ఆర్.కె. లక్ష్మణ్ గారికి క్షమాపణలతో.............

Thursday, December 16, 2010

అసలు మన దేశానికి ఎక్కువ చెడు ఎవరి వలన జరుగుతోంది?

అసలు మన దేశానికి ఎక్కువ చెడు ఎవరి వలన జరుగుతోంది? పొలిటీషియన్ వలనా, లేక దేశం లోనే తెలివైనవాళ్ళం అనుకొనే IAS, IPS ల వలనా? లేకపోతే వాళ్ళ సొంత ఆలోచనలని మన మీద రుద్దే మేధావులవలనా? జాబ్ సెక్యురిటీ లేని ఒక చిన్న ఆఫీసర్ ఒక రాజకీయ నాయకుడి మాట గానీ, లేదా తన పై ఆఫీసర్ మాట గాని విని చెయ్యకూడని పని చేస్తే వాడిని మనం అందరం తిట్టుకుంటాము. కానీ మరి మన IAS,IPS లకి ఆ పరిస్థితి లేదు కదా, మరి వీళ్ళు ఎందుకని మామూలు చిన్న పంచాయతి ప్రెసిడెంట్ కి కూడా ఒంగి ఒంగి దణ్ణాలు ఎందుకు పెడుతున్నారు? నేను సివిల్ సూపర్వైజర్ గా పని చేసి మానేసాను. మా దగ్గర పనిచేసే రోజు కూలీనే ఏదైనా మాట అంతే పడేవాడు కాదు, మరి వీళ్ళు ఇంత పై పొజిషన్ లో వుంది ఎందుకు అంతలా వొంగిపోతారో నాకు అర్ధంకావడం లేదు. మాట్లాడితే మేము గట్టిగా వుంటే మమ్మల్ని ఏ రాజస్తాన్ ఎడారి లోకో విసేరేస్తారు అంటారు. అక్కడైనా వీళ్ళ ఉద్యోగాలు వీళ్ళకే వుంటాయి కదా. మనం ఏయ్ నేను మొగవాడిని (క్షమించండి నాకు మొగవాడిని అనే అహంకారం చాలా ఎక్కువ, నాలాగే మీరు కూడా అనుకునే ఆ పద ప్రయోగం చేసాను), ఆఫ్ట్రాల్ ఆడది నాకు చెప్పడమా? అంటూ ఉంటాము కదా, మరి ఈ IAS, IPS ఆఫీసర్స్ లోనే ఒకే ఒక మగాడు శ్రీమతి. పూనం మాలకొండయ్య (ఇది నేను స్వర్గీయ N.T.రామా రావు గారి నుండి కాపీ కొట్టాను, ఆయన ఒక సారి రేణుకా చౌదరి గురించి నా పార్టీ లో వున్న ఒకే ఒక మగాడు రేణుక అన్నాడు), ఆవిడని చూసి కూడా వీళ్ళకి సిగ్గు రావడం లేదా? ఆవిడ ఏ డిపార్ట్మెంట్ లోకి వెళితే ఆ డిపార్ట్మెంట్ సరి అయ్యిపోవలసిందే. మరి ఆవిడని ఎక్కడా పూర్తికాలం వుంచడం లేదు. ఆవిడేమి కాంప్రమైజ్ కావడం లేదే. ఆవిడ ఎందులోకి వెళ్ళినా సరే సరిగ్గా పది రోజుల్లో రాజకీయ నాయకుల నుండి ఉద్యోగస్తుల దాకా గోలే కదా. రాష్ట్రం మొత్తం మీద ఆవిడ పేరు వినిపించినట్టు ఇంక ఎవరి పేరైనా వినుపిస్తోందా?
చదువున్న వీళ్ళే వేరే ప్రదేశం అంటే భయపడతారు కదా, మరి వీళ్ళే ఏమీ తెలియని గిరిజనులని ప్రాజెక్ట్ కడతన్నాము, మీరు వూర్లు ఖాలీచెయ్యండి అని వాళ్ళని తట్టా, బుట్టా కూడా తీసుకోనియ్యకుండా దౌర్జన్యంగా ఎలా ఖాళీ చేయించుతున్నారు? అడవి భూమి పుత్రులు వాళ్ళు, దాని మీద మనకి ఏమి హక్కు వుంది?
ఇక రెండో రకం, మన నందితా దాస్, షభానా అజ్మి , దీపా మేహేతా లాంటి వాళ్ళు. వీళ్ళు సినిమాలు తీసి జనాల మీదకి ఒదిలి మేము సమాజం లో జరుగుతున్నదే తీస్తున్నాము అంటారు. అంటే అవి మనకు తెలియనవా? లేస్బియనిజం, హోమో సెక్సువాలిటీ ఎప్పటి నుండో వున్నాయి అనేది మన దేవాలయాల మీద బొమ్మలు చూసినవాళ్ళకి తెలిసిన విషయమే. దాన్ని సినిమా గా తీసి వాళ్ళు అది తప్పు అని కంట్రోల్ చేసుకుంటున్న వాళ్ళని అది తప్పుకాదు అని ప్రోత్సహిస్తున్నారు. సరే సమాజం లో జరుగుతున్నదే వాళ్ళు తీస్తున్నారు. వాళ్ళు చాలా సంస్కారవంతులు. మరి వాళ్ళ పిల్లలకి వాళ్ళు ఎలా పుట్టారో తెలుసు కదా, మరి వాళ్ళ ఎదురుగుండానే వీళ్ళు బెడ్ రూం తలుపులు తీసి పడుకోవచ్చు కదా? అబ్బే అక్కడ వాళ్లకి ప్రైవసీ కావాలంటారు. పూరి లో జరుగుతున్న ఘోరాలు మీద ఒక సినిమా. సినిమా తీసే బదులు ఆ డబ్బులు ఖర్చు పెట్టి అక్కడి ఆడవాళ్ళకి సరైన రక్షణ కల్పించవచ్చు కదా. అంటే వీళ్ళు మేధావులమని చెప్పుకుంటూ సొమ్ములు చేసుకుంటారు, మనం ఆహా వీళ్ళు ఎంత కష్టపడి ఇటువంటి సినిమాలు తీస్తున్నారో కదా అని చప్పట్లు కొట్టడం. తప్పు వాళ్ళదో, మనదో అర్థం కావడం లేదు.

No comments:

Post a Comment