ఆర్.కె. లక్ష్మణ్ గారికి క్షమాపణలతో.............

Friday, December 31, 2010

మన ఆశయ సాధన కోసం ఇలా చేస్తే ఎలా వుంటుందో ఆలోచించండి.



చెప్పులోన రాయి, చెవిలోని జోరీగ, కంటినలుసు, కాలిలోన ముళ్ళు, ఇంటి లోన పోరు ఇంతింత కాదయా విశ్వదాభి రామ వినురవేమ! ఎంత బాగా చెప్పాడు మన వేమన, దయచేసి ఆయన ఆంధ్రా వాడు అని అనవద్దు. ఇంత బాగా ఆయన చెప్పాకా కూడా మనం తెలంగాణా సాధించడానికి ప్రాణాలు త్యాగం చెయ్యాలా? ఒక్క సారి ఆలోచించండి.

చిన్న చిన్న విషయాలతో ఈ ప్రభుత్వాన్ని చికాకు పెట్టవచ్చు.నేను పైన పెట్టిన ఫోటో ఒక ఉదాహరణ. Face book లో మధుకర్ చింటు అనే వ్యక్తి తన ప్రొఫైల్ ఫోటో గా పెట్టాడు. ఇలాంటివి చిన్న విషయాలుగా కనిపిస్తాయి కానీ వాటి ఇంపాక్ట్ చాలా ఎక్కువగా వుంటుంది. మనకి అనుకూలంగా గనుక జరగకపోతే మనమేమి రెచ్చిపోవద్దు. చాలా కూల్ గా మన పని మనం చేసుకుపోదాము. మీరు ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోండి. మంచి వేసంకాలం మనం కరంట్ పోయినప్పుడు మన ఇంట్లో పడుకుంటాము. విపరీతంగా చెమటలు పడుతుంటాయి, గాలి వెయ్యదు, ఒక ప్రక్క నిద్ర ఆగదు. ఆ టైంలో ఒక ఈగ మన మొహం మీద వాలి, మనం ఎన్నిసార్లు కొట్టినా ఎగిరినట్టే ఎగిరి మళ్ళీ మన ముక్కు మీద వాలి మనల్ని చికాకుపెడుతుంటుంది. అప్పుడు మనకు ఎలా వుంటుంది? దానిని చంపాలనుకుంటాము, కానీ అది మనకు దొరకదు. అలా మనం ఈ ప్రభుత్వాన్ని చికాకుపెట్టాలి.

ఈ ప్రభుత్వానికి కొన్ని రోజులు (వారాలు కాదు)సమయం ఇద్దాము. తరువాత, మన రాష్ట్రం వాళ్ళు ఇచ్చేదేమిటి, మనమే ఏర్పాటు చేసుకుందాము. మన పెద్ద వాళ్ళని అడిగి కొత్త రాష్ట్రం ఏర్పాటు అయితే ఏమేమి మార్పులు జరుగుతాయో తెలుసుకొని వాటిలో మనం చెయ్యగలిగేవి ఎటువంటి గొడవలు లేకుండా నిదానంగా చేసుకుపోదాము. అందులో మొదటిది  తెలంగాణా జిల్లాల్లో రిజిస్టర్ అయిన (1,9,10,11,12,13,15,20 మొదలైనవి) అన్ని వాహనాలకి TG అని రాసేద్దాము.ఆంధ్రా జిల్లాల రిజిస్ట్రేషన్ నెంబర్లు మార్చం. అన్ని స్తిక్కరింగ్ దుకాణాల వాళ్లకి TG అనే రాయమని చెప్పుదాము. అలా రాయకపోతే మన పద్దతిలో తప్పు వేద్దాము. ఇక్కడ వున్న వాళ్ళు, వాళ్ళు ఏ ప్రాంతం వాళ్ళు అయినా సరే వాళ్ళ బళ్ళు మన తెలంగాణా జిల్లాల్లో లో రిజిస్టర్ అయ్యివుంటే, వాళ్లకు వాళ్ళే, వాళ్ళ నంబర్ ప్లేట్స్ మీద AP అని తీసేసి TG అని వ్రాయిన్చుకోవాలని చెప్పుదాము. ఈ ప్రభుత్వానికి ఎటువంటి బిల్లులు, టాక్స్ లు కట్టవద్దు. మన స్కూల్స్ లో పిల్లలకి జిల్లాలతో కూడిన మన తెలంగాణా మేప్ లు ఇద్దాము. ఎక్కడా గొడవ చెయ్యకుండానే ఇవన్నీ చెయ్యవచ్చు. మన యునివర్సిటీ రిజిస్ట్రార్లు గా సింహాలు వస్తాయో, నరసింహాలు వస్తాయో రానివ్వండి. విద్యార్థులు ఎవరూ పరీక్షలు రాయడం మానవద్దు. ఎందుకంటే మన రాష్ట్రం వచ్చేసరికి మీరందరూ ఉద్యోగార్థులై వుండాలి.

ఈ ఒక్కసారికి మాత్రం ప్రాణ త్యాగాలు అవసరమైతే ఆ అవకాశం మన రాజకీయనాయకులకు గానీ వాళ్ళ పిల్లలకి గానీ ఇద్దాము. ఎందుకంటే మనం మన రాష్ట్రం ఏర్పాటు అయ్యాకా అందరికీ సమాన అవకాశాలు కల్పిస్తామని వాగ్దానాలు చేసాము. వాగ్ధాన భంగం అనేది గో హత్యతో సమానం అని మన పెద్దలు అంటారు. కాబట్టి మనం రాష్ట్ర ఏర్పాటు కు ముందే మన మాట తప్పకూడదు. పైగా వాళ్ళు కూడా మనం వాళ్లకి అవకాశం ఇవ్వడంలేదని, స్వాతంత్య్రం  వచ్చాకా నిరాహార దీక్షలతో ప్రాణత్యాగం చేసిన కీ.శే. పొట్టి శ్రీ రాములు, శ్యాం ప్రసాద్ ముఖర్జీ లకి వచ్చినట్టు వాళ్లకి పేరు రాకుండా మనమే అడ్డుకుంటున్నామని, వాళ్లకు లాగే ప్రాణత్యాగం చేసి విగ్రహాలు పెట్టించుకొనే అవకాశం ఇవ్వడం లేదని మూలుగుకుంటున్నారు. మన రాష్ట్రం ఏర్పాటు కాకముందే మనం ఇలా దెబ్బలాడుకోవడం మంచిది కాదు. పైగా ఒకళ్ళ ఉసురు మన రాష్ట్రానికి మంచిది కాదు. కాబట్టి ఈ సారికి మాత్రం అవకాశం వాళ్ళకే ఇద్దాము. గత 60 సంవత్సరాల నుండి అన్ని సార్లూ ప్రాణ త్యాగం చేసే అవకాశం విద్యార్ధులే వాడుకుంటున్నారు, అది పద్ధతి కాదు కాబట్టి ఈ సారి వాళ్లకి ఇవ్వవలసిందే. మీరు గనుక అలా చెయ్యకపోతే వాళ్ళు మానవ హక్కుల సంఘానికి  వెళ్ళడానికి కూడా సిద్దపడుతున్నారు. కనుక మనమే ఈ సారి మన రాజకీయనాయకులని నిరాహార దీక్షలో కూర్చోపెడదాము. ఏం, ఆంధ్రా వాల్లకేనా పొట్టి శ్రీ రాముల లాంటి నాయకులుండేది, మనమేమైనా వాళ్ళకంటే తీసిపోయామా, మనకూ అలాంటి ఒక వ్యక్తి కావాలి, మనమూ విగ్రహాలు పెట్టుకోవాలి, తప్పదు. వాళ్ళకంటే మనమే గొప్ప, మన రాష్ట్రం కోసం ప్రాణత్యాగం చెయ్యడానికి మన వాళ్ళు ఒకరి మీద ఒకరు పోటీ పడి మరీ ముందుకు వస్తున్నారు. మనమే వాళ్ళల్లో ఒకరిని చిట్టీ తీసి సెలెక్ట్ చెయ్యాలి.

నేషనల్ న్యూస్ పేపర్స్ లో యాడ్ ఇద్దాము. ఫిబ్రవరి 1st నుండి మన జిల్లాలకు వచ్చే అన్ని లెటర్స్ మీద తెలంగాణా స్టేట్ అనే వుండాలి అని. అలా లేకపోతే అవి డెలివరి అవ్వవు అని ఇద్దాము. మన కొరియర్ కుర్రాళ్ళకి చెపుదాము, అలా లేకపోతే తప్పు అడ్రస్స్ అని చెప్పి వెనక్కుపంపెయమని. అన్ని షాప్ ల వాళ్లకి వాళ్ళ షాప్ నుండి ఇచ్చే కవర్స్ మీద వాళ్ళ అడ్రస్ వున్నచోట తెలంగాణా స్టేట్ అని ప్రింట్ చేయిన్చమందాము. మన లాయర్స్ లో కొంతమంది మన మీద వచ్చే కేసులు ఫ్రీ గా వాదించాలి అని అడుగుదాము. ఇవన్నీ కూడా ఖాళీగా వున్న నాకు లాంటి వాళ్ళే చెయ్యాలి. విద్యార్ధులు ఎవరూ కూడా వాళ్ళ చదువులు మానవద్దు. 18 ఏళ్ళ లోపు పిల్లలెవరూ ఈ విషయం లోకి రాకుండా చూసుకోవాలి. మన రాజకీయ నాయకులు నిరాహార దీక్షలకు, ప్రాణ త్యాగాలకు మాత్రమే పరిమితమవ్వాలి. వాళ్ళు చేసేదానిలో మనమెవరమూ కల్పించుకోమని వాళ్లకు మాట ఇవ్వాలి. వాళ్ళు కూర్చునే టెంట్ ల దగ్గర కుర్రవాళ్ళు ఎవరూ ఉండకూడదు. ఎవరి పని వాళ్ళు చేసుకుపోవాలి. ఒకరి విషయాల్లో ఒకరు కల్పించుకోకూడదు. ఇలా ముందే మాట తీసుకోవాలి. లేకపోతే, తరువాత వాళ్ళు రెచ్చగొట్టారు కనుక కుర్రవాళ్ళు రెచ్చిపోయారు అని వాళ్ళమీద కేసులు పెడతారు.

