీనిని బట్టే మీరు ఒక నిర్ణయానికి వచ్చేయవచ్చు. నేను ఛాంధసవాదిని అని. యండమూరి వెన్నెల్లో ఆడపిల్ల కంటే అంతర్ముఖం ఇష్టపడతాను. చలం గారు చెప్పిన దైవమిచ్చిన భార్య అంటే నాకు ఇష్టం, కానీ నా భార్య నాతో తప్పితే వాళ్ళ అమ్మా, తమ్ముల్లతో ప్రేమగా ఉన్నా తట్టుకోలేను. గొప్ప స్వార్థపరుడను. నేను ఒంటరిగా ఉంటున్నాను, నన్ను చూడడానికి నా భార్యా, పిల్లలు ఇష్టపడడం లేదు. పిల్లలతో అసహ్యించుకోబడే తండ్రి ఖచ్చితంగా వెధవ అయ్యుంటాడు, కాబట్టి నేను వెధవనే. నా దగ్గర శ్రీశ్రీ, చలం, విశ్వనాధ, బుచ్చిబాబు, తిలక్ లాంటి వాళ్ళ సాహిత్యం ఉంటుంది కాబట్టి, నన్ను గొప్ప మానవతావాదినని నమ్మి నన్ను ఇష్టపడి పెళ్ళి చేసుకుని మోసపోయానని నా భార్య అనేది కాబట్టి నేను మోసగాడిని. తను నా దగ్గర నుండి నా తప్పుందని వెళ్ళిపోయినా, ఆ నెపం వాళ్ళ అమ్మా వాళ్ళ మీద వేస్తున్నాను కాబట్టి, నేను నెపం ఇతరుల మీద వేసేవాడిని. నా మాటకెదురు చెప్పే వాళ్ళని, నేను అసలు భరించలేను, కాబట్టి నేను అహంభావిని. అప్పుడప్పుడు నాకు ఇవ్వవలసిని డబ్బులు ఇవ్వకుండా, హాయిగా ఎంజాయ్ చేసే వాళ్ళని చూస్తుంటే కడుపు మండిపోతుంది. కాబట్టి ఈర్ష్యాపరుడను. సంవత్సరం క్రితం దాకా రోజుకు 6 పెట్టెలు సిగరెట్లు కాల్చేవాడిని. కాబట్టి నాతో పాటు పాసివ్ స్మోకింగ్‌తో మిగిలిన వాళ్ళని కూడా చంపడానికి ఇష్టపడేవాడిని. (ఇప్పుడు రెండు పెట్టెలే కాలుస్తున్నాను). కోపం వచ్చిందంటే (ఊరికే అంటున్నాను, అది ఎప్పుడూ నాతోనే ఉంటుంది), నా నోట్లోంచి వచ్చే మాటలు తాగిన వాడి నోట్లోంచి కూడా రావు. పక్కా యాబ్రాసిని.
నా తల్లి, నా కూతుర్లు, నా మేనకోడల్లు, నా అక్కలు, నన్ను మావయ్యా అని పిలిచే వాళ్ళల్లో తప్పితే మిగతా అందరిలో నాకు ఆడదే కనిపిస్తుంది. అలాగని అందరినీ నేను కోరుకుంటానని కాదు, నాకూ ఒక టేస్ట్ ఏడిచింది. ఇలియానాను ఇష్టపడతాను కానీ, అనుష్కని ఇష్టపడను. నేను సివిల్ ఫీల్డ్‌లో ఉన్నవాడిని కాబట్టి నా భాషలో చెప్పాలంటే నేను 6mm Plain bar ని ఇష్టపడతాను. రోడ్డు మీద రెచ్చగొట్టేటట్టు ప్రవర్తించే ఆడవాళ్ళని చూస్తే నాకు తెలియకుండానే నోట్లోంచి డైలాగ్‌లు వచ్చేస్తాయి (ఇప్పుడు నా వయసు 48), వ్యక్తి స్వేచ్చని ఇష్టపడను కాబట్టి కుసంస్కారిని. నన్నెవరైనా కించపరిచితే వెనుకా, ముందూ చూడకుండా నువ్వెంత, నీ బ్రతుకెంత అని కడిగి పారేస్తాను. ఒళ్ళు పొగరెక్కువ. నేను ఈ రోజు దాకా నా షర్ట్ పై బటన్ ముగ్గురు ముందే పెట్టాను, కాబట్టి బలుపెక్కువ. జాతకాలనీ, పూజలనీ, హోమాలనీ నా ప్రోబ్లం తీరడానికి లక్షలు ఖర్చుపెట్టాను కాబట్టి మూర్ఖుడిని.
