ఆర్.కె. లక్ష్మణ్ గారికి క్షమాపణలతో.............

Tuesday, January 4, 2011

అధికారాన్ని పూర్వం లాగే వారసత్వంగా ఇస్తూ పొతే.........

ఇప్పుడే నేను మద్దెల చెరువు సూరి భార్య శ్రీమతి. భానుమతి గారు రిపోర్టర్స్ తో మాట్లాడినవి టి.వి.లో చూసాను. ఆవిడ వున్న పరిస్థితిలో ఆవిడని రాజకీయజీవితం గురించి అడగడం తప్పు, అని నేను అనుకుంటున్నంతలోనే  ఆవిడ తొందర్లోనే నిర్ణయం తీసుకుంటాను అని చెప్పడం నాకు చాలా ఆశ్చర్యం కలిగించింది. ఆవిడ చాలా దైర్యవంతురాలు అనే విషయం తెలుసు. జుబ్లీ హిల్స్ కారు బాంబు కేస్ అప్పుడు ఆవిడ కిటికీ లోనుండి దూకి పోలీసులకు దొరక్కుండా తప్పించుకున్నట్టు చదివిన గుర్తు. భర్త చనిపోయి 24 గంటలు గడవకముందే ఆవిడ ఇలా మాట్లాడడం ఊహించలేకపోతున్నాము.

రాజకీయాల్లో అందరూ జగన్ లే కనిపిస్తున్నారు. పదవి, అధికారం, డబ్బు మనుషుల్లో మనిషిని చంపెస్తున్నాయా?  అంటే అయిన వాళ్ళు చచ్చిపోతే ఏడుస్తూ కూర్చోవాలని నేను అనడం లేదు, కానీ సమయం అది కాదు అని నాకనిపిస్తోంది. నేను మణుగూరు లో వర్క్ చేస్తున్నప్పుడు చిరంజీవి రాజు గారని ఒక కమ్యూనిస్ట్ లీడర్ చనిపోతే వెళ్ళాను. బౌతిక కాయాన్ని తీసుకువచ్చి పార్టీ ఆఫీస్ లో ఉంచారు. పాపం ఆయన భార్యాపిల్లలు ఏడవడానికి కూడా లేకుండా చుట్టూ జనమే. ఆయన్ని సరిగ్గా చూసుకోవడం కూడా వాళ్లకి కుదరలేదు. ఒక నాయకుడు పోయినప్పుడు వాళ్ళ భార్యాపిల్లలకి ఏడ్చే అవకాసం లేకుండా చేస్తున్నారు కదా అని నాకు అప్పుడు అనిపించింది. కానీ ఇప్పటి రాజకీయ కుటుంబాల పరిస్థితి చూస్తుంటే చుట్టూ జనం వుంటే ఏడ్చే అవసరం వుండదు  కదా అని అనుకుంటున్నట్టు వుంది. అధికారాన్ని వారసత్వం గా పొందే రాజుల కాలంలో అధికారం కోసం తండ్రులను, సోదరులను చంపిన చరిత్రలు చదివాము, భర్త ఉద్యోగం కోసం భర్తల్ని చంపిన భార్యల్ని చూసాము. అధికారాన్ని పూర్వం లాగే వారసత్వంగా ఇస్తూ పొతే తొందర్లోనే మనం  అధికారం కోసం భర్తల్ని, తండ్రులని చంపే రాజకీయ వ్యవస్తని చూస్తాము.

No comments:

Post a Comment