మన ఆశయ సాధన కోసం ఇలా చేస్తే ఎలా వుంటుందో ఆలోచించండి.

Tuesday, December 28, 2010

విద్యార్ధి నాయకులారా ఆలోచించండి, మీరు తెచ్చిన తెలంగాణా మీరే పరిపాలించండి.

డిసెంబర్ 31, రాష్ట్రమే కాదు దేశం అంతా ఆ రోజు గురించే చూస్తోంది. శ్రీ కృష్ణ కమిటీ ఏమి చెప్పుతుందో ఎవరికీ తెలియదు. కానీ విద్యార్దుల్లో ఉద్వేగాలు మాత్రం రెచ్చగొడుతున్నారు. ఇక్కడ వాళ్ళని చూసి ఆంద్ర, రాయలసీమల్లో కుర్రాలు తయారయ్యిపోతున్నారు. విద్యార్ధుల్లో ఉద్వేగాలు బాగా పెరిగిపోతున్నాయి. వీళ్ళ ఉద్వేగాలు వీళ్ళకి నష్టం కలుగచేస్తుంటే, రాజకీయనాయకులకి మాత్రం మంచి లాభాలు తెచ్చిపెడుతున్నాయి. అసలు ఈ విద్యార్థులు ఇంత మూర్ఖంగా ఎందుకు ప్రవర్తిస్తున్నారో అర్థం కావడం లేదు. వీళ్ళకి ఆలోచనా శక్తి లేదా? వుంటే వీళ్ళు ఈ రాజకీయనాయకుల డ్రామాలు చూస్తూ కూడా ఇంకా వాళ్ళని ఎందుకు నమ్ముతున్నారు? రేపు తెలంగాణా వచ్చాకా ఏమౌతుంది? ఏమీ కాదు, ఒక వెధవ పోయి ఇంకో వెదవ వస్తాడు. మనకు మిగిలే తృప్తి ఏమిటంటే మన వెధవ మనల్ని పరిపాలిస్తున్నాడు అనేది మాత్రమే. కే.సి.ఆర్. నిరాహారదీక్ష విరమించినప్పుడు కుర్రవాల్లల్లో ఉద్వేగం చూసాకా, ఆహా, ఇంత కాలానికి మన కుర్రవాళ్ళు కళ్ళు తెరుసుకున్నారు, ఇంక ఉద్యమాన్ని వీళ్ళే నడుపుతారు, తెలంగాణకి కొద్ది కాలమైనా మంచి పాలకులు దొరుకుతారు అని ఆనందించాను. అంతే మళ్ళీ వారం రోజుల్లో అంతా మామూలే. అసలు ఒకసారి నిర్ణయం తీసుకొని జే.ఏ.సి. ఏర్పాటు చేసుకున్నాకా, మళ్ళీ అందులోకి రాజకీయనాయకులని ఎందుకు రానిచ్చేరో అర్థం కావడం లేదు. అసలు జే.ఏ.సి. ఏర్పాటు చేసినప్పుడే, అందులో ఎవరి రాజకీయ అభిప్రాయాలు వాళ్లకి ఉండవచ్చు, కానీ వాటిని ఇందులోకి మాత్రం తీసుకురాకూడదు అనే నిర్ణయం తీసుకోనివుంటే, అస్సాం లో AASU లాగ ఇక్కడ కూడా ATSU పుట్టి ఉండును. అందరూ చదువుకున్న కుర్రవాల్లె కదా, వీళ్ళకి రాజకీయ నాయకుల అవసరం ఏమిటి? ఏం వీళ్ళకి పరిపాలించే దమ్ము లేదనుకున్నారా? ఈ రాజకేయనాయకులందరి కంటే కూడా వీళ్ళే మంచి పరిపాలన కొద్దికాలం ఐనా ఇవ్వగలిగేవారు. కొద్దికాలం అని ఎందుకు అంటున్నానంటే, ఎటువంటి వాడైనా అధికారం వచ్చాకా దానిని నిలబెట్టుకోవడానికి గడ్డి తినవలసిందే. కాకపొతే చిన్న వయసులో సిద్దాంతాలు అంత తొందరగా మార్చుకోలేరు గనుక, మరలా ఎలెక్షన్స్ దాకా అయినా బాగా పరిపాలించేవారు. ఇంతమంది కుర్రవాళ్ళు ఆత్మ హత్యలు చేసుకున్నారు కదా, వాళ్ళని నిజంగా మనం ఎన్నిసార్లు గుర్తుకుచేసుకున్నాము? ఏదైనా సందర్భం వచ్చినప్పుడు మాత్రమే వాళ్ళు గుర్తుకువస్తారు, అది కూడా అంతకు ముందు వాళ్ళతో పరిచయం వున్నవాళ్ళకే. కానీ వాళ్ళ తల్లి తండ్రుల పరిస్తితి ఏమిటి? ఇది అంతా ఎందుకు చెపుతున్నానంటే జైఆంధ్రా ఉద్యమం లో నా మేనత్త కొడుకు చచ్చిపోయాడు. డిప్లొమా పరీక్షలు రాసి ఈ ఉద్యమం లో పాల్గున్నాకా, ఉండి రైల్వే స్టేషన్ తగులపెడుతున్నప్పుడు ప్రమాదవశాత్తు ఆ మంటలు అంటుకొని చనిపోయాడు. మరలా ఇప్పుడు ఈ ఉద్యమం. ఈ రాష్ట్రం విడిపోవాలని ఇప్పటిదాకా అటువైపు, ఇటువైపు ఎంతోమంది చనిపోయారు, చనిపోతున్నారు. ఇప్పటికీ ఈ విద్యార్థులకి బుద్ధి రావడం లేదు. ఇంకా ఎంతకాలం ఇలా ఈ రాజకీయనాయకుల రాక్షస క్రీడకి బలయ్యిపోతారు? ప్రజాస్వామ్యం ఆంటే మనల్ని మనం పరిపాలించుకోవడం. ఇదివరకిటి రాజుల స్థానం లోకి ఇప్పుడు రాజకీయనాయకులు వచ్చారు. కాబట్టి మనల్ని మనమే పరిపాలించుకుందాము. తెలంగాణా వచ్చేది విద్యార్థుల ద్వారా మాత్రమే. మనం తెలంగాణా తెచ్చి దానిని ఎవరి చేతిలోనో పెట్టడం ఎందుకు? ఎలాగా ఇంకొద్ది కాలమైనా పోరాటం తప్పదు. ఒక్కసారి విద్యార్థులు అందరూ కలసి కూర్చుని ఆలోచించండి. రాజకీయనాయకుల అవసరం మీకు లేదు. మీ అవసరమే వాళ్లకి వుంది. మీరు తెచ్చిన దానిని మీరే పరిపాలించండి. నేను చాలా సార్లు యూనివర్సిటి కి వద్దామనుకున్నాను. కానీ నేను ఆంధ్రా నుంచి వచ్చాను కాబట్టి నన్ను నమ్మరని రాలేదు. దయచేసి విద్యార్ధి నాయకులారా ఆలోచించండి. పోరాటం తప్పదు. కానీ హింస వద్దు. చాలా చిన్న చిన్న పనులతో ప్రభుత్వాన్ని ముప్పు తిప్పలు పెట్టవచ్చు. సరిగ్గా చెప్పాలంటే చంకలు నాకిన్చచ్చు. దయచేసి మీరు తెచ్చిన తెలంగాణా మీరే పరిపాలించండి.

Sunday, December 26, 2010

నాధూరాం గోడ్సే ని విమర్శించడం ఒక ఫేషన్ అయ్యిపోయింది.

http://timesofindia.indiatimes.com/city/mumbai/Godse-reference-stirs-up-hornets-nest-at-Thane-lit-fest/articleshow/7165552.cms

మన దేశంలో ప్రతిఒక్కరికి నాధూరాం గోడ్సే ని విమర్శించడం ఒక ఫేషన్ అయ్యిపోయింది. అతని దేశ భక్తిని శంకించే అర్హత ఈ కుహనా లౌకికవాదులకు ఇంకో వొంద జన్మలెత్తినా రాదు. ఆ రోజు అతను గనుక గాంధీ ని చంపకపోయి వుంటే మన దేశం ఇంకో వొంద ముక్కలయ్యేది. దురదృష్టవశాత్తు మన దేశానికి తొలి ప్రధానమంత్రి నెహ్రు అవ్వడం వలన అతను కోర్టు లో చేసిన వాదన ప్రతులను బయటకు రాకుండా నిషేధం విధించారు. చాలా కాలం తరువాత ఆ నిషేధం ఎత్తివేసాకా దానిని ప్రచురించినా అది ఎక్కువమందికి అందుబాటు లోకి రాలేదు. ఈ దేశంలో దానిని ఒక సీరియల్ గా ప్రచురించే దైర్యం ఏ ఒక్క పత్రికాధిపతికి లేదు. ఎందుకంటే అది ప్రచురిస్తే వాళ్ళ మీద  హిందూ మతతత్వ వాది అనే ముద్రపడిపోతుంది. ఈ దేశంలో మేధావులందరూ గుడ్డలిప్పుకొని తిరగడానికి సిగ్గుపడరు కానీ, నేను హిందువుని అని చెప్పుకోవడానికి సిగ్గుపడతారు. గోడ్సేని తిట్టేముందు అసలు అతని వాదనని ఎంతమంది చదివారు. చదవడానికి ఈ పుస్తకం బయట అమ్మే దైర్యం ఎవరికి వుంది? ఈ పుస్తకం కావాలంటే మనం ఏ ఆర్.ఎస్.ఎస్. ఆఫీస్ కో వెళ్ళాలి. సాని వాడకు వెళ్ళాలంటే లేని భయ్యం అక్కడకు వెళ్ళాలంటే వచ్చేస్తుంది.