ఇన్ని నెగటివ్ లక్షణాలు నాలో ఉన్నాయి. కాబట్టి, ఇక నాలో కొన్ని మంచి లక్షణాలు ఉన్నా అవి పట్టించుకోవక్కరలేదు.
ఇక్కడితో నేనేంటో తెలిసింది కాబట్టి, వీడి గురించి చదవడం శుద్ద దండుగ అనుకుని సిస్టం ఆపుచేసేసేవాళ్ళు ఆపుచేసేయండి.
***************************************************************************************************************************************************************
లేదులే రావణాసురుడిలో కూడా కొంత మంచి ఉంది కదా, ఈ వెధవలో కూడా ఏమైనా మంచి ఉందేమో చూద్దాము అనుకుని ఎవరైనా మిగిలి ఉంటే ఇక్కడ నుండీ నాలో ఉన్న ( అవి మంచివి అని నేననుకుంటున్నాను కాబట్టి, మీరూ అలాగే అనుకోవాలి, అన్నీ నేనే డిసైడ్ చేస్తాను, ఎంతైనా అహంభావిని కదా) కొన్ని పాజిటివ్ లక్షణాలు చూడండి.
అవి నా బ్లాగ్ కౌంటర్ చూసాకా వ్రాస్తాను. బై.
Monday, June 13, 2011
బాల కార్మిక వ్యవస్థ.
చాలా కాలం తరువాత బ్లాగు వ్రాస్తున్నాను. ఈ రోజు Anti Child Labor Day అని నా ఫేస్బుక్ ఫ్రెండ్ లక్కీ దాని మీద ఒక ఒక పోస్ట్ పెట్టింది. నన్ను గంజివరపు శ్రీనివాస్ గారు, లక్కీలు తమ స్నేహితుడిగా కలుపుకున్నందుకు నేను చాలా గర్వ పడుతుంటాను. నేను ఈ సోషల్ సైటుల గురించి మాట్లాడవలసి వస్తే ముందుగా వీళ్ళిద్దరి గురించే చెపుతాను. ఈ మద్యనే శ్రీనివాస్ గారు, Ramanjaneyulu GV గారి గురించి చెప్పారు. ఇప్పుడే ఆయనకు కూడా ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపాను. వీళ్ళందరూ ఏదో ఒక కాజ్ మీద ఉద్యమిస్తున్నారు. ఇలాంటి వాళ్ళతో నాకు పరిచయం ఉందని చెప్పుకోవడం నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. వీళ్ళీద్దరూ నా కంటే చిన్నవాళ్ళు. మనకంటే చిన్న వాళ్ళని మనం పొగడకూడదని పెద్దలు చెపుతారు. అందుకని, ఇంతకంటే నేను వాళ్ళ గురించి ఎలా ఫీల్ అవుతున్నానో చెప్పదలచుకోలేదు.
ఇక పోతే, ఈ రోజు లక్కీ పెట్టిన పోస్ట్ గురించి నా ఆలోచన చెపుదామనే ఈ బ్లాగ్ వ్రాస్తున్నాను. బాల కార్మిక వ్యవస్థ పోవాలంటే ముందుగా వాళ్ళ తల్లి, తండ్రుల ఆర్ధిక పరిస్థితి మారాలి. ఎవ్వరూ కూడా తమ పిల్లలను చిన్నతనంలోనే పనిలోకి పంపడానికి ఇష్టపడరు. వాళ్ళకి గత్యంతరం లేని పరిస్థితుల్లోనే వాళ్ళు ఆ పని చేస్తున్నారు. పిల్లలు వాళ్ళకు ఒక పెట్టుబడి సాధనం. సహజంగా లేబర్‌లో 90% పైన మొగవాళ్ళు సంపాదించిన దానిలో ముప్పాతిక వంతు తాగుడుకే ఖర్చుపెడతారు. ఇక ఇంటిలో ఉన్న ఆడవాళ్ళూ, పిల్లలూ కలిపి పనిచేస్తే కానీ వాళ్ళ కడుపులు నిండవు. అటువంటి పరిస్థితుల్లో ఉన్న