ఆర్.కె. లక్ష్మణ్ గారికి క్షమాపణలతో.............

Monday, December 20, 2010

జై తెలంగాణా.....

హైదరాబాద్ మీద మనకు ఏమి హక్కు వుంది? సమైకాంద్ర అంటే సరే, ఒకవేళ విడి పోవలసి వస్తే హైదరాబాద్ మీద ఆంధ్రా, రాయలసీమ వాళ్లకి ఏమి హక్కు వుంటుంది? ఆంధ్ర రాజధాని కర్నూల్, నిజాం స్టేట్ ని కలిపాక ఇక్కడ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ వుంది కాబట్టి ఇక్కడకి మార్చారు. ఇక్కడ భూమి విలువ తక్కువ కాబట్టి ఇండస్ట్రీ డెవలప్ అయ్యింది. అంతే కానీ తెలంగాణా వాళ్ళేమి ముచ్చటపడి కలవలేదు. ఒక వేళ అలా అనుకున్నా, ఈ రోజూ ఒద్దనుకుంటున్నారు కాబట్టి తెలంగాణా వేరు చెయ్యవలసిందే. వాళ్ళేమి గొడవలు చెయ్యలేదే. మంచిగా అడిగారు, కోపం వచ్చినప్పుడు ఏదేదో అంటారు, దానిని పట్టుకొని తెలంగాణా వస్తే అరాచకమే అనడం ఆంధ్రా వాళ్ళ తప్పు. మాట్లాడితే వీళ్ళకి మనమొచ్చాకానే అన్నం తినడం తెలిసింది అని ఆంధ్రా వాళ్ళు నా దగ్గర చాలా మంది అన్నారు, నేను ఆంధ్రా వాడినే కదా అని.( నాకు ఇప్పుడు 47 సంవత్సరాలు, నా 19 ఏట నుండి ఇక్కడి నీళ్ళే తాగాను, ఇక్కడి తిండే తిన్నాను, కాబట్టి నాకు తెలంగాణా అంటే ప్రేమ, ఆంధ్రా అంటే ఇష్టం, నేను పుట్టింది అక్కడ కాబట్టి. నేను పక్కా తెలంగాణా వాడిని. ఇంకా చెప్పాలంటే కే.సి.ఆర్.కంటే కూడా నాకు తెలంగాణా మీద ఎక్కువ ప్రేమ వుంది.). కాటన్ దొర ధవళేస్వరం బేరేజ్ కట్టక ముందు మనం కూడా జొన్న అన్నమే తిన్నాము. కాకపోతే వీళ్ళకంటే 25 సంవత్సరాల ముందు మనం వరి అన్నం తినడం మొదలుపెట్టాము. మొదటినుండి వీల్లేమి ఆంధ్రా వాళ్ళు వెనక్కు వెళ్లిపోవాలి అని అడగలేదే. వాళ్ళు వాళ్ళ ప్రాంతాన్ని వాళ్ళు పరిపాలించుకుంటాం అని అడిగారు. దానికి మన రాజకీయనాయకులు వాళ్ళ స్వార్ధం గురించి, కే.సి.ఆర్. తో నాటకాలు ఆడడం మొదలుపెట్టారు. వీల్లేమి ఆంధ్రా వాళ్ళని ఇల్లు వదలి పోమ్మనలేదే. మరి దేనికి భాధ? ఎవరు పరిపాలించినా సామాన్యుడికి ఒరిగేదేమీ లేదు, అది ఆంధ్రా వాడైనా, లేక తెలంగాణా వాడైనా. మరి మనకెందుకు ఈ బాధ? మన ఇల్లు మనకే వుంటుంది, మన పొలం మనకే వుంటుంది. ఆంధ్రా వాళ్ళ భయమేమిటంటే వీళ్ళకి పరిపాలన తెలియదు, మన ఆస్తుల విలువ తగ్గిపోతుంది అని. నువ్వు వుండాలి అనుకున్నప్పుడు నీ ఇంటి విలువ లక్ష అయితేనేమి, కోటి అయితేనేమి, నువ్వు అమ్ముకోవాలి అనుకున్నప్పుడు దాని విలువ అవసరం. అంటే నువ్వు వ్యాపారం చేస్తున్నావు. వ్యాపారం చేసేటపుడు ఒకో సారి లాభం వస్తుంది, ఒకో సారి నష్టం వస్తుంది. అది వ్యాపారం. అంటే నీ వ్యాపారానికి అడ్డు కాబట్టి వాళ్ళ తెలంగాణా వాళ్లకు ఇవ్వద్దు. నిన్ను వాళ్ళేమి ఇక్కడ వ్యాపారం చేసుకోవద్దు అనడం లేదే? ఇక్కడే వుండండి, మీ పనులు మీరు చేసుకోండి అని అంటున్నారు.

అయినా తెలంగాణా ఇస్తే చిన్న రాష్ట్రం అవుతుంది కాబట్టి ఇంకా బాగా డెవలప్ అవుతుంది అని ఎందుకు అనుకోరు? అప్పుడు మీ ఆస్తి విలువ ఇంకా బాగా పెరుగుతుంది కదా. నేను ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగిన ఆంధ్రా వాళ్ళని చాలా మందిని చూస్తున్నాను, వాళ్ళ రక్తం లో ప్రతి బొట్టు ఇక్కడి నీళ్ళతో తయారయినదే, కానీ వాళ్ళు ఆంధ్రా కూతలు కూస్తున్నారు, అంటే వాళ్ళకి ఈ నేల మీద ప్రేమ లేదు, లేనప్పుడు ఇక్కడ వుండడం ఎందుకు? మనం టెర్రరిస్ట్ లని తిడుతున్నాము కదా, కొడుకులు ఇక్కడ పుట్టి ఇక్కడ నీళ్ళు తాగి పాకిస్తాన్ కూతలు కూస్తున్నారు అని, మరి వాళ్ళకి మనకి తేడా ఏమిటి?

1 comment:

  1. Analysis చాలా బాగుంది.... చాలా విపులంగా explain చేసారు...

    ReplyDelete