అతని మరణ వాంగ్మూలం లో అతను చెప్పినదానిని చదివితే అతను ఎంత దేశభక్తి కలవాడో అర్ధం అవుతుంది. అతని పుస్తకం చదివితే ఎక్కడా ప్రపంచమంతా కొలిసే గాంధి నిజ స్వరూపం బయటపడుతుందో అనే భయం తో గాంధి పేరు చెప్పుకొని అడుక్కునే కాంగ్రెస్ వాళ్ళ భయం. ఒక్క కాంగ్రెస్ వాళ్ళే కాదు, బి.జే.పి. వాళ్లకి కూడా అతను చేసింది కరెక్ట్ అని చెప్పే ధైర్యం లేదు.

జైలు లో వుండగా అతను సంపాదించిన దానిలో సగభాగం సోమనాధ దేవాలయ కలశ స్తాపనకి ఇచ్చి, మిగిలిన సగభాగం తన సోదరులకు తన అంత్య క్రియలకి అయ్యే ఖర్చు నిమిత్తం ఇస్తూ, అతను వాళ్ళని ఒకటే అడిగాడు. నా అంత్య క్రియలు మీకు ఎలా వీలైతే అలా చెయ్యండి, కానీ నా చితాభస్మం మాత్రం భారతదేశపు ఏ నది ఒడ్డున కూర్చుని ఋషులు వేదాలు గానం చేసారో ఆ నది తిరిగి నా దేశపు సరిహద్దుగా వచ్చాక మాత్రమే అందులో కలపండి. అది మీ తరం లో సాధ్యపడక పొతే, దానిని అలాగే వుంచేయండి. ఆ పని భావితరాల వాళ్లైనా చేస్తారు అన్నాడు. ఇంతకు మించిన ఉదాహరణ ఇంకేమికావాలి అతని దేశ భక్తి గురించి చెప్పడానికి.

ఇతని తమ్ముడు గోపాల్ గాడ్సే తో ఇంటర్వ్యూ 80s లో ఒకసారి ఉదయం పేపర్ లో ఇచ్చారు. అతను అప్పుడు ఒకటే అన్నాడు. ఈ బి.జే.పి. వాళ్ళు మసీదులు, చర్చిలు అంటారేమిటి, మనకు కావాల్సింది అఖండ భారత్ దాని గురించి పోరాటం చెయ్యమనండి అని.

Thursday, December 23, 2010

ఇవి అన్నీ చదివి నన్ను మాత్రం మంచోడు అని అనుకోవద్దు.

ఎప్పుడో 5 వేల సంవత్సరాల క్రితం వ్యాస భగవానులు చెప్పారు. తల్లితో కానీ, చెల్లితో కానీ, మరి ఏ స్త్రీతో కాని ఒక కుర్చీలో కూర్చోవడం, ఒక శయ్య పై పరుండడం చెయ్యకూడదు, ఎందుకంటే ఎంతటి పండితుడు అయినా సరే అతని కంటే అతని ఇంద్రియాలు బలమైనవి అని. మనం పశు దశ నుండి మనిషిగా మారడానికి కొన్ని లక్షల సంవత్సరాలు పట్టింది. కానీ తిరిగి పశు దశ లోకి మారడానికి మనం చాలా వేగంగా కృషి చేస్తున్నాము. ఈ మద్యనే స్విస్ ప్రభుత్వం ఇన్సేక్టిసిజం ని లీగలైజ్ చేసింది. అది ఏదో  అక్కడ మాత్రమే జరుగుతుంది అని అనుకోవక్కర్లా, ఇక్కడ మన చుట్టూ కూడా జరుగుతానే వున్నాయి, కాకపొతే అవి రహస్యంగా. దానికి సొసైటీ అంగీకరించదు కనుక, వాళ్ళుబయటకు రావడం లేదు. ఈ రోజూ మనం దానిని అంగీకరించితే అది బహిరంగంగానే జరుగుతుంది. అప్పుడు మనం నిర్మించుకున్న వ్యవస్థ పరిస్థితి ఏమిటి? మనం నిర్మించుకున్నాము కాబట్టి మనమే కూలగొడదామా?

ఎందుకంటే మానవుడ్ని సోషల్ యానిమల్ అని అన్నారు, మనమందరమూ కట్టుబాట్లకు లోనయ్యి ఉన్నాము, అవే కనుక వదిలేస్తే పరిస్తితి ఎలా వుంటుందో ఆలోచించండి. 80s లో ఈ సబ్జెక్ట్ మీదే కీర్తి, కాంత, కనకం అనే సినిమా ఒకటి వొచ్చింది. ఒకసారి మా కంట్రాక్టర్, అతను గుంటూరు కాలేజ్ లో చదువుతున్నప్పటి సంఘటన ఒకటి చెప్పాడు. వాళ్ళ సార్ వరూధిని, ప్రవరాఖ్యుల కధ చెపుతూ ప్రవరాఖ్యుడు వీధిలో వస్తుంటే ఆడవాళ్ళందరూ తొంగి చూసేవారు అని చెపుతుంటే, ఒక కుర్రవాడు లెగిసి సార్ ఆ వూరిలో పతివ్రతలు లేరా అన్నాడంట, వెంటనే ఆయన ఒరేయ్ నాయన ఒక్కసారి ఈ కట్టు బాట్లు తీసేసి చూడు, అప్పుడు రాముల్లు వుండరు, సీతలు వుండరు అని. మనమందరమూ క్షమించాలి నాకులాంటి వాళ్ళందరూ సంస్కారం అనే ముసుగు కప్పుకొని ఉన్నాము, ఆ ముసుగు అలా ఉంటేనే మంచిది, అది కనుక తీసేసామా జరిగేది అరాచకమే.

ఈ రోజుల్లో ఆడవాళ్ళు వేసుకుంటున్న డ్రెస్ లు చూస్తుంటే అనర్ధాలు ఎందుకు జరుగుతున్నాయో తెలుస్తుంది. వయోభేదం లేకుండా మొగవాళ్ళు అంటే నా  లాంటి వాళ్ళు అందరు అటే చూస్తున్నారు. ఆ విషయం వాళ్ళకీ తెలుసు, వాళ్ళు నాకు లాంటి వాళ్ళ మీద జోక్స్ వేసుకున్టారేమో, చూడవే అంకుల్ ఎలా చూస్తున్నాడో, జుట్టుకి రంగు వేసుకొని కుర్రవాడిలా ఫోజ్ కొడుతున్నాడు అని. ఒక సారి నేను వైజాగ్ బీచ్ రోడ్ లో ఉప్పాడ దగ్గర ఒక చిన్న హోటల్ వుంది, (అక్కడ మటన్ చాలా బాగుంటుంది, చాలా చిన్న ముక్కలు కోసి ఇంట్లో ఆడవాళ్లే వండుతారు, రోజూ నేను సైట్ నుండి 8 కిలోమీటర్ లు వచ్చి అక్కడే తినేవాడిని, సరిగ్గా సంవత్సరంలో పది కేజీల బరువు పెరిగాను, పైగా ఒంటి పూట భోజనం) అక్కడ భోజనం చేస్తుంటే ఒక మోడల్ వచ్చింది. అప్పుడే బీచ్ లో షూటింగ్ అయ్యిందనుకుంటా, హోటల్ లోకి వచ్చి కాలు మీద కాలు వేసుకొని తల తుడుసుకుంటోంది, అసలు అక్కడ వున్న వాళ్ళు అందరూ తన వంకే చూస్తున్నారు. నాకు ఒక పెద్ద చెడ్డ అలవాటు ఏమిటంటే అటువంటి టైంలో నేను ఆ అమ్మాయిని ఒకసారి చూసేసి, మిగిలిన వాళ్ళు ఆ అమ్మాయిని ఎలా చూస్తున్నారో అబ్జేర్వ్ చేస్తా, ఎందు కంటే నేను ఒక్కడినే పెద్ద వెధవని, నేను మాత్రమే ఇలా ఆలోచిస్తుంటాను అని నాకు ఒక ఫీలింగ్, అది పోగొట్టుకోవడానికి పక్క వాళ్ళ వంక చూస్తానన్నమాట. అప్పుడు వాళ్ళ కళ్ళల్లో కూడా నాకు లాంటి ఫీలింగ్స్ కనిపిస్తే పరవాలేదు నాకులా వెదవలు చాలామంది వున్నారన్నమాట అని తృప్తి పడతా. నాకు ఒక్కరి కళ్ళల్లో కూడా మామూలు ఫీలింగ్ కనిపించలేదు, అందరి కల్లల్లోను కూడా ఆ అమ్మాయి ని రేప్ చెయ్యాలనే కోరికే. ఇవి అన్నీ ఎందుకు చెపుతున్నానంటే ఈ సొసైటీ లో నాకు లాంటి వాళ్ళు చాలామంది వున్నారు అనే విషయం ఆడపిల్లలు తెలుసుకొని, జాగ్రత్త పడతారని. గుట్టుగా ఉండేదానిని గుట్టుగానే ఉంచాలి, దానికి మనం వ్యక్తి స్వేచ్చ అని గుప్పిట తెరవకూడదు.
 

