ఆర్.కె. లక్ష్మణ్ గారికి క్షమాపణలతో.............

Saturday, June 16, 2012

ప్రైవేట్ పెత్తనం.


వైజాగ్ స్టీల్ ప్లాంట్‌లో జరిగిన ప్రమాదానికి కారణం ఎవరూ అని అడిగితే, అది ఖచ్చితంగా ఈ బూర్జువా ప్రభుత్వమే అని ప్రతి ఒక్కరూ చెప్పగలరు. అసలు మన దేశం ఎటు పోతోందో సామాన్యులెవరికీ అర్థం కావడం లేదు. అర్థమైన వాళ్ళు హాయిగా సొమ్ము చేసుకుంటున్నారు. ఇంకా ఇలాంటి వాటిని మనం ఎన్ని చూడవలసి వస్తుందో.
మన్ మోసం సింగులు, అహ్లూవాలియాలు ఈ దేశానికి పట్టిన శనులు. వాళ్ళ పీడ ఎప్పుడు వదులుతుందో ఎవరికీ అర్థం కావడం లేదు. చేతిలో కొద్దిగా పైసలు, సవరించగల మెలకువలు తెలిస్తే చాలు, ఈ దేశంలో ఏదైనా చేసుకోవచ్చు అనే స్థితికి ఈ దేశాన్ని దిగజార్చేసారు. ఈ కొడుకులు వాళ్ళ పెళ్ళాలతో కాపురాలు తప్ప, మిగిలినవన్నీ  ఔట్ సోర్సింగే అనే మంత్రం జపిస్తున్నారు. ఒక ప్రభుత్వ శాఖకు కావలసిన భవనాలు ఎవడో బయటి వాడు, వాడి ఇష్టమొచ్చిన రేటుకు, ఇష్టమొచ్చిన డిజైన్‌తో, ఇష్టమొచ్చిన రీతిలో, ఇష్టమొచ్చిన క్వాలిటీతో కట్టుకుంటూ పోతున్నాడు. ఇప్పుడు ఏ శాఖలోనూ డిజైన్ వింగ్ అనేది లేదు. దేశ వ్యాప్తంగా వేల కోట్లతో ఇ.ఎస్.ఐ. హాస్పిటల్స్ కడుతున్నారు, దానిని పర్యవేక్షించడానికి దానికంటూ ఒక యంత్రాంగం లేదు. పూర్వం అలాంటి పనులన్నీ సి.పి.డబ్ల్యూ.డి. వాళ్ళు చూసేవారు. ఇప్పుడు డిజైన్ చేసేవాడు ఒకడు, ఆర్కిటెక్ట్ ఒకడు, కట్టేవాడు ఒకడు, పర్యవేక్షించే వాడు ఒకడు. అసలు వీళ్ళల్లో ఒక్కడు కూడా ప్రభుత్వం తరపున ఉండడు. ఈ జాడ్యం దానికొక్కదానికే పరిమితం కాలేదు. దేశ రక్షణ వ్యవస్థకు మూల స్థంభం అయిన డి.ఆర్.డి.వో లో కూడా ఇదే జాడ్యం. ప్రతీది ఔట్ సోర్సింగ్. ప్రైవేట్ వాడికి భాధ్యత ఎంత వరకు ఉంటుంది.

ఇప్పుడు వైజాగ్ స్టీల్ ప్లాంట్‌లో 10mm మందం ఉండవలసిన  పైపుల స్థానంలో 5mm మందానివి వాడారంటున్నారు. వాడు కడతాడు, వీడు వాడతాడు. పెళ్ళి చేసుకొనేవాడు ఒకడైతే, శోభనం చేసుకునే వాడు ఇంకొకడు అన్నట్టు తయారయ్యింది ఈ దేశం. తాహతుని మించి ఒక కంపెనీకే వర్కులు ఇవ్వడం, వాడు దానిని ఇంకో నలుగురికి సబ్ ఇవ్వడం. ప్రతీ ఒక్కడూ కనీసం 10 శాతం లాభం వేసుకున్నా, అది నాలుగు చేతులు మారేసరికి క్వాలిటీ సగం పడిపోతుంది. అడిగే వాడు ఎవడు? పూర్వం ఒక డ్రాఫ్ట్‌మెన్ డిజైన్ చేస్తే దానిని పైన నలుగురు చెక్ చేసి కానీ ఓకె అనేవారు కాదు. ఇప్పుడు వాడి దగ్గర ఎటువంటి క్వాలిఫికేషన్ ఉన్నవాడు ఉన్నాడో మనకు తెలియదు, వాడీకి పార్లమెంటులోనో, లేక అసెంబ్లీలోనే పలుకుబడి ఉంటే చాలు వాడు ఒక కన్స్‌ల్‌టెంట్, వాడికి దేశ వ్యాప్తంగా వర్కులు. దీనమ్మా ఈ ఔట్‌సోర్సింగ్ అనే ప్రక్రియనుe, ఏ ఉద్దేశ్యంతో మొదలుపెట్టారో కానీ వ్యవస్థ సర్వనాశనం అయిపోతోంది. ఒక చిన్న అనుమానం తీర్చడానికి కూడా కన్స్‌ల్టెంట్ రావలసిందే. నేను సంవత్సరం క్రితం చేసిన కంపెనీ వర్కులో అయితే కన్స్‌ల్టెంట్ ఒక మోనార్క్. వాడిని కాదనే ధైర్యం ఈ రాష్ట్రానికే హెడ్ అయిన వ్యక్తి కూడా లేదు. నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది.

 ఈ ఔట్ సోర్సింగ్ అనే దాని పీడ పోతే కానీ ఎక్కడా క్వాలిటీ రాదు.  వాళ్ళ మీద అజమాయిషీ చేసే ధైర్యం ఎవడికీ లేదు. మన జలయజ్ఞం దానికొక పెద్ద ఉదాహరణ. ఇంకా మనం ఎన్ని చూడాలో.

1 comment:

  1. ఏ వ్యవస్థను అయినా బ్రష్టు పట్టించటములో మనవాళ్ళు మాత్రము మొనగాళ్ళు.అనాడు ప్రతిదానికి ఆలస్యము అవుతుందని తద్వార సమయము,ఖర్చు ఎక్కువ + ఎక్కువ మంది సిబ్బంది అవసరము అవుతుందని ఇలా రకరకాలయిన కారణాలు పుట్టించి అన్నింటికి ఓకటే మందు అనే రీతిలో ప్రైవేటికరణ అనే ఫార్ములా బయటకు వొచ్చింది.మెల్లగ పాములు గుడ్లు పెట్టి పొదిగి కొండచిలువలను తయారుచేసి దేశాన్ని కబళిస్తున్నాయి.పోని యువతరము వీటన్నిటికి ఆశ అనుకుంటే వాళ్ళకు సాఫ్టవేర్లు, అమెరికా ఉద్యొగాలు తప్ప మిగతావాటిని పట్టించుకోలేని జీవన సమరము.చివరకు మనందరము తెలతాము పాతాళములోన లేక దాని క్రింద లోకాల్లోనో... దొంగ లం... ఈ రాజకీయనాయకుల స్వార్ధం ముందు.

    ReplyDelete