ఆర్.కె. లక్ష్మణ్ గారికి క్షమాపణలతో.............

Monday, January 24, 2011

నేనూ, నా హిందూ మతం.


పిల్ల వచ్చి గుడ్డుని ఎక్కిరించినట్టు, ఈ రోజు అందరూ హిందువుకి నీతులు చెబుతున్నారు. హిందువు అన్నవాడు పరమత సహనం గురించి ఒకళ్ళ దగ్గర నుండి తెలుసుకొనే దౌర్భాగ్యపు స్థితి లో లేడు. హిందువుకి సహనం అవసరాన్ని మించి ఉంది కాబట్టే, ఈ దేశంలో కొన్ని వేల సంవత్సరాల నుండి వేరే మతాలని కలుపుకుపోతున్నాడు. ఈ సహనం ఎల్లకాలం ఉంటుంది అనుకొనే రోజులు పోయాయి. నిన్న సుప్రీంకోర్ట్ తీర్పు మీద కాంగ్రెస్ స్పందన చూసాకా, అసలు వీళ్ళ మూలాలు ఏమిటనే అనుమానం వస్తోంది. 1984 లో సిక్కుల ను ఊచకోత కోసినందుకు వాళ్ళు చెప్పినదేమిటి? ఒక మహా వృక్షం నేలవాలితే భూమి కంపిస్తుందా? ఒక మనిషే మహా వృక్షం ఐతే హిందూ మతాన్ని ఏమనాలి? అసలు గాంధీని చంపిన రోజే, నెహ్రూని కుడా చంపి ఉంటె, ఈ దేశానికి ఈ శని పట్టేదికాదు. హిందువుని అని గర్వంగా చెప్పుకో అని స్వామి వివేకానంద చెప్పవలసిన అవసరం ఉండేది కాదు.

సుప్రీంకోర్ట్ చెప్పినట్టు, అసలు మనుషుల్ని ప్రలోభపెట్టి, భయపెట్టి మతాన్ని మార్చవలసిన అవసరమేమిటి? ఎవడైనా ప్రోబ్లం లో ఉన్నాడు అని తెలిస్తే పాపం, వాలిపోవడం, మతం మారమంటం. పోనీ దేముడికి దణ్ణం పెట్టుకో అంటే పరవాలేదు, మీ దేముడ్ని వదిలేయి, మా దేముడ్ని నమ్ముకో ఇదీ వాళ్ళు చెప్పేది. అదీ సొంత ఫ్రెండ్సే. ఈ మద్యన నేను కొద్దిగా ట్రబుల్స్ లో వున్నానని, నా గురించి తెలిసి కూడా, నా ఫ్రెండ్స్ నన్ను మతం మారమంటారు. నేను చర్చ్, మసీదులు ముందు నుండి వెళ్ళేటప్పుడు ఆటోమెటిగ్గా నా చెయ్యి పైకి లేపి దణ్ణం పెట్టుకుంటాను. అది వాళ్ళకీ తెలుసు. అయినా సరే అలాక్కాదు, పూర్తిగా మతం పుచ్చుకోండి అంటారు. నా గురించి అతను ఆలోచిస్తున్నాడు, అనే ఒకే విషయం మీద వాళ్ళని ఏమీ అనడంలేదు. ఎంత ఫ్రెండ్ అయినా సరే, వాడు అవసరంలో ఉన్నాడు అనేసరికి వీళ్ళకి మతం మార్పించేయాలి అనే ఆలోచన ఎలా వస్తుందో అర్థంకావడం లేదు. 

అసలు ప్రపంచమంతా హిందువు గురించి ఏమనుకొంటోంది? ఇక్కడ గొడవ జరిగితే వాళ్ళ గోల ఏమిటి? ట్విన్ టవర్స్ మీద దాడి జరిగినప్పుడు బుష్ నోటి నుండి జారిన మాట ఏమిటి? క్రూసేడ్ మొదలుపెడదాము. వెంటనే సరి దిద్దుకొని మళ్ళీ ఆ మాట వాడలేదు. ఎవడి మీద యుద్ధం చేస్తాడు? అలా చేసే కదా ప్రపంచాన్ని రక్తసిక్తం చేసింది. పాముకి పాలు పోస్తే ఏమౌతుంది? మా మానాన మేము బ్రతుకుతున్నాము. మేము ఏ రోజు దేముడ్ని ఒక వస్తువు అమ్ముకున్నట్టు అమ్ముకోలేదు. అలా చేసి ఉంటే మా మతం లోంచి వచ్చిన బౌద్ధం ప్రపంచ వ్యాప్తం అయినట్టే మా మతం కూడా వ్యాపించేది.