పూర్వం మన ఇళ్ళల్లో వయసు వచ్చిన అమ్మాయిలతో, ఎంత దగ్గరి చుట్టాలైనా అబ్బాయిలు మాట్లాడడం ఒప్పుకొనేవారు కాదు. కానీ ఈ రోజుల్లో తల్లులే మొగ పిల్లలతో ఫ్రెండ్ షిప్ తప్పు కాదు అని చెపుతున్నారు. తప్పని ఎవరూ అనరు, కానీ అవసరాన్ని మించి సహవాసం మంచిది కాదు. ఇది కూడా నా మనసు లోంచి వచ్చిన మాట కాదు. నాకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఇది చదివితే నన్ను ఎక్కడా విరగదీస్తారో అని. నేను 2007 లో వైజాగ్ లో జాబ్ చేసినప్పుడు రోజూ బీచ్ రోడ్ లో భీమిలి కి  18 కిలో మీటర్ లు బైక్ మీద వెళ్ళేవాడిని. ప్రతిరోజు నాకు కాలేజ్ ఎగ్గొట్టి వచ్చిన వాళ్ళు కనపడే వాళ్ళు, అందులోను అక్కడ ఎవరూ వుండే చోటు కాదు. ఆ ఏరియా లో పూర్వం అమ్మాయిలను లాక్కు పోయి పాడుచేసిన సంఘటనలు కూడా జరిగాయంట. నేను వెళ్ళే టైం ఉదయం 8.00, సాయంత్రం 7.00 , ఆ టైం కే అక్కడ జంటలు కనిపిస్తుంటే నాకు వాళ్ళ తల్లి తండ్రులు ఏమి చేస్తున్నారు అని అనుమానం వచ్చేది. తండ్రి ఏదో పని మీద తిరుగుతానే వుంటారు, వుద్యోగం చెయ్యని తల్లులు నెల కొకసారైనా కాలేజ్ కి వెళ్లి అమ్మాయి సరిగ్గా వస్తోందో, లేదో కనుక్కోవచ్చు కదా.

ఈ మద్యన వరుసగా ఒక నెల పాటు సాయంత్రం పూట మా ఫ్రెండ్స్ వస్తే మా గేటు దగ్గర బాతాఖాని వేసాం. నేనుంటున్న అపార్టమెంట్ ఎదురుగా ఒక బేకరి వుంది.బాగా హడావిడి గా వుంటుంది. ఒక రోజు ఒకమ్మాయి వచ్చి మాకు కొద్ది దూరం లో నిలబడి ఫోనులో ఎవరితోనో మాట్లాడి అక్కడే వెయిట్ చేస్తోంది. ఎంత వయసు వచ్చినా మగవాడిని కదా, ఆ అమ్మాయి ఏమి చేస్తుందా అని చూడడం మొదలు పెట్టాను. కొద్ది సేపటికి బాయ్ ఫ్రెండ్ వచ్చాడు, ఆ అబ్బాయి వచ్చేదాకా ఆ అమ్మాయి చేతిలో ఫోన్ గిర్రు గిర్రు న తిప్పుతానే వుంది. అలా ఒక గంట నిలబడ్డారు. మరుసటి రోజు ఇదే వరుస. అలా పది రోజులు గడిచాకా వాడు వాడి ఫ్రెండ్స్ ని ఇద్దరినీ తీసుకు వచ్చాడు, నలుగురు కలసి ఒక గంట మాట్లాడుకుని వెళ్ళిపోయారు. మరుసటి రోజు ఆ అమ్మాయి తన ఫ్రెండ్స్ ని ఇద్దరిని తీసుకొనివచ్చింది. రెండు రోజులు ఆ అమ్మాయి ఫ్రెండ్స్ ఒక వైపు దూరంగా, అబ్బాయి ఫ్రెండ్స్ ఇంకో వేపు దూరంగా నిలబడేవారు. మూడోరోజు అక్కడ మూడు జంటలు తయారయ్యి పోయాయి. అందుకనే నీ ఫ్రెండ్స్ ఎవరో చెపితే నువ్వు ఎటువంటివాడవో చెపుతాను అనే సామెత వచ్చింది. తరువాత ఏమైయ్యిందో నాకు తెలియదు. నేను ఇదివరకటి లా ఉండుంటే వాళ్ళను ఖచ్చితంగా మందలించేవాడిని. ఇప్పుడు ఎవరైనా అలా చేస్తే నువ్వు ఎవడవి అని అంటున్నారు, పిల్లలు కాదు వాళ్ళ పేరెంట్స్. శ్రీ రామ సేన ముతాలిక్ చేసింది నా దృష్టిలో మంచి పనే, కాకపొతే వేలంటైన్ డే రోజు తాళి కట్టించడం తప్పు. నేను ఇదివరకు ఇలాగే ఒక జంటను తిడితే, పాపం వాళ్ళేమి అనలేదు, భయపడి వెళ్ళిపోయారు, మళ్ళీ ఆ రోడ్ లో నాకు కనపడలేదు, కానీ నా  ఫ్రెండ్స్ మాత్రం నన్ను తిట్టారు, నువ్వేవడివయ్యా  అని. అప్పుడు నేను వాళ్ళతో ఒకటే చెప్పాను, మన ఆడపిల్లలు అదే పని చేస్తే మనం ఊరుకుంటామా, తప్పు చేసేటప్పుడు పెద్ద వాళ్ళగా మనం చెప్పవచ్చు అని.

 ఒకసారి ఇలాగే మా కాంట్రాక్టర్ కొడుకు సైట్ లో వున్న అమ్మాయితో యవ్వారం మొదలు పెట్టాడు, నా అసిస్టెంట్ ఈ విషయం నాతొ చెపితే నేను వాళ్ళ నాన్న తో చెప్పు అన్నాను. ఇతను చెపితే వాళ్ళ నాన్న పోనిలెండి, వెదవ దాన్నిపట్టుకునన్నా సైట్ లో ఉంటాడు అని తేలిగ్గా తీసి పడేసాడు. ఇది జరిగిన మూడు నెలలకి అతని కూతురు పేపర్ వేసే కుర్రవాడితో వెళ్ళిపోయింది. మా ఆఫీసు వాళ్ళు పలకరించడానికి వెళుతూ నన్నూ రమ్మన్నారు, నేను రానని చెపితే ఎందుకని అడిగారు, ఏమి లేదు, కొడుకు చేసింది తప్పు కానప్పుడు కూతురు చేసింది కూడా తప్పు కాదు, అతను ఎడవాల్సిన పని లేదు, మనం సానుభూతి చూపించాల్సిన పని అంత కంటే లేదు అన్నాను. నువ్వు మూర్ఖపు నా కొడుకువిరా బాబూ అని వెళ్ళిపోయారు.
ఇవి అన్నీ చదివి నన్ను మాత్రం మంచోడు అని అనుకోవద్దు.   

Wednesday, December 22, 2010

జై జై రాం రమేష్

జై రాం రమేష్ లాంటి వాళ్ళు ఎంతమంది పోరాడితే మాత్రం ఏముంది ఒక పక్క నుండి జరిగేవి జరిగిపోతానే వున్నాయి. మీకు చిన్నదిగా కనిపించే ఒక చిన్న సంఘటన చెపుతాను, మొన్న సోమవారం జరిగింది. నేను ఒక పెద్ద కన్స్ట్రక్షన్ కంపెనీ లో ఇంటర్వ్యూ కని వెళ్లాను. అక్కడ నా రెజ్యూమ్ ఇచ్చాను, మూడు పేజీలు  వుంది. అతను నా సర్టిఫికేట్ లు అడిగాడు, ముందు నేను సెలెక్ట్ అవ్వాలి కదా, జాయిన్ అయ్యేటప్పుడు ఇస్తాను అన్నా, అంటే అతను లేదండి మాకు ముందే అన్నీ ఇవ్వాలి, రేపు అవి కలిపి ఇవ్వండి అన్నాడు. సరే అని నేను పక్కన కూర్చున్నాను. నా ఫ్రెండ్ అన్నీ తెచ్చాడు, అవి చూసి అతను ఒక మూడు పేజీల బంచ్ ఇచ్చి అవి నిమ్పమన్నాడు. అందులో మేము రేజ్యుం లో ఏవి అయితే సబ్మిట్ చేస్తామో అవే వున్నాయి, ఇవి కాకుండా మన నేచర్ గురించి మనమే చెప్పుకొనే ఒక క్వోచ్చనీర్. ఆ రోజూ అక్కడకు వచ్చింది 300 మంది. ఒక్కొక్కళ్ళు అనవసరం గా నింపిన కాగితాలు సర్టిఫికేట్ లు యావరాజ్ 4, వాడు ఇచ్చిన దాంట్లో 2 అంటే మొత్తం 6 పేజీలు . వాడికి కావలసింది 50 మంది. అంటే అక్కడ అనవసరం గా వేస్ట్ అయ్యింది 250 x 6 = 1500 పేజీలు. ఈ మద్యన ప్రతిచోటా మన గురించి చెప్పుకొనే షీట్ ఖచ్చితంగా ఇస్తున్నారు, వాస్తవం రాస్తే వుద్యోగం రాదు, దానికి నేనే ఉదాహరణ, ఎందుకంటే నేను ప్రతి చోటా షార్ట్ టెంపర్ అని, కేర్ ఫ్రీ అని రాస్తున్నాను, ఎందుకంటే అదే నిజం కనుక, నాకు ఎవడూ వుద్యోగం ఇవ్వడం లేదు, నేను కూడా సరదాగానే వెళుతున్నాను. కార్పోరేట్ కల్చర్ అంటే మీరు వెళ్ళగానే ఒక మూర్చ బిళ్ళ లాంటి బాడ్జ్ ఒకటి మన మెళ్ళో వేసేస్తారు. మూర్చ బిళ్ళ అంటే ఈ కాలం వాళ్లకి తెలియదు కాని, మా చిన్న తనం లో మూర్చ రోగులు మెళ్ళో ఇత్తడి ప్లేట్ ఒకటి తగిలించుకొని అడుక్కోవడానికి వచ్చేవారు, దాని మీద వాళ్ళ రోగం గురించి వుండేది, వాడు పడిపోతే వెంటనే వాడి చేతిలో తాళాల గుత్తి పెట్టేవారు, నాకు వాళ్ళే గుర్తుకువస్తున్నారు. మొన్నా మద్యన మన రమేష్ గారు S.U.V ల గురించి మాట్లాడితే చాలా మందికి కోపం వచ్చింది. ఆయన చెప్పింది చాల కరెక్ట్. ప్రజల కనీస అవసరాలు తీర్చవలసిన భాద్యత ప్రభుత్వానిదే, కానీ లగ్జరీ లైఫ్ ఎవరికీ వాళ్ళే సంపాదించుకోవాలి. అసలు ప్రభుత్వం బేస్ లైన్ అనేది ఒకటి గీయాలి. బైక్స్ 100 cc , కార్స్ 800cc దాటితే వాటిమీద రెట్టింపు టాక్స్ వేయడం, డీజెల్ కార్స్ మీద దాని లైఫ్ పిరియడ్ 15 సంవత్సరాలలో ఎంత వరకు తిరుగుతుందో లెక్క వేసి కోనేటప్పుడే వసూలు చెయ్యాలి. ఒక పక్క పవర్ షార్టేజ్ అని AC ల మీద, వాటిమీద టాక్స్ తగ్గించడం, పవర్ ప్రొడక్షన్ కోసమని బొగ్గు మండించడం, బొగ్గు గురించి అడవి నరకడం, మనల్ని మనమే చంపేసుకుంటున్నాము. సామాన్యుడు తోక్కుకొనే సైకిల్ ఈ రోజూ రెండు వేల పైనే. గ్యాస్ మీద గ్రామీణ ప్రజలకి ఎక్కువ సబ్సిడీ ఇస్తే అడవులు నరకడం తగ్గుతుంది.