పిల్లలను (మన ప్రభుత్వాల చిత్తశుద్ది మనకు తెలిసిందే) తీసుకునివెళ్ళి ఏమి చేస్తారు? ఒక హాస్టల్ చేర్చడం, అంతే. మన గవర్నమెంట్ హాస్టల్లు ఎలా ఉంటున్నాయో మనకు తెలిసిందే. వాడు బయటకు వచ్చి, మళ్ళీ కూలివాడుగా ఉండవలసిందే. ఒకవేళ వాడు తెలివైన వాడయ్యి సొంతంగా చదువుకున్నా, వాడు కాంపిటీటివ్ ఎగ్జామ్ వ్రాస్తే, వాడు పోటీ పడేదెవరితో? కార్పోరేట్ కాలేజీలో చదివిన విద్యార్ధితో. అసలు మన వ్యవస్థే లోపాల పుట్ట. ప్రభుత్వ పాఠశాలల్లో చదువు చెప్పేవారు ఉండరు. వీళ్ళు ఇంటర్ చదివి ఇంజనీరింగ్, మెడికల్ ఎంట్రన్స్ వ్రాయాలంటే వాడు పోటీ పడవలసింది మళ్ళీ కార్పోరేట్ కాలేజీలో చదివినవాడితోనే. కొద్దిగా మనకున్న నాయకుల్లో, జయలలిత ఒక్కావిడే, ఈ విషయంలో సరిగ్గా ఆలోచించింది అనిపిస్తుంది. ఆవిడ అక్కడ ఎగ్జామ్స్ లో రిజర్వేసన్ పెట్టింది. దానిని చాలా మంది తప్పు పట్టారు. మన దేశంలో ప్రభుత్వ తప్పుడు లెక్కల ప్రకారమే 30% పైన బీదవాళ్ళు ఉన్నారు. వాళ్ళకి (అంటే ప్రభుత్వ పాఠశాలల్లో చదివేవారికి) రిజర్వేసన్ కల్పించకపోతే వాడు ఇంటర్ దాకా చదివి ఉపయోగమేమిటి? అలా కాకుండా వాడు ఏ మెకానిక్ దగ్గరో పనిచేసుకుని ఉంటే, వాడు వయసు వచ్చేసరికి అందులో మెలకువలు నేర్చుకొని సంపాదనాపరుడౌతాడు.
నేనెప్పుడో 10 ఏళ్ళ క్రితం చదివిన ఒక కధ గుర్తుకవస్తోంది. చాలా బాగా రాసాడు. ఆ రచయిత ఎవరో, ఎందులో చదివానో కూడా గుర్తులేదు. MA సోషల్‌వర్క్ చదివిన విద్యార్ధి తన ఫైనల్ ఇయర్ ప్రాజక్ట్ వర్కులో భాగంగా జాలర్లుండే సముద్ర ప్రాంతానికి వెళతాడు. అక్కడ నాలుగు రోజులు పరిశీలించి, ఒక పల్లె అతన్ని నువ్వు రోజూ నీ కొడుకుని సముద్రంలోకి ఎందుకు తీసుకుని వెలుతున్నావు అని అడుగుతాడు. అంటే అతను నా కొడుక్కి చేపల వేట నేర్పటానికి అంటాడు. అలా వద్దు, అతన్ని స్కూల్‌కి పంపు, అక్కడ చదువుకుంటాడు అని ఈ వ్యక్తి అంటాడు. అప్పుడు, ఆ పల్లెతను చదువుకుని మా వాడు ఏమి చేస్తాడు అంటే, ఈ కుర్రవాడు హాయిగా ఉద్యోగం చేసుకుంటాడు అని అనగానే ఆ పల్లెతను బాబూ ఇంతకీ నువ్వేమి చేస్తున్నావు, నన్ను ఇన్ని ప్రశ్నలేస్తున్నావు అని అడుగుతాడు. అప్పుడు ఆ కుర్రవాడు ఇది నా ప్రాజక్ట్ వర్క్, ఇది చేస్తే నాకు డిగ్రీ ఇస్తారు. అది తీసుకుని నేను ఉద్యోగంలో చేరుతాను అంటాడు. వెంటనే ఆ పల్లెతను నాయనా ఇప్పుడు నా కొడుకు చేస్తున్నది ఆ ప్రాజక్ట్ వర్కే. ఇది వాడు బాగా చేస్తే తరువాత వీడు సొంతంగా వేటకెల్లి వాడి సంపాదన వాడు సంపాదించుకుంటాడు అని చెప్పి కొడుకుని తీసుకుపోతాడు. నాకెందుకనో ఆ కధ చాలా బాగా నచ్చింది.