కాబట్టే ప్రపంచంలోనే పురాతనమైన మూడు మతాలలో ఒకటైన హిందూ మతం ఈ దేశానికే పరిమితమైంది. మిగిలిన వాళ్ళు అమ్ముకున్నట్టే అమ్ముకుని వుంటే ఈ మూడు మతాలు ఈ స్థితి లో ఉండేవి కావు. ఆ జంతు జాతి నశించిపోతోంది, ఈ వృక్ష జాతి నశించిపోతోంది అని గోల పెడుతున్నారు గానీ, మన కళ్ళ ఎదురుగుండా పార్సీ మతం నశించిపోతుంటే వీళ్ళకి కనపడడంలేదు. గట్టిగా నిలబడ్డారు గనుక సరిపోయింది గానీ, లేకపోతె యూదు మతం పరిస్థితి ఏమయ్యేది? ఇప్పటికైనా హిందువు మేలుకొనకపోతే హిందూ మతం పరిస్థితి కూడా పార్సీ మతం లాగ అయ్యిపోవడానికి ఎక్కువ కాలం పట్టదు. 

కొన్ని జిల్లాల్లో పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. పెళ్లి చేసుకోవాలంటే ముందు వాళ్ళింటిలో హిందూ దేవుళ్ళ ఫోటోలు ఉన్నాయో, లేదో చూసుకోవలసి వస్తోంది. బస్సు స్టాండ్, రైల్వే స్టేషన్ లలో నిలబడితే ఎవడో వస్తాడు, చేతిలో కాగితం పెట్టి వెళ్ళిపోతాడు. ఏమిటా అని చూస్తే మా దేముడు ఇలాగా,అలాగా అని ఉంటుంది. నాకు చాలాసార్లు ఈ అనుభవాలు అయ్యాయి. ఒకసారి కొత్తగూడెం నుండి మణుగూరు వెళుతుంటే బస్సు లో నా పక్కన కూర్చున్న అతను ప్రభువు గురించి చెప్పడం మొదలుపెట్టాడు. నాకు ఇంట్రస్ట్ లేదు వదిలేయండి అని మర్యాదగా చెప్పాను. లేదు, ఒకసారి బైబిల్ చదవండి అని ఇవ్వబోయాడు, నేను ఇప్పటిదాకా మా భగవద్గీతే చదవలేదు, ఇదేక్కడ చదువుతాలెండి అనేసి నేను మాగజైన్ చదువుకోవడం మొదలుపెట్టాను. ఎన్నిసార్లు చెప్పినా అతను నన్ను వదిలిపెట్టకుండా ఏదో చెబుతానేవున్నాడు. ఈ లోపు మా కాలనీ స్టేజ్ వచ్చింది. బ్రతికానురా అనుకుంటూ దిగుదామని లేస్తుంటే వాడు బైబిల్ తీసి చేతిలో పెట్టబోయాడు. అప్పుడు లేసింది నా బి.పి. నా కొడకా ఇందాకటినుండీ మర్యాదగా చెపుతున్నా దొబ్బుతావేంటి, ....పగులుద్ది జాగ్రత్త అని బూతులు తిట్టి కిందకు దిగిపోయాను.

ఏలూరులో ఇంటి ముందు నిలబడి సిగరెట్ కాల్చుకుంటుంటే ఒక పెద్దాయన కాగితం ఇవ్వబోయాడు, నేను హిందువుని నాకొద్దు అని మర్యాదగా చెపితే వెళ్ళిపోయాడు. నేను ఇంట్లోకెళ్ళి మళ్ళీ బయటకు వచ్చేసరికి, ఆయన కాగితం లోపలకేసి వెళ్ళిపోతున్నాడు. అంతకు ముందు మర్యాదగా మీరు అన్న నేను, ఒరేయ్ అని పిలిచా. వెనక్కు వచ్చాడు. గెట్ పిల్లర్స్ మీద చూడమన్నా, చూసాక ఏమున్నాయి అక్కడ అని, ఏరా బోర్డ్ మీద నా పేరు రామ రాజు అని అందంగా ఉంది, పిల్లర్స్ మీద ఒక ప్రక్క దుర్గ ఫోటో, ఇంకో ప్రక్క సాయి బాబా ఫోటో ఉన్నాయి కదా, కళ్ళు ......నాయా, నాకొడకా, ఇందాకా మర్యాదగా చెప్పాను, ఇంకోసారి కాగితం నా గేట్లో పడిందంటే చస్తావు జాగ్రత్త అని అరిసా. అప్పుడు మా ఎదురింటి వాళ్ళు, మాకు రోజు ఇదే గొడవండి, కాకపొతే మీరు తిట్టినట్టు మేము తిట్టలేకపోతున్నాము అన్నారు. నేను అసలే నిర్మొహమాటంగా ఉంటాను, దాన్ని నా తెలంగాణా జీవితం ఇంకా పెంచింది. నాలో ఉన్న ఆలోచనాశక్తి (మూర్ఖత్వం) ఇంకా ఎక్కువ పెరిగిందంటే నా సింగరేణి జీవితమే కారణం.

