ఆర్.కె. లక్ష్మణ్ గారికి క్షమాపణలతో.............

Sunday, December 25, 2016

హిందూ మతాధికారులు - కొత్త పైత్యాలు.

ప్రపంచం అంతా, ఆదిమ మానవుడి కాలం నుండీ ఉన్నది, విగ్రహారాధన మాత్రమే. దీనికి ఋజువులు ప్రపంచ వ్యాప్తంగా తవ్వకాలలో బయటపడుతున్న దేవీ, దేవతల విగ్రహాలే. ఆ తరువాతి కాలంలో అప్పటి కాలానికి, ప్రాంతానికి తగ్గట్టు రకరకాల మతాలు మొదలయ్యాయి. 

అలా భారతదేశంలో మొదలయినవే జైన, బౌద్ధమతాలు. అవి హిందుత్వం నుండి విడివడినా, జైనం మన దేశంలో, భౌద్ధం మన దగ్గర కొద్దిగా, బయట దేశాలలో ఎక్కువగా మనగలుగుతున్నాయి.

అలాగే ఇస్లాం, క్రిస్టియానిటీ, జొరాస్ట్రియనిజం, కొద్దిగా జుడాయిజం మన దేశంలో ఆచరించబడుతున్నాయి. అంతరించిపోవడానికి దగ్గరగా ఉన్న జొరాస్ట్రియనిజం మన దేశంలోనే ఎక్కువగా ఉంది.

కానీ ఇప్పుడు హిందుత్వం అంటూనే కొంతమంది తమ సొంత సిద్ధాంతాలను (పైత్యాలను) వ్యాప్తి చేస్తున్నారు. దానికి వారు హిందుత్వాన్ని వాడుకుంటున్నారు.

వీటికి మొదట ఆజ్యం పోసిన వ్యక్తి రజనీశ్. దానికి కొనసాగింపా అన్నట్టు, ఈ మధ్యన పశ్చిమ దేశాలలో మొదలయిన న్యూడ్ యోగా, పవర్ యోగా లాంటివి. ప్రతీ ఒక్కడూ యోగాని శారీరక వ్యాయామంలా చూస్తున్నాడు తప్ప, ఏకాగ్రత కోసం చేసే ప్రయత్నాలలో మొదటిది యోగా అనే విషయాన్ని గ్రహించడం లేదు. ఎనభై ఐదు కేజీల బరువుకు శరీరాన్ని పెంచడం మీద ఉన్న శ్రద్ధను, మనసును అదుపు చేసుకోవడానికి నేను చూపించలేదు కాబట్టే, నాలాంటి వారితో ముందుగా యోగాని సాధన చేయిస్తారు తప్ప, అది శరీరబరువును తగ్గించే వ్యాయమం మాత్రమే కాదు.

ఇక ఈ మధ్యన కొంతమంది మఠాధిపతులు ఇంటికి వస్తే ఇంత, కారు ఎక్కితే ఇంత, పాదాలకు నమస్కారం చేయించుకోవడానికి ఇంత అనీ వసూలు చేస్తున్నారు. సాధుసంతులు పాద నమస్కారానికి అంతగా ఇష్టపడరు, వారు ఎంతో సాధన చేసి, ఆ స్థాయికి వచ్చారు. సాధన మానివేస్తే వారు తిరిగి నాలాంటి వారి స్థాయికి జారిపోతారు.


 ఇప్పుడు ఓం శాంతి వాళ్ళు స్త్రీలతో బొట్టు తీయించి, తెల్లచీరలు కట్టించి మెడిటేషన్ గురించి చెపుతున్నారు. ఇటువంటి వాటిని మనం మొదట్లోనే తుంచవలసిన అవసరం ఉంది.

ఈ క్రింద ఫోటోని చూడండి. ఎవరు ఎవరినైనా పూజించుకోవచ్చు, అందులో ఎవరికీ ఎటువంటి అభ్యంతరం ఉండదు. కానీ శాస్త్రాల మీద ఆధారపడి, క్రతువులు జరిపే హిందుత్వంలో, కొన్ని పద్ధతులు ఉన్నాయి. హిందుత్వాన్ని వాడుకునే ఎవరైనా, వాటికి లోబడే ఉండాలి కానీ, తమకు పేరు, ప్రఖ్యాతులు వచ్చాయి కాబట్టి, తాము ఏది చేసినా చెల్లుబాటు అవుతుంది అనుకుంటే కుదరదు. ఆయనకు జీసస్ అంటే ఇష్టం ఉన్నప్పుడు, ఆయన జీసస్ ఫొటోని/ విగ్రహాన్ని వేరే మందిరంలో ఉంచుకోవచ్చు. అలా కాదు, అందరూ సమానమే అని చెప్పాలంటే, ముందుగా వారు పీఠాలను వదిలి సామాన్యుడిలా అందరిలో కలిసిపోవాలి తప్ప, సామాన్యుడు మమ్మల్ని తాకడానికి అర్హత లేనివాడు అని ప్రవర్తించడం కుదరదు. 

ఎవరైనా, హిందుత్వానికి లోబడి మాత్రమే వారి సిద్ధాంతాలను వ్యాప్తిచేసుకోవాలి తప్ప, సొంత పైత్యాలను హిందుత్వం పేరు చెప్పి వ్యాప్తి చెయ్యడం మానుకోవాలి. అప్పుడే వారికి గౌరవం, వారు చెప్పే సిద్ధాంతానికి గౌరవం. 

ఒక సామాన్య హిందువుగా, వారికంటే మనకే ఎక్కువ హక్కు ఉంది, ఈ ధర్మం మీద.





No comments:

Post a Comment