నిజంగా ప్రభుత్వానికి చిత్తశుద్ది ఉంటే ముందు ప్రభుత్వ పాఠశాలలని సరిచెయ్యమనండి. చెప్పడానికి మాస్టార్లు ఉండరు, కూర్చోవడానికి బల్లలుండవు, వీళ్ళని స్కూల్లల్లో చేర్చి సాధించేదేమిటి? ఒక చిన్న ఉదాహరణ. మా ఫాదర్ పాలిటెక్నిక్ ప్రిన్సిపాల్‌గా చేసి రిటైర్ అయ్యారు. ఆయన ఒక గర్ల్స్ పాలిటెక్నిక్ దగ్గరుండి కట్టీంచాకా ఒక బ్రాంచ్‌కి లెక్చరర్స్ లేరంట. ఆయన డైరక్టర్‌కి లెటర్ మీద లెటర్ పెట్టి పని అవ్వక చివరికి మినిస్టర్‌కి ఆ బ్రాంచ్ని అసలు ఆ కాలేజీలో తీసేసి అక్కడ ఉన్న అమ్మాయిలని స్టాఫ్ ఉన్న కాలేజీలకి పంపమని లెటర్ పెట్టారంట. అప్పుడు ఆ డైరక్టర్ మా ఫాదర్ మీద సీరియస్ అయితే, ఈయన కూడా సీరియస్ అయ్యి ఆడపిల్లలని మన దగ్గరకు చదువు చెప్పమని పంపిస్తే, మనం వాళ్ళకి చదువులు చెప్పకుండా ఖాళీగా హాస్టల్లో కూర్చోపెట్టి పంపుదామా, నీ దగ్గర స్టాఫ్ లేరని తెలిసి ఈ కాలేజీలో ఆ బ్రాంచ్ ఎలా పెట్టావు అని అడిగారంట. అదీ మన కాలేజీల పరిస్థితి.
ఇక్కడ బాల కార్మిక వ్యవస్థ రద్దుకంటే దానిని క్రమబద్దీకరించడం సరి అయిన పని అనిపిస్తోంది. ఎందుకంటే ఆర్ధిక పరిస్థితులు మారనంతవరకు దానిని రద్దు చెయ్యడం ఎవరి వల్లా కాదు. అంతకంటే పిల్లలు చేసే పనులు వర్గీకరించి వయసుల వారీగా వాళ్ళకు పనులు కేటాయించేటట్టు చూస్తే కొంతలో కొంత మెరుగు. నేను కొద్దికాలం క్రితం ఒక పెద్ద కంపెనీలో చిన్న వర్క్ చేసాను. అప్పుడు అక్కడ లేబర్ కేంప్లో చాలా మంది చిన్న పిల్లలను చూసాను. వెంటనే అక్కడ ఉన్న మా మేస్త్రీతో నేను నెలకు మూడు వేలు జీతం ఇస్తాను, ఇక్కడ ఎవరైనా చదువుకుని ఖాళీగా ఉన్న కుర్రవాళ్ళు ఎవరైనా ఉన్నారేమో చూడు, ఈ పిల్లలకు చదువుచెప్పడానికి అని చెప్పాను. అతను వెంటనే ఇవన్నీ మీకెందుకు సార్, ఇప్పటికే మునుగుతారో, తేలతారో తెలియని పరిస్థితుల్లో ఉన్నారు, అంటే నేను ఏమయ్యా నాకొచ్చే నష్టంలో ఇదో లెక్క కాదులే అని చూడమని చెప్పి వచ్చేసాను. దురదృష్టవశాత్తు నా లేబర్ అడ్వాన్స్ పుచ్చుకున్నవాళ్ళు ఆ రాత్రే పారిపోవడంతో నేను ఇంక ఆ వర్క్ మానివేసాను. కాకపోతే నేను అక్కడ చూసినదానిని బట్టి మన ప్రభుత్వం అలా లేబర్ కేంప్‌లు ఉన్న చోట ఆ కాంట్రాక్టర్ ఖచ్చితంగా ఉచిత విద్య నేర్పే ఏర్పాటు చెయ్యాలి. ఎందుకంటే పెద్ద సైటుల్లో ఎంత తక్కువగా చూసినా 300మంది పైనే లేబర్ ఉంటారు. అక్కడ ఎలా లేదన్నా పాతిక మంది పైనే చిన్న పిల్లలుంటారు. వాళ్ళకి నాలుగు అక్షరం ముక్కలు వ్రాయడం, కొద్దిగా కూడికలూ, తీసివేతలు వచ్చేటన్ని లెక్కలూ నేర్పిస్తే చాలు. అది కూడా ఆ కాంట్రాక్టర్లు చేయరు.