నా మేనకోడలు హాస్టల్ లో ఉన్నప్పుడు, దాని రూమ్ మేట్స్ దానితో క్రీస్తు ప్రార్దన చేయించేవాల్లంట. ఆ విషయం తెలిసి నేను తిడితే, అది అందులో తప్పేమిటి మావయ్యా అని నామీదే తిరగబడింది. దాన్ని మార్చడానికి నాకు వారం రోజులు పట్టింది. ఇప్పటికీ అది అమెరికా నుండి రాగానే ఏడిపిస్తుంటాను. ఇదే మనిషి ఇంజనీరీంగ్ చదివేటప్పుడు ఒక లెక్చరర్ రోజూ క్రీస్తు గురించి చెపుతుంటే తిరగబడింది. సాయంత్ర్రానికి దాని పేరు కాలేజీలో మారుమోగిపోయిందంట. అసలు పాఠాలు చెప్పవలసిన మాస్టారులు మతాల గురించి చెప్పడమేమిటి? నా క్లాస్‌మేట్ ఆదిత్యం అని ఉన్నాడు. అతని తమ్ముడి స్కూల్లో మాష్టారు, ఒక సారి కుంతీ దేవిని కామెంట్ చేసాడంట. ఆ కుర్రవాడు ఇంటికొచ్చి వాల్ల నాన్నగారితో చెపితే, ఆయన ఒరేయ్, రేపు మీ మాష్టారిని మన పాండవుల తండ్రుల అడ్రెస్స్ లు మనకు తెలుసు, వాళ్ళ దేముడి నాన్న అడ్రెస్ ఏమిటో అడుగు అన్నారంట. మరుసటి రోజు ఇంక ఆ మాష్టార్ ఏమి మాట్లాడతాడు?


ఒక రోజు నేను చెరువు దగ్గర నుండి వస్తూ పక్క ఊరిలో ఉన్న వెల్డర్ దగ్గర  నా పడవలు రిపేర్ చేయించడానికి అని ఆగాను. అతను కొత్తగా వచ్చాడు. అప్పటికి ఆరు నెలలయ్యింటుంది అతను అక్కడ పెట్టి. రోడ్ మీద ఆగి పిలిచాను. నేను ఎవరితో ఐనా ముందు నా పేరు చెప్పి పరిచయం చేసుకుంటాను. అతనికి నా పేరు చెప్పగానే సార్ మీ గురించి విన్నానండి. మీ దగ్గర నేను రేట్ చెప్పనండి, మీకెంత ఇవ్వాలనిపిస్తే అంతే ఇవ్వండి అన్నాడు. నేను అక్కడ బాగా పేరు సంపాదించేను. ఆ చుట్టుపక్కల గ్రామాల్లో ఎవరూ కూడా ఒకే సంవత్సరంలో నా అంత నష్టపోయినవాడు లేడు. అదీ మన పేరు గొప్పదనం. సరే రేపు పంపిస్తానని చెప్పి బయలుదేరుతుంటే, అతనికి నన్ను చూస్తే ఏమనిపించిందొ ఏమో, నన్ను ఆపి సార్, నేను రెండు సంవత్సరాల క్రితం మతం తీసుకున్నానండి అన్నాడు. మంచిదమ్మా, ఇప్పుడు బాగుందా అన్నాను. చాలా బాగుంది సార్ అన్నాడు. బైబిల్ పూర్తిగా చదివావా అన్నాను. చాలా సార్లు చదివానండి, రోజూ చదువుతానండి అన్నాడు. అప్పుడు, నీ వయసెంత అని అడిగాను. 25 ఏళ్ళండి అన్నాడు. అంటే ఊహ వచ్చాకా 1౦ ఏళ్ళు హిందువుగానే ఉన్నావు కదా అన్నాను. ఆయ్ అన్నాడు. ఎప్పుడైనా రామాయణ, భారత, భాగవతాలు చదివావా అన్నాను. లేదండీ అన్నాడు. ఇప్పుడు ఒక బూతు మాట అంటాను, ఏమనుకోవు కదా అన్నాను. బలే ఉన్నారండి, మీరంటే నేనెందుకు అనుకుంటానండి అన్నాడు. అయితే అంత కాలం ...................................వు అన్నాను. నిజమే సార్ నేను చేసింది తప్పేనండీ అన్నాడు. అతనికి ఒక అరగంట క్లాస్ పీకి వచ్చేసాను.


