ఆర్.కె. లక్ష్మణ్ గారికి క్షమాపణలతో.............

Wednesday, January 5, 2011

రాధాకృష్ణ గారు ఇకనుండి చాలా జాగ్రత్త గా వుండాలి, అసలే వాళ్ళు హోం మినిస్టర్ బంధువులు.


మొన్నటి నుండి రాష్ట్రం మొత్తం సూరి టాపిక్ నడుస్తోంది. అతను ఫ్యాక్షనిస్ట్, చావు కూడా అలాగే వచ్చింది. చిన్న వయసులో అతని కుటుంబానికి జరిగిన అన్యాయానికి అతను బలే ప్రతీకారం తీర్చుకోబోయాడే, పాపం జస్ట్ మిస్ అయ్యింది మగాడంటే వాడు అని మేము జూబిలీ హిల్స్ కారు బాంబు పేలుడప్పుడు అనుకున్నాము. అప్పుడు మాకు ఈ ఫ్యాక్షన్ గొడవల గురించి అంతగా తెలియదు.

ఈ రోజు సీతారామాంజనేయులు గురించి, కార్తీక్, ప్రదీప్ రెడ్డిల గురించి వార్తలు. ఈ దేశంలో గూండాయిజం, రాజకీయం, చట్టం ఎంతలా పెనవేసుకుపోయాయో వీళ్ళ గురించి చదివితే తెలుస్తుంది. ఇదే సి.పి ని బెజవాడ దందా గురించి వేమూరి రాధాకృష్ణ బయటపెట్టేదాకా పులి అనుకున్నాము, కానీ వీడు కూడా చెంచా గాడేనని అన్నపూర్ణ ఇండస్ట్రీ విషయం గురించి చదివాకా తెలిసింది. ఇక మన డి.జి.పి. అరవిందరావు గారు మంత్రి కుమారుడి ప్రమేయం లేదని అప్పుడే సెలవిచ్చేసారు. ఒక ఇండస్ట్రీ లో రాత్రి కి రాత్రే డైరెక్టర్స్ మారిపోయి, అందులో మినిస్టర్ బందువు ఒక డైరెక్టర్ గా వున్నా వీల్లెవరికి అందులో ఫాక్షనిజం కనిపించలేదు. వీళ్ళందరికీ ఫాక్షనిజం ఒక్క నక్షలైట్స్ లోనే కనిపిస్తుంది. 

ఇప్పుడు వీళ్ళందరికీ వేమూరి రాధాకృష్ణ ఒక శత్రువు గా కనిపిస్తారు. రాధాకృష్ణ గారు ఇకనుండి చాలా జాగ్రత్త గా వుండాలి. బిస్కెట్ కింగ్ రాజన్ పిళ్ళై లాంటి వాడినే జైల్లో పెట్టి చంపిన ఘనత మన పోలీసులది. మారుతి సుజుకి మాజీ ఎం.డి. భాస్కరుడుని గుద్దినట్టే మిమ్మల్నీ నెంబర్ లేని లారీ గుద్దవచ్చు, లేకపోతే సింగరేణి మాజీ ఎం.డి. మహాపాత్రో ని తోసేసినట్టే పైనుండి తోసేసి ఆత్మహత్య అనవచ్చు.

రోజూ ఫేస్ బుక్ లో జగన్ మీద, చంద్రబాబునాయుడు మీద కామెంట్స్ చేసుకునే మేము వీళ్ళ ముగ్గురిమీద కామెంట్స్ చెయ్యడంలేదు. ఎందుకంటే మేము ఉండేది హైదరాబాద్ లోనే, వాళ్ళు మమ్మల్ని వెతికి పట్టుకోనీ మరీ నరుకుతారు. సూరి లాంటి వాడినే చంపిన వాళ్లకి మేమొక లెక్కా, అసలే వాళ్ళు హోం మినిస్టర్ బంధువులు.

No comments:

Post a Comment