Monday, December 20, 2010

జై తెలంగాణా.....

హైదరాబాద్ మీద మనకు ఏమి హక్కు వుంది? సమైకాంద్ర అంటే సరే, ఒకవేళ విడి పోవలసి వస్తే హైదరాబాద్ మీద ఆంధ్రా, రాయలసీమ వాళ్లకి ఏమి హక్కు వుంటుంది? ఆంధ్ర రాజధాని కర్నూల్, నిజాం స్టేట్ ని కలిపాక ఇక్కడ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ వుంది కాబట్టి ఇక్కడకి మార్చారు. ఇక్కడ భూమి విలువ తక్కువ కాబట్టి ఇండస్ట్రీ డెవలప్ అయ్యింది. అంతే కానీ తెలంగాణా వాళ్ళేమి ముచ్చటపడి కలవలేదు. ఒక వేళ అలా అనుకున్నా, ఈ రోజూ ఒద్దనుకుంటున్నారు కాబట్టి తెలంగాణా వేరు చెయ్యవలసిందే. వాళ్ళేమి గొడవలు చెయ్యలేదే. మంచిగా అడిగారు, కోపం వచ్చినప్పుడు ఏదేదో అంటారు, దానిని పట్టుకొని తెలంగాణా వస్తే అరాచకమే అనడం ఆంధ్రా వాళ్ళ తప్పు. మాట్లాడితే వీళ్ళకి మనమొచ్చాకానే అన్నం తినడం తెలిసింది అని ఆంధ్రా వాళ్ళు నా దగ్గర చాలా మంది అన్నారు, నేను ఆంధ్రా వాడినే కదా అని.( నాకు ఇప్పుడు 47 సంవత్సరాలు, నా 19 ఏట నుండి ఇక్కడి నీళ్ళే తాగాను, ఇక్కడి తిండే తిన్నాను, కాబట్టి నాకు తెలంగాణా అంటే ప్రేమ, ఆంధ్రా అంటే ఇష్టం, నేను పుట్టింది అక్కడ కాబట్టి. నేను పక్కా తెలంగాణా వాడిని. ఇంకా చెప్పాలంటే కే.సి.ఆర్.కంటే కూడా నాకు తెలంగాణా మీద ఎక్కువ ప్రేమ వుంది.). కాటన్ దొర ధవళేస్వరం బేరేజ్ కట్టక ముందు మనం కూడా జొన్న అన్నమే తిన్నాము. కాకపోతే వీళ్ళకంటే 25 సంవత్సరాల ముందు మనం వరి అన్నం తినడం మొదలుపెట్టాము. మొదటినుండి వీల్లేమి ఆంధ్రా వాళ్ళు వెనక్కు వెళ్లిపోవాలి అని అడగలేదే. వాళ్ళు వాళ్ళ ప్రాంతాన్ని వాళ్ళు పరిపాలించుకుంటాం అని అడిగారు. దానికి మన రాజకీయనాయకులు వాళ్ళ స్వార్ధం గురించి, కే.సి.ఆర్. తో నాటకాలు ఆడడం మొదలుపెట్టారు. వీల్లేమి ఆంధ్రా వాళ్ళని ఇల్లు వదలి పోమ్మనలేదే. మరి దేనికి భాధ? ఎవరు పరిపాలించినా సామాన్యుడికి ఒరిగేదేమీ లేదు, అది ఆంధ్రా వాడైనా, లేక తెలంగాణా వాడైనా. మరి మనకెందుకు ఈ బాధ? మన ఇల్లు మనకే వుంటుంది, మన పొలం మనకే వుంటుంది. ఆంధ్రా వాళ్ళ భయమేమిటంటే వీళ్ళకి పరిపాలన తెలియదు, మన ఆస్తుల విలువ తగ్గిపోతుంది అని. నువ్వు వుండాలి అనుకున్నప్పుడు నీ ఇంటి విలువ లక్ష అయితేనేమి, కోటి అయితేనేమి, నువ్వు అమ్ముకోవాలి అనుకున్నప్పుడు దాని విలువ అవసరం. అంటే నువ్వు వ్యాపారం చేస్తున్నావు. వ్యాపారం చేసేటపుడు ఒకో సారి లాభం వస్తుంది, ఒకో సారి నష్టం వస్తుంది. అది వ్యాపారం. అంటే నీ వ్యాపారానికి అడ్డు కాబట్టి వాళ్ళ తెలంగాణా వాళ్లకు ఇవ్వద్దు. నిన్ను వాళ్ళేమి ఇక్కడ వ్యాపారం చేసుకోవద్దు అనడం లేదే? ఇక్కడే వుండండి, మీ పనులు మీరు చేసుకోండి అని అంటున్నారు.

అయినా తెలంగాణా ఇస్తే చిన్న రాష్ట్రం అవుతుంది కాబట్టి ఇంకా బాగా డెవలప్ అవుతుంది అని ఎందుకు అనుకోరు? అప్పుడు మీ ఆస్తి విలువ ఇంకా బాగా పెరుగుతుంది కదా. నేను ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగిన ఆంధ్రా వాళ్ళని చాలా మందిని చూస్తున్నాను, వాళ్ళ రక్తం లో ప్రతి బొట్టు ఇక్కడి నీళ్ళతో తయారయినదే, కానీ వాళ్ళు ఆంధ్రా కూతలు కూస్తున్నారు, అంటే వాళ్ళకి ఈ నేల మీద ప్రేమ లేదు, లేనప్పుడు ఇక్కడ వుండడం ఎందుకు? మనం టెర్రరిస్ట్ లని తిడుతున్నాము కదా, కొడుకులు ఇక్కడ పుట్టి ఇక్కడ నీళ్ళు తాగి పాకిస్తాన్ కూతలు కూస్తున్నారు అని, మరి వాళ్ళకి మనకి తేడా ఏమిటి?