మా సింగరేణి లో గుడి, చర్చ్, మసీదు అన్నీ అన్‌అఫీషియల్ గా సివిల్ వాళ్ళమే కట్టిస్తాము. అలాగే మసీదు కట్టించాము. దాని ఓపెనింగ్ కి మా జే.ఇ నన్ను రమ్మని పిలిచారు. అదేంటి సార్, నన్ను పిలుస్తారు, కట్టించిందే మనం, మనం బయటవాళ్ళని పిలవాలి గానీ అన్నాను. అంటే ఆయన, అది కాదు ఒక బ్రాహ్మిణ్ ఇస్లాం తీసుకున్నారు, రేపు వచ్చేది ఆయనే అందుకని ప్రత్యేకంగా చెపుతున్నాను అన్నారు. వెంటనే నేను సారీ సార్, నేను రాను అన్నాను. ఎందుకని అని అడిగారు ఆయన. సార్ నా మతం గొప్పతనం తెలుసుకోలేనోడు ఇంక మీ మతం గురించి ఏమి చెపుతాడు, అది నేను వినడమేమిటి అని మరుసటిరోజు నేను ఊర్లో ఉంటే బాగోదని హంటింగ్ కి వెల్లిపోయాను. నాకు మొహమాటం తక్కువ, కానీ మేము కట్టించిన దాని ఓపెనింగ్ కి నేను లేకపోతే బాగోదని వెళ్ళిపోయాను. ఆయన, నేను, మతం విషయంలో తప్పితే సొంత అన్నాతమ్ముల్ల గా ఉండేవాళ్ళము. 


ఇంక, కొన్ని హాస్పిటల్స్ లో పరిస్థితి ఎలా ఉందంటే, ఎవరైనా పల్లెటూరి నుండి డెలివరీ గురించి వస్తే, వాళ్ళు తిరిగి వెళ్ళేటప్పుడు మతం పుచ్చుకొని తీరుతారు. ఎలాగంటే సరిగ్గా నొప్పులు రావడానికి ఇంజెక్షన్ ఇవ్వడానికి ముందు నర్స్ వచ్చి అమ్మా కడుపులో బిడ్డ అడ్డంతిరిగింది, జాగ్రత్త, మీ దేముడికి దణ్ణం పెట్టుకో అని వెళ్ళిపోతుంది. ఇక్కడ ఈ అమ్మాయి భయంతో దణ్ణం పెట్టుకుంటూ ఉంటుంది. ఆ నర్స్ మళ్ళీ వస్తుంది. ఏదో నా నమ్మకానికి ఈ లాకెట్ వేసుకోఅమ్మా, నేను కూడా మా దేముడుకి నీ గురించి దణ్ణం పెట్టుకుంటాను అని వెళ్ళిపోతుంది. తరువాత డాక్టర్ వచ్చి నొప్పులు రావడానికి ఇంజెక్షన్ ఇస్తుంది. తరువాత మాములుగా డెలివరీ అయ్యిపోతుంది. ఆ నర్స్ వచ్చి మా దేముడే నిన్ను కాపాడేడు అని చెప్పేసరికి వీళ్ళకి నమ్మకం పెరిగిపోయి మతం మారిపోతున్నారు. ఈ విషయం మీద ఒక హాస్పిటల్ లో గొడవ కూడా అయ్యింది. ఇలాంటివి చూసే దారా సింగ్ ఆ పని చేసింది. అదే టైంలో ఒరిస్సా లో ఒక నన్ ని ఎవరో రేప్ చేసారు. ఆ వార్త పేపర్లో మొదటిపేజీలో వచ్చింది. ఏమని, హిందూ అతివాదుల చేతిలో నన్ మానభంగం. తరువాత తనని రేప్ చేసింది మాజీ లవర్ అని తెలిసింది. ఈ వార్త మాత్రం చిన్న బాక్స్ లో నాలుగో పేజిలో వేసారు. గ్రాహం స్టైన్స్ తో పనిచేసిన వ్యక్తే కమిటీ ముందు అతను మతం మార్పించే పద్దతి గురించి చెప్పాడు. 


