ఆర్.కె. లక్ష్మణ్ గారికి క్షమాపణలతో.............

Saturday, October 31, 2015

అజ్ఞాని ఘోష.



నాకు బాగా గుర్తునేను ఏడో తరగతిలో ఉండగాసరిగ్గా చదవడం లేదనిఅల్లరి బాగా చేస్తున్నానని 

మా నాన్నగారు నన్నుకుట్టు మిషన్ బెల్ట్‌తో కొట్టారు. మోకాలి మీద ఆ మచ్చనాకు 

గుర్తున్నంతవరకు డిప్లొమా చదివేటప్పుడు కూడా ఉండేది. ఆ తరువాతపదో తరగతిలో కాకినాడ 

నుండి విజయవాడలో ఉన్న బుచ్చయ్య మాష్టార్ దగ్గరకు పంపారు. అక్కడ నుండి ఇరవై రోజుల్లో 

బెంగపెట్టుకొని ఇంటికి వెళ్ళిపోయాను. మా నాన్నగారికి కొట్టీకొట్టీ విసుగొచ్చివీడికి ఇక చదువు 

రాదు అని వదిలేసారు. ఏదో అత్తెసరు మార్కులతో డిప్లొమా పూర్తి అయ్యిందనిపించాను.



నాకు చదువు సరిగ్గా రాకపోవడంఒక అజ్ఞానిలా మిగిలిపోవడం వలన చచ్చినవాడూచంపబడ్డ 

వాడు హిందువాముసల్మానాక్రిస్టియన్నా అనే భేధాన్ని గుర్తించే శక్తి నాకు రాలేదు. ఎవడు

చచ్చినా వాడి మీద జాలితోచచ్చిన వాడి బంధువులు తిరగబడి చంపితే బాగుండును అనుకునే 

రాక్షస/ జంతు ప్రవృత్తి అలా ఉండిపోయిందిచదువు లేదు కదా.


అలాగే హలాల్ చేసిన మాంసం తినడం మానివేసినప్పుడుముస్లిం సోదరులను భోజనానికి 

పిలిస్తేరొయ్యలు కాకినాడ నుండి తెప్పించి వండించే హ్రస్వ దృష్టితో ఉండిపోయాను.



ఇతర మతాల దేవుళ్ళను దిగజార్చి మాట్లాడే శక్తి నాకు రాలేదు. ఇతర మతాల వారి అలవాట్లను 

కించపరచే ఆలోచనలు రాలేదు. ప్రక్కవాడు అసహ్యించుకునే గన్నవరం సీమ పంది మాంసాన్ని

అతను బాధపడేటట్టు బహిరంగంగా తినడం రాలేదు. ఆస్తికుడు మూర్ఖుడు అంటూవాడిని 

మారుస్తానని చెప్పిద్వేషాన్ని చిమ్మడం రాలేదు. కన్నతల్లితండ్రులుచదువు చెప్పిన గురువుల 

తరువాత స్థానాన్ని పొందేనేను నమ్మే నా దేవుళ్ళ విగ్రహాల మీదమూత్రం పోస్తాను అన్నవాడిని 

హేతువాదిమేధావి అని గుర్తించే జ్ఞానం రాలేదు.


వీటన్నిటి వలన నాకు ఏ అవార్డూ రాలేదూఇప్పుడు వాటిని తిరిగిచ్చి

మేధావిని అని పేరు పొందే అవకాశమూ రాలేదు. ప్చ్.  :( 

2 comments:

  1. జ్ఞానమనేది సమాజాన్ని పాడుచేయకుండా వుంటే చాలు కదా సార్. మనకున్నదే జ్ఞానం అనుకునే అజ్ఞానులు నానాటికీ పెరిగిపోతున్నారు. జ్ఞానం లేదు, రాలేదు అంటూనే జ్ఞానిలా మాట్లాడారు. అవార్డులను తిరిగి ఇచ్చేయటమనేది వారి సొంత అభిప్రాయం. దానికి మనమేమీ అనలేం. కానీ ఏం జరిగినా ఏ సీజన్ లో ఆయా పండ్లు పండుతున్నట్లు ఏం జరిగినా సీజన్ లా జరిగిపోతున్నాయ్. ఇది జ్ఞానం వలన జరుగుతోందో..అజ్ఞానం వల్ల జరుగుతోందో అర్థం చేసుకునే జ్ఞానం మాత్రం నాకూ రావటం లేదు సార్...

    ReplyDelete
  2. all the pseudo intellectuals should be fed with pig meat i.e. pork day and night. useless fellows.

    ReplyDelete