ఆర్.కె. లక్ష్మణ్ గారికి క్షమాపణలతో.............

Monday, June 14, 2021

 

దక్షిణ భారతం అంతా ఇదే పరిస్థితి.

మొన్న తోటలో ఫాంపాండ్ తవ్వించుకున్నాను. మట్టి తోలే ట్రాక్టర్ డ్రైవర్ ఇంకొకతనికి బండి నేర్పిస్తున్నాడు. చెరువు దగ్గర అతనిని నడపవద్దని చెప్పాను, ఎక్కడ తిరగేసేస్తాడో అని. కొద్ది దూరం వెళ్ళాకా కుర్రాడికి ఇచ్చేవాడు. ఆ కుర్రాడు మట్టి దింపేచోట తిరగేసేసాడు. ఓనర్‌ ఏమీ మాట్లాడకుండా దాన్ని లేపించాడు. అదేమిటి తిట్టడం లేదు అని అడిగాను. ఇప్పుడు వీడిని తిడితే, ఆ డ్రైవర్‌కు కోపం వస్తుంది అని చెప్పాడు. వాడికి కోపం వస్తే ఏమి జరుగుతుందో తెలిసిందే కదా.


నేను, 1997లో చెరువులు చేస్తున్నప్పుడు, తాడేపల్లిగూడెం ప్రక్కనున్న చేబ్రోలులో ఒక మాజీ ఎంఎల్‌ఏ గారింటిలో అద్దెకుండేవాడిని. ఒకసారి ఇందిరాగాంధీ హైదరాబాద్ వచ్చినప్పుడు, మీటింగులో ఈయనలాంటి పంచెకట్టు వాళ్ళను చూసి, మీరు పొలాలు అమ్మేసుకొని ఏమైనా పరిశ్రమలు పెట్టుకోండి, ఏ ప్రభుత్వం వచ్చినా కమ్మీవాడు చెప్పిన దానిని అమలుపరచవలసిందే, ముందు ముందు మీరు వ్యవసాయం చెయ్యలేరు, ఎవడూ మీ మాట వినడు, వాళ్ళను కూర్చోబెట్టి డబ్బులు పంచవలసిందే అని చెప్పిందంట. ఆ మాట చెపుతూ ఆయన సాయిబాబూ నువ్వు ఈ చేపల చెరువులు అవీ చెయ్యలేవు, నీకు లౌక్యం తెలియదు, నువ్వు ఉద్యోగం చేసుకోవడమే మంచిది అని అన్నారు.

ఇదే మాటను బాబుగారూ కూడా అన్నారు. అది వాస్తవం. వైఎస్సార్ పుణ్యమా అని చదువుకున్న ఇంజనీర్, మా పాలేర్లకంటే తక్కువ జీతానికి ఉద్యోగానికి దొరుకుతున్నాడు కానీ పని చేసేవాడు దొరకడం లేదు. వ్యవసాయానికే అని కాదు, మెకానిక్‌‌కు, ఎలక్ట్రానిక్స్ రిపేర్ చేసే అతనికి, ఎలక్ట్రీషియన్‌కు, ఆఖరుకు తాపీ మేస్త్రీకు కూడా పని వచ్చిన మనుషులు దొరకడం లేదు.

బీహార్, బెంగాల్, ఒడిస్సా, యూపి, ఝార్ఖండ్, చత్తీస్‌ఘడ్ లాంటి రాష్ట్రాలు అభివృద్ధి చెందితే, దక్షిణాది రాష్ట్రాలలో ఒక్క పని నడవదు.

సమాజంలో అందరూ ఉండాలి, వాళ్ళకు డబ్బు అవసరం కలగాలి, అప్పుడే సమాజం నడుస్తుంది.

సమసమాజం అనేది ఉండదు, మాటల్లో చెప్పుకోవడానికే.

నేను ఇటువంటి పోస్టులు ఫేస్‌బుక్‌లో పెట్టినప్పుడు నన్ను చాలా మంది విమర్శిస్తారు, కానీ వాళ్ళే రోడ్డు మీద ఎవడైనా దుక్కలా ఉండి, అడుక్కోవడానికి వస్తే, దున్నపోతులా ఉన్నావు, ఏదైనా పనిచేసుకోవచ్చు కదా అని బూతులు తిడతారు. కానీ అదే పని ప్రభుత్వం ఉచితాలు అని చేస్తుంటే, డబ్బులు అలా ఇవ్వడం వలన అవి మార్కెట్టులోకి వస్తాయి, రొటేషన్ పెరుగుతుంది అని ఇక్కడ మనకు ఎకనామిక్స్ చెపుతారు. కానీ వాళ్ళు మాత్రం, వెనుక ఆస్తులు ఉన్నా తిని కూర్చోకుండా ఉద్యోగాలో, వ్యాపారాలో చేసుకుంటూ ఉంటారు.

చైనాలో లాగా పని చెయ్యని వాడిని కొట్టి పనిచేయించే పరిస్థితి వస్తే కానీ, దేశం బాగుపడదు

No comments:

Post a Comment