ఇక మన LEO లు ఉంటారు. వాళ్ళు వచ్చేటప్పుడు మాకు ముందే కబురు తెలిసిపోతుంది. వెంటనే మా కాంట్రాక్టర్లు వర్క్ ఆపుచేసేస్తారు. మేము కూడా వాళ్ళకే వంత పాడతాము. మా దగ్గర కొద్దిగా మొహం ముదరగా ఉంటే చాలు వాడికి 18 ఏళ్ళు అని చెప్పమంటాము, లేదూ వాడు పొట్టోడు అని చెపుతాము. తప్పదు, వాడి పొట్ట నిండాలి కదా. కాకపోతే నేను మాత్రం వాళ్ళతో క్యూరింగ్ తప్పితే బరువు పనులు చెయ్యనిచ్చేవాడిని కాదు. ఎందుకంటే మా అమ్మ నేను ఉద్యోగంలో చేరేవరకు నాతో బకెట్ నీళ్ళు కూడా మొయ్యనిచ్చేది కాదు. ఒక సారి నా చేపల చెరువు దగ్గర నీటి కాకులని కొట్టడానికి ఒక కుర్రవాడిని నెలకు 700 ఇచ్చి పెట్టాను. కొన్ని రోజులు పోయాక మా ప్రెసిడెంట్ వచ్చి కుర్రవాడిని తీసేయమన్నాడు. సరే తీసేస్తాను, అంతే కాదు వాడికి పుస్తకాలు కూడా కొనిస్తాను, ఆరు నెలల తరువాత వాడికి నేనే పరీక్ష పెడతాను, వాడు సరిగ్గా రాయకపోతే నీకు పగులుద్ది అని చెప్పి పుస్తకాలు కొనిచ్చాను. సరిగ్గా నెల తరువాత వాడు వేరే రైతు దగ్గర మేతలు కడుతూ కనిపించాడు. వాడు మాత్రం ఏమి చేస్తాడు. బడిలో మాష్టారులుండరు.
బాల కార్మికులను ఎటువంటి పనుల్లో పెట్టవచ్చో ప్రభుత్వమే నిర్ణయించాలి. హోటల్లో పనిచేసే పిల్లలను చూపించి ఆ ఓనర్లను బెదిరించడానికి తప్పితే ఈ చట్టం ఎందుకూ పనికి రాదు. ప్రమాదకరమైన పనుల్లో కొన్ని వేల మంది పిల్లలు పనిచేస్తున్నారు, వాళ్ళని రక్షించవలసిన అధికారుల కళ్ళు డబ్బుతో మూస్తుంటారు. సంపద అందరికీ పంపిణీ అయితే ఈ ప్రోబ్లం ఉండదు. అందులో ఇప్పుడు మన ప్రభుత్వం పెట్టిన ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీము అసలు వర్కర్లు దొరకని పరిస్థితి కలించింది. వాడు వెళ్ళి రెండు గంటలు పని చేస్తే చాలు వాడికి డబ్బులు వచ్చేస్తున్నాయి. ఇంక వాడు బయట పనికి ఎందుకు వస్తాడు? ఇంక పిల్లల మీద అధారపడవలసిందే. నేను కన్స్ట్రక్షన్ ఫీల్డులో ఉన్నాను. ఏ మేస్త్రీని కదిపినా లేబర్ లేరనే మాటే. ముఖ్యంగా పల్లెటూర్లలో ఈ ఇబ్బంది చాలా ఎక్కువగా ఉంది. నేను బాల కార్మిక వ్యవస్థను సపోర్ట్ చేస్తున్నాననుకోవద్దు, కానీ మన వ్యవస్థ మారనంతవరకూ దీనిని మనం ఆపలేము.

Monday, March 14, 2011
నా నెచ్చెలి.