Sunday, December 19, 2010

చంద్రబాబు నాయుడు నిరాహార దీక్ష

నిన్న సాయంత్రం ఫేస్ బుక్ లో చంద్రబాబు నాయుడు నిరాహార దీక్ష మీద చాలా జోక్స్ నడిచాయి. సరదాగా వున్నాయి. కానీ చాలా మంది పెద్ద వాళ్ళు చెప్పిన దానిని బట్టి కీ.శే. జలగం వెంగళరావు గారి తరువాత మన రాష్ట్రం లో అభివృద్ధి కనిపించింది చంద్రబాబు నాయుడు హయాం లోనే అంట. అలాగని నేనేమి తెలుగు దేశం అభిమానిని కాదండోయ్. పైగా నేను దానికి వ్యతిరేకిని కూడా. నేను పక్కా బి.జే.పి. ఆ, ఒకప్పుడు మీరూ మీరూ ఫ్రెండ్సే కదా అనకండి, ఎందుకంటే బి.జే.పి. ని టి.డి.పి. చంకలో దూర్చినందుకు నాకు ఇప్పటికీ వెంకయ్యనాయుడు మీద కోపమే.   ఎందుకంటే విజయవాడకు మాత్రమే పరిమితమైన కుల గజ్జి రాష్ట్ర వ్యాప్తం అయ్యింది దాని పరిపాలనలోనే అని నేను అనుకుంటున్నాను. కాకపొతే ఐ.టి. ప్రారంభ దశలో చంద్ర బాబు నాయుడు ఒక మాట అన్నాడు. ఇండస్ట్రియల్ రివల్యుషన్ మనం అందుకోలేకపోయాం (అప్పుడు మనం బ్రిటిష్ ఏలుబడి లో వున్నాం కదా) ఇప్పుడు దీనినైనా అందుకుందాం అని. నాకు అది కరెక్ట్ అనిపించింది. దాని ఫలాలు ఇప్పుడు మనం తింటున్నాము. ఆఫ్ కోర్స్ నిజంగా హైటెక్ సిటీలో అవి తింటున్న సాఫ్ట్ వేర్ ఇంజినీర్స్ లో సగం మంది పైగా ఆయనకి ఓటు వేసి వుండరు.అది వేరే విషయం. అతని టైం లో మైనర్ ఇరిగేషన్ బాగా డేవలప్ అయ్యింది. ఈ విషయం మీరు ఇప్పుడు ఎండిపోయిన చెరువులను చూస్తే తెలుస్తుంది. అతను చెప్పిన ఇంకుడు కుంటలు గనుక మన కార్పోరేషన్ వాళ్ళు గనుక సరిగ్గా ఇంప్లిమెంట్ చేయించి వుంటే మన రాష్ట్రం లో భూగర్బ జలాల పరిస్తితి ఇలా వుండేది కాదు. అతనిలో ఒక ప్లానింగ్ కనిపించేది. కాకపొతే అవినీతి ని సెంట్ర లైజ్ చేసిన ఘనత కూడా అతనిదే అనుకోండి. ఉద్యోగస్తులు అందుకనే కదా అతనికి ఓటు వేయనిది. ప్రతి ప్రాజెక్ట్ గురించి రాత్రికల్లా అతనికి ఇన్ఫర్మేషన్ వెళుతుందని నాకు పోలిస్ లు చెపితే తెలిసింది. ఒక సారి నేను ఏలూరు-తాడేపల్లిగూడెం మద్య ఎన్.హెచ్.5 రోడ్ వర్క్ జరుగుతుండగా, రోజూ ఆ రోడ్ లో జరుగుతున్న యాక్సిడెంట్స్ గురించి కంప్లైంట్ ఇద్దామని వెళుతుంటే దారి లోనే పోలిస్ లు కలిసారు, వాళ్ళతో నేను, రోజూ ఇన్ని యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి, ముందు ఆ కాంట్రాక్టర్ ని రోడ్ పక్క వున్న కంకర గుట్టలు తియ్యమని చెప్పండి, ఒక ప్రక్కన రోడ్ తవ్వేసాడు, ఇంకో పక్కన కంకర గుట్టలు, ఏమిటి అని ఆ ఇంజినీర్ని అడిగితే ఆ వర్క్ మేము సబ్ ఇచ్చాము, వాడు చెయ్యడం లేదు అని చెపుతున్నారు, అందుకనే కంప్లైంట్ ఇవ్వడానికి మీ దగ్గరకే వస్తున్నాను అని చెప్పాను. వాళ్ళు అప్పుడు సార్, మీరు కంప్లైంట్ ఇచ్చినా మేమేమి చెయ్యలేము, ప్రతి రోజు వర్క్ ప్రోగ్రస్ గురించి సి.ఎం. గారు వాకబు చేస్తున్నారంట, మా వలన ఏమైనా ప్రోబ్లం వుందని తెలిస్తే మాకు అయ్యిపోతుంది, మీరే ఏదైనా టిప్పర్ తీసుకువచ్చి ఎత్తుకుపొండి, మీ మీద కేసు లేకుండా మేము చూస్తాము అన్నారు. అప్పుడు నాకు నిజంగా చాలా ఆనందం వేసింది. ఎందుకంటే ఎన్.హెచ్ 5 వర్క్ మన రాష్ట్రం లో పూర్తి అయినంత తొందరగా మిగిలిన చోట అవ్వలేదు.
ఇదే మనిషి వ్యవసాయం దండగా అని, సోషల్ సబ్జెక్ట్ వేస్ట్ అని కూడా అన్నాడు. చరిత్రని మరచిపోయిన జాతి భూమి మీద నుండి చాలా తొందరగా కనుమరుగు అయ్యిపోతుంది. ఇప్పటికే మనం మన చరిత్ర మూలాలు మరచిపోతున్నాము, ఆ సబ్జెక్ట్ తీసి వేసి వుంటే అసలు మనమెవరమో, మన సంస్కృతి ఏమిటో మన తరువాత తరాల వాళ్లకి తెలియదు. పూర్తిగా చచ్చిపోయింది అనుకున్న హిబ్రూ బాషని ఇజ్రాయీలు ఎలా బ్రతికిన్చుకున్నారో చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. అంతో, ఇంతో బ్రతికున్న మన సంస్కృతాన్ని మనం కాపాడుకోవడం లేదు.

Saturday, December 18, 2010

సహజంగా ఎటువంటి రాక్షషుడు అయినా జనాల బాధకి కొంత కరుగుతాడు, కానీ మన వై.ఎస్.ఆర్. దేముడు కదా

సహజంగా ఎటువంటి రాక్షషుడు అయినా జనాల బాధకి కొంత కరుగుతాడు, కానీ మన వై.ఎస్.ఆర్. దేముడు కదా.........అతను పాదయాత్ర చేసి ముఖ్య మంత్రి అయ్యాడు కాబట్టి ఆ యాత్రలో జనాల కస్టాలు చూసివుంటాడు ప్రజలకు చాలా మేలు చేస్తాడు అనుకున్నాను. అతను దేశ కోడలు సోనియా ను పోగుడుతున్నప్పుడల్లా ఇదేంటి ఇతని వలన కాంగ్రెస్ అధికారం లోకి వచ్చింది, ఇతను వాళ్ళ కాళ్ళు పట్టుకున్తున్నాడు ఏమిటి అనుకొనేవాడిని. కానీ అతను యాత్ర లో ప్రజల కష్టాలు చూడలేదు వాళ్ళ పొలాలు చూసాడు అని తరువాత తెలిసింది. రెండు పంటలు పండే పచ్చటి పొలాలు సెజ్ ల పాలు అయ్యిపోయాయి. అందరూ వై.ఎస్.ఆర్. వుంటే తెలంగాణా గొడవ వుండేది కాదు, అనుకుంటున్నారు, అసలు అతని వలనే అది పెద్దది అయ్యింది. వేల ఎకరాలు సెజ్ ల పేరు చెప్పి దోచుకుంటుంటే ఇక్కడి వాళ్లకి కడుపు మండదా? నక్సలైట్స్ ని అనిచేసాడు అంటున్నారు, నిజమే కానీ మనిషిలో నక్సల్ భావాలు చాలా పెరిగాయి. నిజంగా అతను ఉండుంటే భూములు కోల్పోయిన రైతులు అందరూ నక్సలైట్స్ గా మారేవారు. దేముడనే వాడు వున్నాడు కాబట్టే రచ్చబండ కార్యక్రమం జరగకుండా ఆపేడు, లేక పొతే వీళ్ళ దాహానికి ఇంక ఎన్ని వేల ఎకరాలు పోయేవో, ఎంత మంది రైతులు కూలీలుగా మారేవారో. థాంక్స్ వరుణదేవా....

Friday, December 17, 2010

ఈ దేశ భవిష్యత్తు తీర్చి దిద్దిన త్రిమూర్తులు.


చాలా క్లిష్ట మైన సమయం లో ప్రధాన మంత్రి భాద్యతలు స్వీకరించిన శ్రీ.చంద్ర శేఖర్ తప్పని పరిస్థితుల్లో మన బంగారాన్ని తాకట్టు పెట్టినప్పుడు దేశం అంటా గగ్గోలు పెట్టింది.(అదే మన మాన్యులు మన్ మోషం సింగ్ గారు న్యూక్లియర్ డీల్ టైం లో మన ఆత్మ గౌరవాన్ని తాకట్టు పెట్టినప్పుడు శ్రీ. అబ్దుల్ కలాం గారు కూడా సపోర్ట్ చేసారు). ఆ రోజు ఆయన చేసింది సామాన్యుడిని నాకైతే కరెక్ట్ అనిపించింది. ఎందుకంటే తల అమ్ముకోవడం కంటే బంగారాన్ని అమ్ముకోవడం మంచిది, అని నాకు లాంటి అసమర్దుల భావన.. ఇప్పుడు చాలా మంది ఆ రోజు ఆయన చేసింది కరెక్ట్ అంటున్నారు. ఆ తరువాత హైదరాబాద్ వెళ్ళిపోయి హాయిగా పుస్తక రచనలు చేసుకుందాము అని బయలుదేరిన మన శ్రీ. పి.వి.నరసింహ రావు గారు ప్రధాన మంత్రి కావడం, (విశ్వాస ఘాతుకానికి గురి అవ్వడం మనకందరికీ తెలిసిన చరిత్రే), తరువాత శ్రీ. వాజ్ పాయి గారు ప్రధాన మంత్రి కావడం అనేవి చాలా కాకతాళీయం గా జరిగి ఉండవచ్చు. కానీ ఈ వరుస తప్పి వుంటే ఈ రోజు మన పరిస్థితి ఎలా ఉండేదో?

ఒక చిన్న వివరణా? లేక నన్ను నేను సపోర్ట్ చేసుకోవడమా?

