ఆర్.కె. లక్ష్మణ్ గారికి క్షమాపణలతో.............

Tuesday, December 28, 2010

విద్యార్ధి నాయకులారా ఆలోచించండి, మీరు తెచ్చిన తెలంగాణా మీరే పరిపాలించండి.

డిసెంబర్ 31, రాష్ట్రమే కాదు దేశం అంతా ఆ రోజు గురించే చూస్తోంది. శ్రీ కృష్ణ కమిటీ ఏమి చెప్పుతుందో ఎవరికీ తెలియదు. కానీ విద్యార్దుల్లో ఉద్వేగాలు మాత్రం రెచ్చగొడుతున్నారు. ఇక్కడ వాళ్ళని చూసి ఆంద్ర, రాయలసీమల్లో కుర్రాలు తయారయ్యిపోతున్నారు. విద్యార్ధుల్లో ఉద్వేగాలు బాగా పెరిగిపోతున్నాయి. వీళ్ళ ఉద్వేగాలు వీళ్ళకి నష్టం కలుగచేస్తుంటే, రాజకీయనాయకులకి మాత్రం మంచి లాభాలు తెచ్చిపెడుతున్నాయి. అసలు ఈ విద్యార్థులు ఇంత మూర్ఖంగా ఎందుకు ప్రవర్తిస్తున్నారో అర్థం కావడం లేదు. వీళ్ళకి ఆలోచనా శక్తి లేదా? వుంటే వీళ్ళు ఈ రాజకీయనాయకుల డ్రామాలు చూస్తూ కూడా ఇంకా వాళ్ళని ఎందుకు నమ్ముతున్నారు? రేపు తెలంగాణా వచ్చాకా ఏమౌతుంది? ఏమీ కాదు, ఒక వెధవ పోయి ఇంకో వెదవ వస్తాడు. మనకు మిగిలే తృప్తి ఏమిటంటే మన వెధవ మనల్ని పరిపాలిస్తున్నాడు అనేది మాత్రమే. కే.సి.ఆర్. నిరాహారదీక్ష విరమించినప్పుడు కుర్రవాల్లల్లో ఉద్వేగం చూసాకా, ఆహా, ఇంత కాలానికి మన కుర్రవాళ్ళు కళ్ళు తెరుసుకున్నారు, ఇంక ఉద్యమాన్ని వీళ్ళే నడుపుతారు, తెలంగాణకి కొద్ది కాలమైనా మంచి పాలకులు దొరుకుతారు అని ఆనందించాను. అంతే మళ్ళీ వారం రోజుల్లో అంతా మామూలే. అసలు ఒకసారి నిర్ణయం తీసుకొని జే.ఏ.సి. ఏర్పాటు చేసుకున్నాకా, మళ్ళీ అందులోకి రాజకీయనాయకులని ఎందుకు రానిచ్చేరో అర్థం కావడం లేదు. అసలు జే.ఏ.సి. ఏర్పాటు చేసినప్పుడే, అందులో ఎవరి రాజకీయ అభిప్రాయాలు వాళ్లకి ఉండవచ్చు, కానీ వాటిని ఇందులోకి మాత్రం తీసుకురాకూడదు అనే నిర్ణయం తీసుకోనివుంటే, అస్సాం లో AASU లాగ ఇక్కడ కూడా ATSU పుట్టి ఉండును. అందరూ చదువుకున్న కుర్రవాల్లె కదా, వీళ్ళకి రాజకీయ నాయకుల అవసరం ఏమిటి? ఏం వీళ్ళకి పరిపాలించే దమ్ము లేదనుకున్నారా? ఈ రాజకేయనాయకులందరి కంటే కూడా వీళ్ళే మంచి పరిపాలన కొద్దికాలం ఐనా ఇవ్వగలిగేవారు. కొద్దికాలం అని ఎందుకు అంటున్నానంటే, ఎటువంటి వాడైనా అధికారం వచ్చాకా దానిని నిలబెట్టుకోవడానికి గడ్డి తినవలసిందే. కాకపొతే చిన్న వయసులో సిద్దాంతాలు అంత తొందరగా మార్చుకోలేరు గనుక, మరలా ఎలెక్షన్స్ దాకా అయినా బాగా పరిపాలించేవారు. ఇంతమంది కుర్రవాళ్ళు ఆత్మ హత్యలు చేసుకున్నారు కదా, వాళ్ళని నిజంగా మనం ఎన్నిసార్లు గుర్తుకుచేసుకున్నాము? ఏదైనా సందర్భం వచ్చినప్పుడు మాత్రమే వాళ్ళు గుర్తుకువస్తారు, అది కూడా అంతకు ముందు వాళ్ళతో పరిచయం వున్నవాళ్ళకే. కానీ వాళ్ళ తల్లి తండ్రుల పరిస్తితి ఏమిటి? ఇది అంతా ఎందుకు చెపుతున్నానంటే జైఆంధ్రా ఉద్యమం లో నా మేనత్త కొడుకు చచ్చిపోయాడు. డిప్లొమా పరీక్షలు రాసి ఈ ఉద్యమం లో పాల్గున్నాకా, ఉండి రైల్వే స్టేషన్ తగులపెడుతున్నప్పుడు ప్రమాదవశాత్తు ఆ మంటలు అంటుకొని చనిపోయాడు. మరలా ఇప్పుడు ఈ ఉద్యమం. ఈ రాష్ట్రం విడిపోవాలని ఇప్పటిదాకా అటువైపు, ఇటువైపు ఎంతోమంది చనిపోయారు, చనిపోతున్నారు. ఇప్పటికీ ఈ విద్యార్థులకి బుద్ధి రావడం లేదు. ఇంకా ఎంతకాలం ఇలా ఈ రాజకీయనాయకుల రాక్షస క్రీడకి బలయ్యిపోతారు? ప్రజాస్వామ్యం ఆంటే మనల్ని మనం పరిపాలించుకోవడం. ఇదివరకిటి రాజుల స్థానం లోకి ఇప్పుడు రాజకీయనాయకులు వచ్చారు. కాబట్టి మనల్ని మనమే పరిపాలించుకుందాము. తెలంగాణా వచ్చేది విద్యార్థుల ద్వారా మాత్రమే. మనం తెలంగాణా తెచ్చి దానిని ఎవరి చేతిలోనో పెట్టడం ఎందుకు? ఎలాగా ఇంకొద్ది కాలమైనా పోరాటం తప్పదు. ఒక్కసారి విద్యార్థులు అందరూ కలసి కూర్చుని ఆలోచించండి. రాజకీయనాయకుల అవసరం మీకు లేదు. మీ అవసరమే వాళ్లకి వుంది. మీరు తెచ్చిన దానిని మీరే పరిపాలించండి. నేను చాలా సార్లు యూనివర్సిటి కి వద్దామనుకున్నాను. కానీ నేను ఆంధ్రా నుంచి వచ్చాను కాబట్టి నన్ను నమ్మరని రాలేదు. దయచేసి విద్యార్ధి నాయకులారా ఆలోచించండి. పోరాటం తప్పదు. కానీ హింస వద్దు. చాలా చిన్న చిన్న పనులతో ప్రభుత్వాన్ని ముప్పు తిప్పలు పెట్టవచ్చు. సరిగ్గా చెప్పాలంటే చంకలు నాకిన్చచ్చు. దయచేసి మీరు తెచ్చిన తెలంగాణా మీరే పరిపాలించండి.

No comments:

Post a Comment