ఆర్.కె. లక్ష్మణ్ గారికి క్షమాపణలతో.............

Sunday, December 19, 2010

చంద్రబాబు నాయుడు నిరాహార దీక్ష

నిన్న సాయంత్రం ఫేస్ బుక్ లో చంద్రబాబు నాయుడు నిరాహార దీక్ష మీద చాలా జోక్స్ నడిచాయి. సరదాగా వున్నాయి. కానీ చాలా మంది పెద్ద వాళ్ళు చెప్పిన దానిని బట్టి కీ.శే. జలగం వెంగళరావు గారి తరువాత మన రాష్ట్రం లో అభివృద్ధి కనిపించింది చంద్రబాబు నాయుడు హయాం లోనే అంట. అలాగని నేనేమి తెలుగు దేశం అభిమానిని కాదండోయ్. పైగా నేను దానికి వ్యతిరేకిని కూడా. నేను పక్కా బి.జే.పి. ఆ, ఒకప్పుడు మీరూ మీరూ ఫ్రెండ్సే కదా అనకండి, ఎందుకంటే బి.జే.పి. ని టి.డి.పి. చంకలో దూర్చినందుకు నాకు ఇప్పటికీ వెంకయ్యనాయుడు మీద కోపమే.   ఎందుకంటే విజయవాడకు మాత్రమే పరిమితమైన కుల గజ్జి రాష్ట్ర వ్యాప్తం అయ్యింది దాని పరిపాలనలోనే అని నేను అనుకుంటున్నాను. కాకపొతే ఐ.టి. ప్రారంభ దశలో చంద్ర బాబు నాయుడు ఒక మాట అన్నాడు. ఇండస్ట్రియల్ రివల్యుషన్ మనం అందుకోలేకపోయాం (అప్పుడు మనం బ్రిటిష్ ఏలుబడి లో వున్నాం కదా) ఇప్పుడు దీనినైనా అందుకుందాం అని. నాకు అది కరెక్ట్ అనిపించింది. దాని ఫలాలు ఇప్పుడు మనం తింటున్నాము. ఆఫ్ కోర్స్ నిజంగా హైటెక్ సిటీలో అవి తింటున్న సాఫ్ట్ వేర్ ఇంజినీర్స్ లో సగం మంది పైగా ఆయనకి ఓటు వేసి వుండరు.అది వేరే విషయం. అతని టైం లో మైనర్ ఇరిగేషన్ బాగా డేవలప్ అయ్యింది. ఈ విషయం మీరు ఇప్పుడు ఎండిపోయిన చెరువులను చూస్తే తెలుస్తుంది. అతను చెప్పిన ఇంకుడు కుంటలు గనుక మన కార్పోరేషన్ వాళ్ళు గనుక సరిగ్గా ఇంప్లిమెంట్ చేయించి వుంటే మన రాష్ట్రం లో భూగర్బ జలాల పరిస్తితి ఇలా వుండేది కాదు. అతనిలో ఒక ప్లానింగ్ కనిపించేది. కాకపొతే అవినీతి ని సెంట్ర లైజ్ చేసిన ఘనత కూడా అతనిదే అనుకోండి. ఉద్యోగస్తులు అందుకనే కదా అతనికి ఓటు వేయనిది. ప్రతి ప్రాజెక్ట్ గురించి రాత్రికల్లా అతనికి ఇన్ఫర్మేషన్ వెళుతుందని నాకు పోలిస్ లు చెపితే తెలిసింది. ఒక సారి నేను ఏలూరు-తాడేపల్లిగూడెం మద్య ఎన్.హెచ్.5 రోడ్ వర్క్ జరుగుతుండగా, రోజూ ఆ రోడ్ లో జరుగుతున్న యాక్సిడెంట్స్ గురించి కంప్లైంట్ ఇద్దామని వెళుతుంటే దారి లోనే పోలిస్ లు కలిసారు, వాళ్ళతో నేను, రోజూ ఇన్ని యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి, ముందు ఆ కాంట్రాక్టర్ ని రోడ్ పక్క వున్న కంకర గుట్టలు తియ్యమని చెప్పండి, ఒక ప్రక్కన రోడ్ తవ్వేసాడు, ఇంకో పక్కన కంకర గుట్టలు, ఏమిటి అని ఆ ఇంజినీర్ని అడిగితే ఆ వర్క్ మేము సబ్ ఇచ్చాము, వాడు చెయ్యడం లేదు అని చెపుతున్నారు, అందుకనే కంప్లైంట్ ఇవ్వడానికి మీ దగ్గరకే వస్తున్నాను అని చెప్పాను. వాళ్ళు అప్పుడు సార్, మీరు కంప్లైంట్ ఇచ్చినా మేమేమి చెయ్యలేము, ప్రతి రోజు వర్క్ ప్రోగ్రస్ గురించి సి.ఎం. గారు వాకబు చేస్తున్నారంట, మా వలన ఏమైనా ప్రోబ్లం వుందని తెలిస్తే మాకు అయ్యిపోతుంది, మీరే ఏదైనా టిప్పర్ తీసుకువచ్చి ఎత్తుకుపొండి, మీ మీద కేసు లేకుండా మేము చూస్తాము అన్నారు. అప్పుడు నాకు నిజంగా చాలా ఆనందం వేసింది. ఎందుకంటే ఎన్.హెచ్ 5 వర్క్ మన రాష్ట్రం లో పూర్తి అయినంత తొందరగా మిగిలిన చోట అవ్వలేదు.
ఇదే మనిషి వ్యవసాయం దండగా అని, సోషల్ సబ్జెక్ట్ వేస్ట్ అని కూడా అన్నాడు. చరిత్రని మరచిపోయిన జాతి భూమి మీద నుండి చాలా తొందరగా కనుమరుగు అయ్యిపోతుంది. ఇప్పటికే మనం మన చరిత్ర మూలాలు మరచిపోతున్నాము, ఆ సబ్జెక్ట్ తీసి వేసి వుంటే అసలు మనమెవరమో, మన సంస్కృతి ఏమిటో మన తరువాత తరాల వాళ్లకి తెలియదు. పూర్తిగా చచ్చిపోయింది అనుకున్న హిబ్రూ బాషని ఇజ్రాయీలు ఎలా బ్రతికిన్చుకున్నారో చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. అంతో, ఇంతో బ్రతికున్న మన సంస్కృతాన్ని మనం కాపాడుకోవడం లేదు.

No comments:

Post a Comment