 అరేయ్ నువ్వు నన్ను చాలా తప్పుగా అర్థం చేసుకున్నావు. నాకు మన భారతీయ సంస్కృతి, సంప్రదాయాలంటే విపరీతమైన గౌరవం, ఇష్టం. కొద్దిగా గురజాడ వారి గిరీశం లా అన్నీ మా వేదాల్లోనే ఉన్నాయష అనే బాపతు అనుకో.  నాకు చిన్నప్పటి నుండి పుస్తకాలు చదివే అలవాటు ఎక్కువ. 10th పరీక్షలు అయ్యేదాకా డిటెక్టివ్ నవలలు చదివేవాడిని. పరీక్షలు ముందే మేము  సొంత ఇల్లు కొనుక్కొని అక్కడకు మారిపోయాము. అక్కడ సెలవల్లో నాకు శివకుమార్ అని ఒక మెడికో పరిచయం అయ్యాడు. అంటే అతని క్లాస్ మేట్ పాపారావు అని నాకు ముందు నుండి పరిచయం. వీళ్ళ ఫాదర్ కమ్యూనిస్ట్. ఇతని ద్వారా నాకు శివకుమార్ పరిచయం అయ్యాడు. అతని రూం లో నేను శ్రీ శ్రీ మహా ప్రస్తానం చూసాను. అది తీసుకుని చదువుతుంటే అతను నాకు నండూరి వారు వ్రాసిన నరావతారం పుస్తకం గురించి చెప్పి దొరికితే అది చదవమన్నాడు. అదృష్టం కొద్దీ మా ఇంటి దగ్గరే ఒక లైబ్రరీ వుండేది. నేను అక్కడకి వెళ్లి మెంబర్ షిప్ తీసుకొని ఆ పుస్తకం అడిగాను. అప్పుడు ఆ లైబ్రేరియన్ నన్ను ఏమి చదువుతున్నావు అని అడిగారు. అప్పుడే పదవ తరగతి పరీక్షలు వ్రాసానని చెప్పాను. అప్పుడు ఆయన నువ్వు నేను ఇచ్చిన పుస్తకాలు చదువు అని చెప్పి, మొదటగా నాకు నండూరి వారి విశ్వరూపం ఇచ్చారు. తరువాత డార్విన్ ట్రాన్స్లేషన్, నండూరి వారి నరావతారం అలా సీరియల్ గా ఇస్తూ, కొద్ది కాలం పోయాకా ముద్దు కృష్ణ వ్రాసిన ఖయ్యాం కవితలు, గాలిబ్ గీతాలు ఇస్తూ ఆయన నన్ను 6 నెలల్లో విశ్వనాథ వారి పుస్తకాలు చదివే స్థాయికి తీసుకు వచ్చారు. ఇది అంతా ఎందుకు చెపుతున్నానంటే ఎవరి పరిచయం, ఆలోచన, ప్రవర్తన ఎవరిని ఎలా మారుస్తాయో మనం చెప్పలేము, అందుకనే నువ్వు పెట్టిన ఫోటో కి నిన్ను చూసి కొంతమందైనా మారితే బాగుంటుందని వ్రాసాను, అలాగే మన గురించి గొర్రెలుగా వ్రాస్తే నీకు చాలా కోపం వచ్చింది. నాకు మన రాజకీయ వ్యవస్థ అంటే విపరీతమైన కోపం. ఎందుకంటే బ్రిటిషర్స్ రాక ముందు ప్రపంచంలో మన వాణిజ్యం 5% పైనే వుండేది. అది కూడా అప్పట్లో మన దగ్గర నుండి ఎక్కువ గా సువాసన ద్రవ్యాలు, నూలు వస్త్రాలు, వజ్రాలు మాత్రమే ఉండేవి. వాటి మీదే మనం అంత వాణిజ్యం చేసేవాళ్ళము. అటువంటిది బానిసలుగా మారేకా మనం ఎలా నాశనం అయ్యామో తలుసుకుంటే కడుపు రగిలి పోతోంది. పోనీ మనం స్వేచ్చ పొందాకా అన్నా మన బానిస మనస్తత్వం పోయిందా అంటే అది ఇంకా ఎక్కువ పెరిగేటట్టు మన రాజకీయ నాయకులు చేస్తున్నారు. మనువు చెపుతాడు, రాజు అనేవాడు గొప్ప వ్యక్తిత్వం కలిగి, బంధు ప్రీతి లేకుండా, న్యాయం చెప్పేటప్పుడు జాలి చూపకుండా, ఒకరికి తల వంచకుండా, ధైర్య సాహసాలు కలిగి వుండాలి అని. అటువంటివి నీకు ఎవరిలోనైనా కొద్దిగా అన్నా కనిపిస్తున్నాయా? వాడు బానిస లా ఉంటూ మనల్ని కూడా బానిసలు గా మారుస్తున్నారు. మొన్న మన కొత్త ముఖ్య మంత్రి గారి స్టేట్మెంట్ చూడు, 2014 లో రాహుల్ గాంధీ ని ప్రధాన మంత్రిని చేద్దాము అంటాడు. అంతే కానీ 2014 కల్లా మన రాష్ట్రాన్ని గుజరాత్ స్థాయికి తీసుకు వెళతాను అని అనడు. ఇంక ఒక రాజకీయ నాయకుడు చస్తే మొగుడు పోయాడు అని పెళ్ళాం ఏడవదు, బాబు పోయాడని పిల్లలు ఏడవరు, ఆ ప్లేస్ లోకి మనం వెళ్లిపోవాలి అని ఏడుస్తున్నారు.

Thursday, December 16, 2010

అసలు మన దేశానికి ఎక్కువ చెడు ఎవరి వలన జరుగుతోంది?

అసలు మన దేశానికి ఎక్కువ చెడు ఎవరి వలన జరుగుతోంది? పొలిటీషియన్ వలనా, లేక దేశం లోనే తెలివైనవాళ్ళం అనుకొనే IAS, IPS ల వలనా? లేకపోతే వాళ్ళ సొంత ఆలోచనలని మన మీద రుద్దే మేధావులవలనా? జాబ్ సెక్యురిటీ లేని ఒక చిన్న ఆఫీసర్ ఒక రాజకీయ నాయకుడి మాట గానీ, లేదా తన పై ఆఫీసర్ మాట గాని విని చెయ్యకూడని పని చేస్తే వాడిని మనం అందరం తిట్టుకుంటాము. కానీ మరి మన IAS,IPS లకి ఆ పరిస్థితి లేదు కదా, మరి వీళ్ళు ఎందుకని మామూలు చిన్న పంచాయతి ప్రెసిడెంట్ కి కూడా ఒంగి ఒంగి దణ్ణాలు ఎందుకు పెడుతున్నారు? నేను సివిల్ సూపర్వైజర్ గా పని చేసి మానేసాను. మా దగ్గర పనిచేసే రోజు కూలీనే ఏదైనా మాట అంతే పడేవాడు కాదు, మరి వీళ్ళు ఇంత పై పొజిషన్ లో వుంది ఎందుకు అంతలా వొంగిపోతారో నాకు అర్ధంకావడం లేదు. మాట్లాడితే మేము గట్టిగా వుంటే మమ్మల్ని ఏ రాజస్తాన్ ఎడారి లోకో విసేరేస్తారు అంటారు. అక్కడైనా వీళ్ళ ఉద్యోగాలు వీళ్ళకే వుంటాయి కదా. మనం ఏయ్ నేను మొగవాడిని (క్షమించండి నాకు మొగవాడిని అనే అహంకారం చాలా ఎక్కువ, నాలాగే మీరు కూడా అనుకునే ఆ పద ప్రయోగం చేసాను), ఆఫ్ట్రాల్ ఆడది నాకు చెప్పడమా? అంటూ ఉంటాము కదా, మరి ఈ IAS, IPS ఆఫీసర్స్ లోనే ఒకే ఒక మగాడు శ్రీమతి. పూనం మాలకొండయ్య (ఇది నేను స్వర్గీయ N.T.రామా రావు గారి నుండి కాపీ కొట్టాను, ఆయన ఒక సారి రేణుకా చౌదరి గురించి నా పార్టీ లో వున్న ఒకే ఒక మగాడు రేణుక అన్నాడు), ఆవిడని చూసి కూడా వీళ్ళకి సిగ్గు రావడం లేదా? ఆవిడ ఏ డిపార్ట్మెంట్ లోకి వెళితే ఆ డిపార్ట్మెంట్ సరి అయ్యిపోవలసిందే. మరి ఆవిడని ఎక్కడా పూర్తికాలం వుంచడం లేదు. ఆవిడేమి కాంప్రమైజ్ కావడం లేదే. ఆవిడ ఎందులోకి వెళ్ళినా సరే సరిగ్గా పది రోజుల్లో రాజకీయ నాయకుల నుండి ఉద్యోగస్తుల దాకా గోలే కదా. రాష్ట్రం మొత్తం మీద ఆవిడ పేరు వినిపించినట్టు ఇంక ఎవరి పేరైనా వినుపిస్తోందా?
చదువున్న వీళ్ళే వేరే ప్రదేశం అంటే భయపడతారు కదా, మరి వీళ్ళే ఏమీ తెలియని గిరిజనులని ప్రాజెక్ట్ కడతన్నాము, మీరు వూర్లు ఖాలీచెయ్యండి అని వాళ్ళని తట్టా, బుట్టా కూడా తీసుకోనియ్యకుండా దౌర్జన్యంగా ఎలా ఖాళీ చేయించుతున్నారు? అడవి భూమి పుత్రులు వాళ్ళు, దాని మీద మనకి ఏమి హక్కు వుంది?
ఇక రెండో రకం, మన నందితా దాస్, షభానా అజ్మి , దీపా మేహేతా లాంటి వాళ్ళు. వీళ్ళు సినిమాలు తీసి జనాల మీదకి ఒదిలి మేము సమాజం లో జరుగుతున్నదే తీస్తున్నాము అంటారు. అంటే అవి మనకు తెలియనవా? లేస్బియనిజం, హోమో సెక్సువాలిటీ ఎప్పటి నుండో వున్నాయి అనేది మన దేవాలయాల మీద బొమ్మలు చూసినవాళ్ళకి తెలిసిన విషయమే. దాన్ని సినిమా గా తీసి వాళ్ళు అది తప్పు అని కంట్రోల్ చేసుకుంటున్న వాళ్ళని అది తప్పుకాదు అని ప్రోత్సహిస్తున్నారు. సరే సమాజం లో జరుగుతున్నదే వాళ్ళు తీస్తున్నారు. వాళ్ళు చాలా సంస్కారవంతులు. మరి వాళ్ళ పిల్లలకి వాళ్ళు ఎలా పుట్టారో తెలుసు కదా, మరి వాళ్ళ ఎదురుగుండానే వీళ్ళు బెడ్ రూం తలుపులు తీసి పడుకోవచ్చు కదా? అబ్బే అక్కడ వాళ్లకి ప్రైవసీ కావాలంటారు. పూరి లో జరుగుతున్న ఘోరాలు మీద ఒక సినిమా. సినిమా తీసే బదులు ఆ డబ్బులు ఖర్చు పెట్టి అక్కడి ఆడవాళ్ళకి సరైన రక్షణ కల్పించవచ్చు కదా. అంటే వీళ్ళు మేధావులమని చెప్పుకుంటూ సొమ్ములు చేసుకుంటారు, మనం ఆహా వీళ్ళు ఎంత కష్టపడి ఇటువంటి సినిమాలు తీస్తున్నారో కదా అని చప్పట్లు కొట్టడం. తప్పు వాళ్ళదో, మనదో అర్థం కావడం లేదు.