1997-98 ల్లొ ఒరిస్సా, వెస్ట్ బెంగాల్ లకు చెందిన కొంతమంది కలసి ఈ రెండు రాష్ట్రాలలో ఉన్న కొన్ని జిల్లాలని కలపి క్రిష్టియన్ స్టేట్ గా చెయ్యాలని అడగడానికి అని కలకత్తాలో మీటింగ్ పెట్టుకున్నారు. అడిగారొ లేదో తరువాత పేపర్ లొ రాలేదు. ఈశాన్య రాష్త్రాలలొ పరిస్థితి చూస్తూకూడా మనం ఇలా ఉంటే ఎలాగ? పరిస్థితి లొ మార్పు రాకపోతే దేశంలో చాలామంది దారాసింగ్ లు వస్తారు. శ్రీరామసేన, అభినవభారత్ ల అవసరం చాలా ఎక్కువగా కనిపిస్తోంది.

8 comments:

  1. నీ మాటలు ఆణిముత్యాలు. హిందూ సంశ్కుతి, మతం అంటే అందరికి భయం. ఎందుకంటే అందులో అంత శక్తి దాగి ఉన్నది. సృష్టి యొక్క పరమ సత్యం, మానవుడు తననుతాను తెలుసుకొనే ఆధ్యాత్మికత్వం , మరియు నిజమైన ఆనందం పొందగలిగే జీవనశైలి అన్నీ హిందూ మతంలో చెప్పబడి ఉన్నాయి. వేదాలు మరియు ఉపనిషద్దులలో చెప్పని సత్యం మరొకటి లేదు. ఈ విషయం మనకంటే మిగతా మతాలవారికి బాగా తెలుసు. అందుకే వాళ్ళని కాపాడుకోవడం కోసం హిందూ మతాన్ని నానారకాలుగా దాడి చేస్తుంటారు. They have feeling of 'insecurity'. శతాబ్దాలుగా ప్రయత్నించినా వారు అంతగా ఫలించలేదు. ఎందుకంటే ఎప్పటికైనా సత్యమే గెలుస్తుంది.

    ఇకపోతే మన రాజకీయ నాయకులు మీడియా వారి గురించి చెప్పనక్కర్లేదు. వాళ్ళకి విలువలు లేవు. నిజానిజాలతో పని లేదు. ప్రజాక్షేమం అక్కర్లేదు. వాళ్ళకి కావలసింది వాళ్ళ పబ్బం గడుపుకోవడమే. వాళ్ళ పరువు వాళ్ళే తీసుకున్నారు - ఆదిత్యం

    ReplyDelete
  2. Excellent sir,
    please keep it.

    ReplyDelete
  3. నేను అసలే నిర్మొహమాటంగా ఉంటాను, దాన్ని నా తెలంగాణా జీవితం ఇంకా పెంచింది.

    ReplyDelete
  4. మనది మతం కాదు... ఒక జీవన విధానం....హిందు ధర్మం అని అనండి....

    ReplyDelete
  5. ప్రతీ హిందువుని...ఊహ తెలిసిన వయసునుండి..10 వ తరగతి వరకు.. Daily 1 Hr R.S.S కి పంపాలి... ఆ తర్వాత వారి ఇష్టం...

    ReplyDelete
  6. ♥ హిందూవు గా జీవించు హిందూ
    వు అని గర్వించు ♥

    ReplyDelete
  7. ♥ హిందూవు గా జీవించు హిందూ
    వు అని గర్వించు ♥

    ReplyDelete
  8. Namaste andi chala baga cheparu muduga mana patya pusthakallo(eduction books) yesu pitina taruvata putaka munupu ane padhalu tolagin chali mana "sanathana darmam(hindu matham)" kosam kanya kumari nudi kasmeer varaku tirigi udharinchina mana "jagadguruvu adi sankaracharya" putina taruva ani putaka munupu ani chesthai lo manam lema e swartha rajakiya nakulaku yepudu marutharo..!!

    ReplyDelete