ఈ బుజ్జిముండని 2004 లో, అప్పటిదాకా నా దగ్గర ఉన్న పల్సర్ 150cc, మారుతీ 1000cc లు అమ్మేసి కొన్నాను. పాపం ఆ రోజు నుండీ ఈ రోజు దాకా నేను ఏ పరిస్థితుల్లో ఉన్నా, నన్ను చాలా క్షేమంగా నా గమ్యానికి చేరుస్తూనే ఉంది. షాద్‌నగర్ పొలాల్లో తిరిగినా, తిరుపతి ఏడుకొండలు ఎక్కినా, అరకు అందాలు చూడడానికి వెళ్ళినా, శ్రీశైలం, ఆత్మకూర్ ఘాట్ రోడ్‌ల్లో తిరిగినా, మంత్రాలయం, పుట్టపర్తిలు తిరిగినా, తుల్జాపూర్, అక్కల్కోట్, ఘాణుగాపూర్లు తిరిగినా ఆఖరికి విపరీతమైన డిప్రెషన్‌తో ఎక్కడో అక్కడ ఏక్సిడెంట్ అయ్యి చావకపోతానా అని (ఒక ఆత్మహత్యా ప్రయత్నం విఫలం అయ్యి రెండో సారి చేసుకునే దైర్యంలేక) అర్ధరాత్రి హైదారాబాద్‌లో బయలుదేరి వైజాగ్ ప్రయాణమైనా, నా కోరిక తీరకుండా నా గమ్యస్థానానికి నన్ను చేరుస్తూనే ఉంది. ఏరోజూ నన్ను దారిలో ఇబ్బంది పెట్టలేదు. ఇండియన్స్‌ని సెంటిమెంటల్ ఫూల్స్ అని విదేశీయులు వేళాకోలం చేస్తారు. కానీ వాళ్ళకేమి తెలుసు, మనల్ని ప్రాణం లేని వస్తువులు కూడా కాపాడతాయని.
నేను ఇప్పటిదాకా Luna, Bajaj Chetak, Kawasaki RTZ, Calibar, Hero Honda SS, Pulsar 150cc, Maruti 1000cc లు వాడినా, నా మదిని దోచినవి మాత్రం Kawasaki, ఇప్పుడు నా దగ్గర ఉన్న Yamaha Crux లు మాత్రమే. ఇది కొనడం కూడా మా కజిన్ చెప్పేడని కొన్నాను. లేకపోతే మళ్ళీ బజాజ్ వాళ్ళదే ఏదో ఒకటి కొనేవాడిని. వాడిని ఇప్పటికీ తిడుతూ, నువ్వు జీవితంలో చేసిన ఒకే ఒక్క మంచిపని నన్ను ఈ బండి కొనమనడంరా అంటుంటాను.
దీనిని నేను సరిగ్గా వాడడం మొదలుపెట్టింది 2008 జనవరి 17 నుండే. ఆ రోజు ఎక్కడో అక్కడ ఏక్సిడెంట్లో చచ్చిపోవాలని రాత్రి 11.00కి హైదరాబాద్‌లో వైజాగ్ వెళ్ళడానికి బయలుదేరాను. అప్పటినుండీ ఇది నా ప్రియనేస్తం అయ్యిపోయింది.దీనిమీద అరకు అందాలు చూసాను, శ్రీశైలం, మహానంది, తిరుపతి, కాళహస్తి, కాణిపాకం, పుట్టపర్తి, మంత్రాలయం, తుల్జాపూర్, అక్కల్కోట్, ఘాణుగాపూర్ లాంటి పుణ్యక్షేత్రాలు తిరిగాను. ఏరోజూ ఎక్కడా ఆగడం అనేది జరుగలేదు. ఈ జనవరిలో ఇది అమ్మేసి Apachi కొందామనుకొని, దీనిని అమ్మబుద్ది కాక Apachi కొనడం ఆపేసాను. ఇప్పుడు నేనున్న పరిస్థితుల్లో రెండు బళ్ళు వాడడం కష్టం. ఇదివరకు ఐతే వాడినా వాడకపోయినా నా Kawasaki ని అమ్మకుండా అలాగే ఉంచేసాను. చివరికి ఆస్థితోపాటు అది కూడా అమ్మేసాను. ఎందుకంటే నాది అనుకొనే ఏ వస్తువుకూడా నా దగ్గర ఉంచుకోదలచుకోక దానిని షాద్‌నగర్‌లో అమ్మేసాను. ఇక ఇప్పుడు దీనిని అమ్మే ఆలోచన లేదు. నేను వేరే ఊరు ఏదైనా పనిమీద ఎక్కువ కాలం వెళ్ళవలసి వస్తే, రాగానే ముందు నేను దీనిని తనివితీరా చూసుకొనిగానీ పైకి వెళ్ళను. ఇది నా మీద అంత ప్రభావం చూపించింది.
Subscribe to:
Posts (Atom)