Tuesday, December 7, 2010

http://storiesofsexworkers.blogspot.com/
మధురవాణి చెబుతున్న అనుభవాలు ఈ సమాజం లో చాలా ఎక్కువ జరుగుతున్నాయి. అయితే చిన్న వయసులోనే మనుషులని ఈ వృత్తి లోకి దింపుతారా అనే అనుమానాన్ని ఒకాయన వెలిబుచ్చారు. నేను చూసిన ఒక సంఘటన చెపుతాను. 2008 లో నేను వైజాగ్ లో వున్నప్పుడు నా ఫ్రెండ్ ఫోన్ చేసాడు. వాడు అప్పుడు ఊరిలో లేడంట. వాడికి ఎప్పుడు వేశ్య లని సప్ప్లై చేసే మనిషి వాడికి ఫోన్ చేసి కన్నెరికం చెయ్యవలసిన అమ్మాయి వుంది, మీకు అప్పగిస్తాను అని అందంట. వాడు నాకు ముందు ఈ విషయం చెప్పకుండా ఒరేయ్ మంచి అమ్మాయి వుంది పంపనా అన్నాడు, నాకు అటువంటివి ఇష్టం వుండదు.( అలాగని నేనేమి శ్రీ రామ చంద్రుడుని కాదు, కాకపొతే నాకు వేశ్య లంటే జాలి, ఏ మనిషి కూడా కావాలని ఆ వృత్తి లోకి రావాలని కోరుకోదు అందుకని), కానీ ఆ విషయం చెపితే వాడు నన్ను ఎంత వెటకారం చేస్తాడో నాకు తెలుసు, అంతకుముందు నేను ఏలూరు లో వున్నప్పుడు ఒకసారి భోగం మేళం పెట్టి మా ఫ్రెండ్స్ నన్ను రమ్మన్నారు, నాకు ఇష్టం లేకపోయినా వాళ్ళ బలవంతం మీద నేను వెళ్లి 10 నిముషాలు వుండి వచ్చేసాను (మీరు నమ్మరు కానీ నాకు వాళ్ళని చూస్తే నాకు విపరీతమైన బెంగ గా వుంటుంది), ఆ మరుసటి రోజు మావాళ్ళు నా మీద వేసిన జోక్స్ కి నేను చెప్పిన సమాధానం ఒకటే. మగతనం అంటే అవసరాన్ని సొమ్ము చేసుకోవడం కాదు, ఎవరైనా నిన్ను ఇష్ట పడేటట్టు చేసుకోవడం, దాన్ని మగతనం అంటారు అని తప్పించుకున్నాను. ఆ అనుభవం మీద, ఇంతకి ఫిగర్ వయసు ఎంతరా అని అడిగితె వాడు అప్పుడు చెప్పాడు, చిన్న పిల్లని. వాడితో ఒకటే అన్నాను, ఒరేయ్ ఆ పిల్ల వయసున్న కూతురు నాకు వుందిరా, అసలు నీకు బుద్ధి ఉందా అని తిట్టాను. వాడు వెంటనే ఫోన్ పెట్టేసాడు. ఆ తరువాత చాలా రోజులు ఫోన్ చెయ్యలేదు. చాలా రోజుల తరువాత వాడు నాకు ఫోన్ చేసి నేను బీచ్ లో వున్నాను, వస్తావా అని అడిగాడు. సరే మనకి పనేమీ లేదు కదా అని వెళ్లి, వాడి కారు పక్కనే నా బైక్ పార్క్ చేసి వాడి కారు ఎక్కడానికి వెనుక డోర్ తీశాను, వెనకాల ఒక చిన్న అమ్మాయి (15 సంవత్సరాలు ఉంటాయేమో), ఒక ముసలావిడ కుర్చుని వున్నారు. వాడి గురించి నాకు తెలిసిందే గనుక నేను వాళ్ళని పట్టించుకోకుండా వెనకాల కూర్చున్నాను. నాకు ఆ అమ్మాయి మీద అనుమానం రాలేదు. వాళ్ళ మామ ఆ పిల్లని వైజాగ్ చూపించడానికి తీసుకువచ్చి వుంటుంది అనుకున్నాను.నేను ఆ పాపని ఏమి చదువుతున్నావు అని అడిగితే ఆ అమ్మాయి 10 వ తరగతి అయ్యిపోయింది అని చెప్పింది, మార్కులు కూడా 400 దాటినట్టు చెప్పిన గుర్తు. ఈ లోపు ముందు కూర్చున్న మా వాడి ఫ్రెండ్ ఏమిటండి మీరు అందరిని ఏమి చదువుతున్నారు అని అడుగుతారు అన్నాడు. ఊరికినే అడుగుతాను అంతే అన్నాను.(ఎందుకంటే అంతకు ముందు ఇటువంటిదే ఇంకో విషయం జరిగింది). ఈ లోపు ఆ ముసలిది రాజుగారితో మాట్లాడవే అని ఆ పిల్ల చెయ్యి తీసి నా కాలు మీద పెట్టింది. నాకు మతి పోయి నీ యమ్మ పిచ్చ, పిచ్చ గా వుందా అని తిట్టాను. అప్పుడు మా వాడు ఒరేయ్ నేను నీకు ఆ రోజు ఫోన్ చేసింది ఈ పిల్ల గురించే అన్నాడు. నాకు నోట్లో మాట రాలేదు. ఈ లోపు ముందున్న వాడి ఫ్రెండ్ మందు గ్లాస్ ఆ అమ్మాయి కి ఇచ్చి తాగమన్నాడు. ఇంక నేను కారు లో కూర్చోలేక, ఒరేయ్ నాకు పని వుంది, కారు ఆపు నేను దిగిపోతాను అని చెబితే వాడు నువ్వు ఇంక బాగుపడవు, నువ్వేదో ఫ్యామిలీ కి దూరం అయ్యావని రమ్మంటే ఇలా చేస్తావేమిటి అని తిట్టి నన్ను నా బైక్ దగ్గర దింపేసాడు. ఆ రోజు రాత్రి నాకు నిద్ర పట్టలేదు. వాడు నన్ను తిట్టడం అది రెండో సారి. మొదటి అనుభవం ఇంకోలాగ

Monday, December 6, 2010

You’ll regret that you didn’t follow your conscience, Article from Tehelka

నా ప్రోబ్లం గురించి నేను చాలా సార్లు బచేలి (చత్తీస్ గడ్) వెళ్ళినప్పుడు చూసాను. దారిలో అర్థరాత్రుల్లు చిన్న పిల్లలు, అందరు 18 సంవత్సరాల లోపు వాళ్ళే తుపాకులు పట్టుకొని పహారా కాస్తుండే వాళ్ళు. ఒక వేళ నిజం గానే ప్రభుత్వం నక్షలిజమ్ ని అణచివేస్తే అప్పుడు వీళ్ళు అందరు ఏమి చేస్తారు? ఒక సారి తుపాకి బలం చూసిన వాడు దాన్ని చస్తే వదిలి పెట్టడు అప్పుడు మరల వీళ్ళని అణచడానికి బల ప్రయోగం. మనం ఎటు వెళుతున్నాము? అసలు నక్షలిజమ్ ఎందుకు పుడుతుంది? మన ప్రభుత్వాలు మన గురించి ఉన్నాయా ? లేక విదేశీ కంపెనీ ల గురించి వున్నాయో అర్థం కావడం లేదు. ఈ మద్యన అందరూ వంద  మంది బ్రతకడం గురించి ఒక్కడు చచ్చిపోతే పరవాలేదు అనే సినిమా డైలాగ్ వాడుతున్నారు. ఆ ఒక్కడు వీడు మాత్రం కాకూడదు. మన పొలాలికి నీళ్ళు కావాలంటే అడవిలో వుండే వాడు వాడి భూమిని వదిలేయాలి, కానీ వీడు మాత్రం వీడి పొలం లో వాడికి కొద్దిగా కూడా ఇవ్వడు. చదువుకున్న వాళ్ళే ట్రాన్స్ఫర్ అయితే కొత్త ఊర్కి వెళ్ళడానికి ఆలోచిస్తున్నారు, అటువంటిది ఏమి తెలియని ఆదివాసీలను వాళ్ళ జన్మ భూమి నుండి వేల్లిపోమ్మంటే వాళ్ళు ఎక్కడకు వెళతారు.